29
September, 2026

A News 365Times Venture

29
Tuesday
September, 2026

A News 365Times Venture

Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..

Date:

తిరువనంతపురంలో వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన తర్వాత, భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. మ్యాచ్ ముగిసిన అనంతరం జట్టు హోటల్‌కు తిరిగి వస్తున్న సమయంలో టీమ్ బస్సు దిగుతుండగా రోహిత్ ప్రమాదవశాత్తు జారిపడ్డారు. అదృష్టవశాత్తు రోహిత్ శర్మకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

కేరళ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఛేజింగ్, కుల్దీప్ యాదవ్ మాయాజాలం వల్ల భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య రెండో వన్డే సెప్టెంబర్ 30న జరగనుంది. అయితే మ్యాచ్ అనంతరం హోటల్ వద్ద బస్సు దిగుతున్న సమయంలో రోహిత్ కాలుజారి పడిపోయిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. బస్సు మెట్లు దిగుతున్న సమయంలో ఆయన అకస్మాత్తుగా జారి కిందపడగా, అక్కడే ఉన్న వలంటీర్లు వెంటనే స్పందించి రోహిత్‌ను సురక్షితంగా లేపారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకుండా జాగ్రత్తపడ్డారు. ఈ ఘటన జరిగిన వెంటనే విరాట్ కోహ్లీ చాలా ఆందోళన చెందారు. రోహిత్‌కు చేతికి గాని లేదా ఇతర ప్రాంతాల్లో గాయాలు కాలేదని నిర్ధారించుకునే వరకు ఆయన వైపే శ్రద్ధగా చూస్తూ అంతా సవ్యంగా ఉందో లేదో అని పరిశీలించారు.

మరోవైపు.. మ్యాచ్‌లో రోహిత్ ప్రదర్శనపై ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు ఇయాన్ బిషప్ ప్రశంసలు కురిపించారు. రోహిత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారని, ఇన్నింగ్స్ ప్రారంభించిన తీరు అత్యద్భుతంగా ఉందని కొనియాడారు. అయితే.. అంత తేలికైన బంతికి అలా ఔట్ కావడం పట్ల రోహిత్ స్వయంగా అసంతృప్తి చెంది ఉంటారని తెలిపారు. అలాగే భవిష్యత్తుపై తన ఆలోచనలను పంచుకుంటూ, రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచ కప్ గురించిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తన క్రికెట్ ప్రయాణం ముగిసిందనే ఆలోచన తన మనసులోకి రాదని, ఆడుతున్నంత కాలం ఎదురుచూడదగ్గ విషయాలు చాలా ఉంటాయని తెలిపారు. రాబోయే ప్రపంచ కప్ కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు రోహిత్ స్పష్టం చేశారు. ఐసీసీ టోర్నమెంట్లు ఆడేటప్పుడు ప్రతిసారీ సరికొత్త సవాళ్లు ఎదురవుతాయని, ప్రత్యర్థులు, వేదికలు మారుతుంటాయి కాబట్టి అందుకు తగినట్లుగానే భిన్నమైన ఆలోచనలతో సిద్ధం కావాల్సి ఉంటుందని ఆయన వివరించారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മോദിയെ വിമർശിച്ചതിന് പിന്നാലെ നടപടി; കാർട്ടൂണിസ്റ്റ് സതീഷ് ആചാര്യയുടെ ഇൻസ്റ്റാഗ്രാം പേജ് ഇന്ത്യയിൽ ബ്ലോക്ക് ചെയ്തു

ന്യൂദൽഹി: പ്രമുഖ രാഷ്ട്രീയ കാർട്ടൂണിസ്റ്റ് സതീഷ് ആചാര്യയുടെ ഇൻസ്റ്റാഗ്രാം അക്കൗണ്ടിന് ഇന്ത്യയിൽ...

"நான் அவர்களை குறிப்பிடவில்லை, மோகன் குமாரமங்கலம் எனக்கு தோழர்.!"- சர்ச்சைக்கு ராஜ்மோகன் விளக்கம்

தேர்தல் ஆணையர் ஞானேஷ் குமார் தன்னிச்சையாக செயல்பட்டிருப்பதால் அவர் பதவி விலக...

ಪ್ರೀತಿಗೆ ನಿರಾಕರಣೆ: ಪೆಟ್ರೋಲ್ ಸುರಿದು, ಯುವತಿ ತಬ್ಬಿಕೊಂಡು ಬೆಂಕಿ ಹಚ್ಚಿಕೊಂಡ ಯುವಕ

ಮೈಸೂರು, ಸೆಪ್ಟಂಬರ್,29, 2026 (www.justkannada.in):  ಪ್ರೀತಿಸುವಂತೆ ನಿರಂತರವಾಗಿ ದುಂಬಾಲು ಬಿದ್ದಿದ್ದ...

‘വിഷം പഠിപ്പിക്കുന്നു’; സര്‍വകലാശാലാ പാഠ്യപദ്ധതിയിലെ അംബേദ്കര്‍ രചനകളില്‍ പ്രധാനമന്ത്രിയുടെ ഓഫീസിന്റെ പരിശോധന

ന്യൂദല്‍ഹി: രാജ്യത്തെ സര്‍വകലാശാലകളിലെ പാഠ്യപദ്ധതിയില്‍ ഉള്‍പ്പെടുത്തിയിട്ടുള്ള അബേദ്ക്കറിന്റെ രചനകളെക്കുറിച്ച് പ്രധാനമന്ത്രിയുടെ ഓഫീസ്...