22
November, 2026

A News 365Times Venture

22
Sunday
November, 2026

A News 365Times Venture

Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్

Date:

లక్నో వేదికగా భారత్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు ఓటమిపాలైన తర్వాత ఆ జట్టు కెప్టెన్ షాయ్ హోప్ మ్యాచ్ ఫలితంపై స్పందించారు. తాము ఇన్నింగ్స్ ఆఖర్లో తగినన్ని పరుగులు చేయలేకపోయామని, భారత్‌లో ఆడుతున్నప్పుడు బోర్డుపై భారీ స్కోరు ఉంటేనే బౌలర్లకు తగినంత రక్షణ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. మ్యాచ్‌లో తాము నిర్దేశించిన లక్ష్యం సరిపోలేదని, ముఖ్యంగా భారత్ వంటి పిచ్‌లపై పెద్ద లక్ష్యాన్ని కాపాడుకోవడం ఎప్పుడూ కష్టమేనని తెలిపారు. తమ జట్టు కాంబినేషన్ కారణంగా టాప్-ఆర్డర్ బ్యాటర్లు కూడా బౌలింగ్ చేయాల్సి వచ్చిందని, తమ వద్ద కేవలం ఇద్దరు స్పిన్నర్లు మాత్రమే ఉండటంతో కేవలం ఎనిమిది ఓవర్ల స్పిన్ కోటానే లభించిందని వివరించారు. భారత్ తమకంటే చాలా అద్భుతంగా ఆడి విజయం సాధించిందని, లక్నో స్టేడియంలో బ్యాటింగ్ చేయడం తనకు ఎప్పుడూ ఇష్టమేనని షాయ్ హోప్ పేర్కొన్నారు.

మరోవైపు.. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత బ్యాటర్ ఇషాన్ కిషన్ మ్యాచ్ అనంతరం తన అనుభవాలను పంచుకున్నారు. తాను పట్టిన అద్భుతమైన క్యాచ్ గురించి మాట్లాడుతూ.. స్టేడియంలోని ఫ్లడ్ లైట్ల వెలుతురు నేరుగా కళ్లపై పడటంతో బంతిని అంచనా వేయలేకపోయానని, అయితే బంతి తన నడుము భాగం వద్దకు వస్తుందన్న చిన్న నమ్మకంతో అలాగే ప్రయత్నించానని, చివరికి అది తన చేతిలో పడటం చాలా సంతోషాన్నిచ్చిందని చెప్పాడు. శ్రేయాస్ అయ్యర్‌కు స్ట్రైక్ ఇవ్వడంపై స్పందిస్తూ.. శ్రేయాస్ అద్భుతమైన టచ్‌లో ఉన్నాడని, ఆ సమయంలో అతడిని క్రీజులో ఉంచి మొమెంటం కోల్పోకుండా చూడటమే తన ప్రధాన బాధ్యతగా భావించానని తెలిపాడు. తాను ఆ సమయంలో గొప్ప టచ్‌లో లేకపోవడంతో, అయ్యర్‌ను వీలైనన్ని ఎక్కువ బంతులు ఆడేలా చేయడం సులువైన నిర్ణయమని ఇషాన్ కిషన్ వివరించాడు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

എഫ്.ബി.ഐ ഡാറ്റബേസില്‍ സുരക്ഷാ വീഴ്ച; സൈബര്‍ അക്രമികള്‍ അതിക്രമിച്ച് കയറി

ന്യൂയോര്‍ക്ക്: യു.എസില്‍ ഫെഡറല്‍ ബ്യൂറോ ഓഫ് ഇന്‍വെസ്റ്റിഗേഷന്റെ (എഫ്.ബി.ഐ) ഡാറ്റബേസില്‍ സുരക്ഷാ...

‘அதிமுகவில் இரண்டு கோடி உறுப்பினர்களில் எஸ்.பி. வேலுமணியும் ஒருவர்’ – எடப்பாடி பழனிசாமி காட்டம்!

கோவை விமான நிலையத்தில் அ.தி.மு.க பொதுச்செயலாளர் எடப்பாடி பழனிச்சாமி செய்தியாளர்களுக்கு பேட்டிளியத்தார்....

Ind Vs Nepal: నేపాల్‌పై భారత్-ఏ భారీ విజయం.. 306 పరుగుల తేడాతో వరల్డ్ రికార్డు బద్దలు..

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో భారత్-ఏ జట్టు నేపాల్‌పై...

ഫ്രാന്‍സില്‍നിന്ന് ബ്രിട്ടണിലേക്ക് കുടിയേറ്റക്കാരെ എത്തിച്ച ബോട്ട് കത്തികൊണ്ട് കീറി: തീവ്ര വലത് പ്രവര്‍ത്തകന് 15 മാസം തടവ്

ലണ്ടന്‍: ഫ്രാന്‍സില്‍ നിന്ന് കുടിയേറ്റക്കാരെ ബ്രിട്ടനിലേക്ക് എത്തിച്ച ചെറുബോട്ട് കത്തികൊണ്ട് കീറിനശിപ്പിച്ച...