13
October, 2026

A News 365Times Venture

13
Tuesday
October, 2026

A News 365Times Venture

Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు… సీట్లు దక్కేదెవరికి…?

Date:

Off The Record: స్థానిక ఎన్నికల ముంగిట్లో… తూర్పుగోదావరి జిల్లాలో మారుతున్న పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని సీట్ల కోసం బీజేపీ, జనసేన పోటీ పడుతున్నాయట. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని నిడదవోలు, కొవ్వూరు, మండపేట మున్సిపాలిటీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రాజమండ్రి కార్పొరేషన్ ఎస్సీ, నిడదవోలు మున్సిపాలిటీ ఎస్సీ, కొవ్వూరు బీసీ, మండపేట జనరల్‌ కోటాలో ఉన్నాయి. దీంతో… ఇప్పటి వరకు టిక్కెట్లు ఆశించిన కూటమిలోని వివిధ పార్టీల ఆశావాహులు కంగుతిన్నారట. ఓసీ జనరల్ అవుతాయని భావించిన రాజమండ్రి, నిడదవోలు ఎస్సీలకు రిజర్వ్‌ అయ్యాయి. ఇన్నాళ్ళు ఈ రెండు సీట్లను మూడు పార్టీల్లోని ఓసీలు ఆశించారు. దీంతో వాళ్ళంతా నిరాశ పడటం ఒక ఎత్తయితే… ఏదేమైనా సరే… మన పట్టు తగ్గకూడదంటూ… తమ పార్టీలకే చెందిన, ఆయా సామాజికవర్గాల్లో బలమైన నాయకుల కోసం అన్వేషణ మొదలుపెట్టిన్టటు తెలుస్తోంది. దీంతో తూర్పుగోదావరి కూటమిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు.

ప్రత్యేకించి టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట బీజేపీ, జనసేన ఆశించడంతో రాజకీయం రక్తి కడుతోంది. రాజమండ్రి సిటీలో టిడిపి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ… ఆ సీటు మాకే కావాలంటూ పోటీ పడుతున్నాయి బీజేపీ, జనసేన. కానీ… ఆ పార్టీలకు ఆర్థికంగా, సామాజికంగా అంత బలమైన నేతలు లేరట. రాజమండ్రి మేయర్ సీటు బీజేపీకే వదిలి పెడతారనే ప్రచారం మొదట్లో జరిగింది. కానీ… ఇప్పుడు ఎస్సీ రిజర్వ్‌ కావడంతో… కాషాయ నేతలు కాస్త గందరగోళంలో ఉన్నారట. జనసేనలోనూ ఇదే పరిస్థితి. దీంతో… వాళ్ళే ఎలాగోలా నాయకుల్ని వెదుక్కుని ఎవరైనా కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపుతారా…! లేక తెలుగుదేశం పార్టీకి వదిలి పెడతారా..! అన్నది లేటెస్ట్‌ డిస్కషన్‌. ఇప్పటి వరకు మూడుసార్లు జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి వరుసగా రాజమండ్రి మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. దాంతో… మళ్లీ టిడిపికే వదిలిపెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు. మారిన పరిస్థితుల్లో…. రాజమండ్రి మేయర్ టిక్కెట్టు దక్కకపోతే… కనీసం కొవ్వూరు మున్సిపల్‌ ఛైర్మన్‌ సీటు అయినా దక్కించుకోవాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ సీటు బీసీలకు రిజర్వ్‌ అవడంతో… బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర రేస్‌లోకి వచ్చారు. కానీ… కొవ్వూరు టీడీపీ నాయకులు పలువురు మాకంటే మాకంటూ ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. నిడదవోలు మున్సిపాలిటీ ఎస్సీ మహిళకు రిజర్వ్‌ అవడం కూటమి పార్టీలకి కత్తి మీద సాము అయిందట. ఇక్కడ ఆ స్థాయి మహిళా అభ్యర్థులు కరవైనట్టు చెప్పుకుంటున్నారు.

దీంతో… కాంట్రాక్టర్ బయ్యా వెంకట్రావు కుటుంబం నుండి ఒకరిని రంగంలోకి దింపే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో ఇక్కడ రిజర్వేషన్‌ని మార్చడానికికి ప్రయత్నిస్తున్నారనే గుసగుసలు సైతం ఉన్నాయి. ఇక జనరల్‌లో ఉన్న మండపేటకు టిడిపి నుండే అభ్యర్థి ఖరారు కావచ్చని అంటున్నారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తమ్ముడి కుమారుడు వేగుళ్ల అజయ్ బాబు పోటీ చేయవచ్చంటున్నారు. ఆయన మీద వైసీపీ నుంచి వేగుళ్ల చైతన్య బాబు పోటీ చేస్తారన్న మాట వినిపిస్తోంది. వీళ్ళిద్దరు ప్రత్యర్తులు అయితే మాత్రం పోటీ రసవత్తంగా మారుతుంది. మొత్తం మీద రిజర్వేషన్స్‌ అనుకున్నట్టు రాకపోవడం, టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట మిత్ర పక్షాలు సీటు ఆశించడం లాంటి పరిణామాలతో తూర్పుగోదావరి కూటమి మున్సిపల్‌ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది.

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

2000 രൂപക്ക് മുകളിലെ വാണിജ്യ യു.പി.ഐ ഇടപാടുകള്‍ക്കുള്ള മര്‍ച്ചന്റ് ഫീ ദീപാവലിക്ക് ശേഷമെന്ന് എന്‍.പി.സി.ഐ

ന്യൂദല്‍ഹി: 2000 രൂപയ്ക്ക് മുകളിലുള്ള വാണിജ്യ യു.പി.ഐ ഇടപാടുകള്‍ക്ക് മേലുള്ള മര്‍ച്ചന്റ്...

அரிசி முதல் காய்கறி வரை.! – திடீர் விலைவாசி உயர்வுக்கு காரணம் என்ன? அரசு என்ன செய்ய வேண்டும்?

சமீபகாலமாக அரிசி, பருப்பு, காய்கறிகள் உள்ளிட்ட அத்தியாவசியப் பொருட்களின் விலை கடுமையாக...

“சோதனை காலகட்டத்தில் அன்புமணிக்கு உறுதுணையாக நின்றது அதிமுக!” – அக்ரி கிருஷ்ண மூர்த்தி பேட்டி

55-வது ஆண்டுவிழாவைக் கொண்டாடிவரும் அ.தி.மு.க, இடைத்தேர்தலில் சிட்டிங் தொகுதிகள் இரண்டையும் த.வெ.க-விடம்...