3
October, 2026

A News 365Times Venture

3
Saturday
October, 2026

A News 365Times Venture

Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..

Date:

Maharashtra Tragedy: మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలోని దివేగర్ బీచ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పూణేలోని అలందీకి చెందిన ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌కు చెందిన విద్యార్థులు గురువారం విహారయాత్రకు వెళ్లారు. సముద్రంలో ఈతకు దిగి 8 మంది విద్యార్థులు నీటిలో కొట్టుకుపోయారు. ఈ టూర్‌కు మొత్తం 48 మంది టీమ్ వెళ్లింది. ఇందులో 25 మంది బాలురు, 17 మంది బాలికలు ఉన్నారు. వీరంతా పూణేలోని విన్నర్ అకాడమీలో 11,12 తరగతులకు కోచింగ్ తీసుకుంటున్నారు. చనిపోయిన వారు 16 ఏళ్ల వారని అధికారులు చెప్పారు.

విద్యార్థులు దివేగర్ లోని దిఘి సాగరి ప్రాంతానికి చేరుకున్న తర్వాత బీచ్‌లో ఈతకు దిగారు. ఆ సమయంలో అలలు, ప్రవాహం బలంగా ఉండటంతో 8 మంది సముద్రంలో కొట్టుకుపోయింది. నీటి లోతు, ప్రవాహ తీవ్రతను అంచనా వేయలేకపోవడంతో పెను విషాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు కొట్టుకుపోయిన వెంటనే స్థానికులు, పోలీసులు రెస్క్యూ చర్యలు ప్రారంభించారు.

చాలాసేపటి తర్వాత 8 మంది మృతదేహాలను ఒడ్డుకు తీసుకువచ్చారు. మృతుల్లో తన్మయ్ దత్తాత్రయ్ వహిలే, సుమిత్ భారత్ అహిరే, ప్రణవ్ రామ్‌దాస్ బన్సోడే, కైవల్య సతీశ్ వాసంకర్, రాజ్‌వీర్ యువరాజ్ వహిలే, యశ్ కిరణ్ వాంఖడే, సోహమ్ తుకారాం భాండ్వల్కర్, కౌస్తుభ్ సందీప్ దౌండ్ ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഗ്യാനേഷ് രാജിവെച്ചില്ലെങ്കില്‍ ഈ മാസം പത്തിന് ദല്‍ഹിയിലേക്ക് മാര്‍ച്ച്; ജന്തര്‍ മന്തറില്‍ പ്രതിഷേധം പ്രഖ്യാപിച്ച് സി.ജെ.പി

മുംബൈ: മുഖ്യതെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ ഗ്യാനേഷ് കുമാറിന്റെ രാജി ആവശ്യപ്പെട്ട് ഈ മാസം...

மருத்துவர், செவிலியர்கள் இல்லையென புகார்; நள்ளிரவில் ஏரல் மருத்துவமனையில் எம்.எல்.ஏ திடீர் ஆய்வு!

தூத்துக்குடி மாவட்டம், ஏரல் பகுதி எப்போதும் பரபரப்பாக காணப்படும் முக்கிய வணிகப்...

ಮೈಸೂರು ಅರಮನೆಯ ‘ಧ್ವನಿ ಮತ್ತು ಬೆಳಕು’ ಕಾರ್ಯಕ್ರಮ ತಾತ್ಕಾಲಿಕ ರದ್ದು

ಮೈಸೂರು, ಅಕ್ಟೋಬರ್, 2,2026 (www.justkannada.in): ನಾಡಹಬ್ಬವಾದ ದಸರಾ ಮಹೋತ್ಸವದ-2026ರ ಪ್ರಯುಕ್ತ...

Dool in Depth: പ്രതിഷേധച്ചൂടില്‍ ഇന്ത്യന്‍ നഗരങ്ങള്‍; വോട്ട് തട്ടിപ്പിനെതിരെ തെരുവിലിറങ്ങി ആയിരങ്ങള്‍

രാജ്യത്തെ മുഖ്യ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ ഗ്യാനേഷ് കുമാറിന്റെ രാജി അടക്കമുള്ള ആവശ്യങ്ങളുന്നയിച്ച്...