11
October, 2026

A News 365Times Venture

11
Sunday
October, 2026

A News 365Times Venture

Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు

Date:

దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు, రాజకీయ ప్రచారం నుంచి ప్రతిపక్షాలు వెనక్కి తగ్గబోవని స్పష్టం చేశారు. యువత చేస్తున్న నిరసనలకు తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో రాహుల్ గాంధీ స్పందిస్తూ.. తాను పదేళ్లకు పైగా నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్‌తో రాజకీయంగా పోరాడుతున్నానని పేర్కొన్నారు. వారి రాజకీయ విధానాలు, తీరుతెన్నుల గురించి తనకు పూర్తిగా తెలుసునని వ్యాఖ్యానించారు.

మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లను లక్ష్యంగా చేసుకుని ఆయన విమర్శలు చేశారు. ఈ పరిణామాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆరోపిస్తూ.. వారిపై రాజకీయ ఒత్తిడి పెరుగుతోందని వ్యాఖ్యానించారు. “మోడీజీ.. మీకు నచ్చినది చేసుకోండి. 10 వేల మంది, 20 వేల మంది, 50 వేల మంది పోలీసులను అయినా రంగంలోకి దించండి. మేము వెనక్కి తగ్గేది లేదు” అని పేర్కొన్నారు.

ప్రస్తుత రాజకీయ పోరాటంలో అవసరమైన సమాచారం తమ దగ్గర ఇప్పటికే ఉందని రాహుల్ గాంధీ అన్నారు. దేశ యువత చేస్తున్న నిరసనలపై గర్వంగా ఉందని పేర్కొంటూ.. ఆందోళనలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. “యువతా.. మీకు అండగా మేమున్నాం. రాజ్యాంగంపై దాడి చేసిన ఈ ప్రభుత్వాన్ని, దాని విధానాలను ఓడించేందుకు కృషి చేస్తాం” అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేపట్టిన రాజకీయ ప్రచారం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అక్టోబర్ 10న చేపట్టిన నిరసన నేపథ్యంలో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు, భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణాత్మక పరిస్థితులు ఏర్పడినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఆందోళనలకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్నది నిరసనకారుల ప్రధాన డిమాండ్‌గా ఉంది. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. నివేదికల ప్రకారం.. ఢిల్లీ వ్యాప్తంగా 40 వేల మందికి పైగా పోలీసులు, పారా మిలిటరీ సిబ్బందిని మోహరించారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മോദി ഇന്ത്യയ്ക്ക് നാണക്കേട്; ഇത്ര വലിയ ഭീരുവിനെയും ബുള്ളിയെയും രാജ്യം കണ്ടിട്ടില്ല: അഭിജിത് ദീപ്‌കെ

ന്യൂദല്‍ഹി: ദല്‍ഹി പൊലീസിന്റെ കസ്റ്റഡിയില്‍ നിന്ന് പുറത്ത് വന്നതിന് പിന്നാലെ പ്രധാനമന്ത്രി...

”அதிமுகவின் நிலை வேதனைக்குரியது; அந்தக் கட்சி இன்று மழுங்கிவிட்டது” – கடம்பூர் ராஜூ வேதனை

தூத்துக்குடி மாவட்டம், கோவில்பட்டியில் முன்னாள் அமைச்சரும், த.வெ.க., துணைப் பொதுச் செயலாளருமான...

മുഖ്യ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണർക്കെതിരെ പ്രക്ഷോഭം ശക്തമാക്കാൻ സി.ജെ.പി; മുംബൈയിൽ ഇന്ന് സമരം

ന്യൂദൽഹി: മോദിയും അമിത് ഷായും ചേർന്ന് രാജ്യത്തെ ഏകാധിപത്യത്തിലേക്ക് നയിക്കുകയാണെന്നും ഇതിനെതിരെ...

"உக்ரைனுக்கு புதிய அதிபர் வர வேண்டிய நேரம் வந்துவிட்டது" – ரஷ்யாவிடம் 'டீல்' போட்ட ட்ரம்ப் கருத்து

நேற்று முன்தினம் (அக்டோபர் 9) அமெரிக்க அதிபர் டரம்ப், ரஷ்யாவுடன் டீசல்...