22
November, 2026

A News 365Times Venture

22
Sunday
November, 2026

A News 365Times Venture

Ind Vs Nepal: నేపాల్‌పై భారత్-ఏ భారీ విజయం.. 306 పరుగుల తేడాతో వరల్డ్ రికార్డు బద్దలు..

Date:

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో భారత్-ఏ జట్టు నేపాల్‌పై 306 పరుగుల ఘన విజయంతో అద్భుత ఆరంభం చేసింది. దోహా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్-ఎ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేయగా, నేపాల్ జట్టు కేవలం 11.3 ఓవర్లలో 26 పరుగులకే ఆలౌటైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్-ఏ 42 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో కెప్టెన్ తిలక్ వర్మ, వికెట్ కీపర్ బ్యాటర్ కుమార్ కుశాగ్ర కలిసి జట్టును ఆదుకున్నారు.

వీరిద్దరూ నాలుగో వికెట్‌కు ఏకంగా 206 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. కుశాగ్ర 102 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 117 పరుగులు చేయగా, తిలక్ వర్మ 113 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 107 పరుగులు సాధించాడు. చివర్లో సూర్యాంశ్ షెడ్గే కేవలం 14 బంతుల్లో 4 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 36 పరుగులు చేసి జట్టు స్కోరును 330 దాటించాడు. నేపాల్ బౌలర్లలో లలిత్ రాజ్‌బన్షీ, సందీప్ లమిచానే తలో మూడు వికెట్లు తీయగా, నందన్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు.

333 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ బ్యాటర్లు భారత పేసర్ల ధాటికి నిలబడలేకపోయారు. తొలి ఓవర్ మూడో బంతికే అర్జున్ కుమల్‌ను హర్షిత్ రాణా ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేయగా, ఆ తర్వాత ప్రిన్స్ యాదవ్ వరుస వికెట్లతో నేపాల్‌ను దెబ్బకొట్టాడు. ఏడో ఓవర్ ముగిసేసరికి నేపాల్ 17 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ప్రిన్స్ యాదవ్ 5 ఓవర్లలో కేవలం 6 పరుగులిచ్చి 5 వికెట్లు తీయగా, హర్షిత్ రాణా 6 ఓవర్లలో 16 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. షాబాజ్ అహ్మద్ ఒక వికెట్ తీశాడు. నేపాల్ జట్టులో ఎవరూ పది పరుగులు కూడా చేయలేకపోయారు.

నేపాల్ చేసిన 26 పరుగుల స్కోరు లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో ఐదో అత్యల్ప ఆలౌట్ స్కోరుగా నిలిచింది. గతంలో వెస్టిండీస్ అండర్-19 (18), సారాసెన్స్ స్పోర్ట్స్ క్లబ్ (19), మిడిల్‌సెక్స్ (23), ఒమన్ (24) తక్కువ స్కోర్లకు ఆలౌటయ్యాయి. తిలక్ వర్మ సారథ్యంలో బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణించడంతో భారత్-ఏ ఏకపక్ష విజయాన్ని అందుకుంది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

എഫ്.ബി.ഐ ഡാറ്റബേസില്‍ സുരക്ഷാ വീഴ്ച; സൈബര്‍ അക്രമികള്‍ അതിക്രമിച്ച് കയറി

ന്യൂയോര്‍ക്ക്: യു.എസില്‍ ഫെഡറല്‍ ബ്യൂറോ ഓഫ് ഇന്‍വെസ്റ്റിഗേഷന്റെ (എഫ്.ബി.ഐ) ഡാറ്റബേസില്‍ സുരക്ഷാ...

‘அதிமுகவில் இரண்டு கோடி உறுப்பினர்களில் எஸ்.பி. வேலுமணியும் ஒருவர்’ – எடப்பாடி பழனிசாமி காட்டம்!

கோவை விமான நிலையத்தில் அ.தி.மு.க பொதுச்செயலாளர் எடப்பாடி பழனிச்சாமி செய்தியாளர்களுக்கு பேட்டிளியத்தார்....

ഫ്രാന്‍സില്‍നിന്ന് ബ്രിട്ടണിലേക്ക് കുടിയേറ്റക്കാരെ എത്തിച്ച ബോട്ട് കത്തികൊണ്ട് കീറി: തീവ്ര വലത് പ്രവര്‍ത്തകന് 15 മാസം തടവ്

ലണ്ടന്‍: ഫ്രാന്‍സില്‍ നിന്ന് കുടിയേറ്റക്കാരെ ബ്രിട്ടനിലേക്ക് എത്തിച്ച ചെറുബോട്ട് കത്തികൊണ്ട് കീറിനശിപ്പിച്ച...

திருப்பரங்குன்றம் தீப விவகாரம்… இருதலைக்கொள்ளி நிலையில் முதல்வர் விஜய்!

திருப்பரங்குன்றம் தீப விவகாரம் தமிழக அரசியலில் மீண்டும் அனலைக் கிளப்பியிருக்கிறது. கடந்த...