18
September, 2026

A News 365Times Venture

18
Friday
September, 2026

A News 365Times Venture

Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు

Date:

మహిళలు ఎల్పీజీ సిలిండర్లను ఎత్తలేరన్న కారణంతో ఉద్యోగం నిరాకరించినందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఇది మహిళలను అవమానించడమేనని పేర్కొంది. మహిళకు రూ.12 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

హర్యానాలోని గూఢా గ్రామానికి చెందిన సుమిత్రకు లింగ వివక్ష కారణంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎల్‌పీజీ బాట్లింగ్ ప్లాంట్‌లో ఉద్యోగం నిరాకరించారు. ఎల్‌పిజి బాట్లింగ్ ప్లాంట్‌లో రీఫిల్లింగ్ హెల్పర్ లేదా క్యాజువల్ ఖలాసీ పదవికి డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలోని స్థానిక కమిటీ సిఫార్సు చేసిన 49 మందిలో సుమిత్ర కూడా ఒకరు. కేవలం మహిళ అయినందుకే ఆమెకు ఆ నియామకాన్ని నిరాకరించారు. దీంతో బాధిత మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే ఈ చర్యను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇది స్త్రీత్వానికి అవమానమని పేర్కొంది. ప్రస్తుతం ఆమె పదవీ విరమణ వయస్సు చేరుకోవడంతో ఉద్యోగానికి బదులుగా రూ.12 లక్షల పరిహారం చెల్లించాలని ధర్మాసనం ఆదేశించింది.

జస్టిస్‌లు అరవింద్ కుమార్, విపుల్ ఎం. పంచోలిలతో కూడిన ధర్మాసనం కార్పొరేషన్‌ను తీవ్రంగా విమర్శించింది. అయితే ఉద్యోగంలో బరువైన ఎల్‌పీజీ సిలిండర్లను ఎత్తడం, రాత్రి షిఫ్టులు చేయడం వంటివి ఉంటాయని.. అందువల్ల అధికారులు మహిళలను తగినవారిగా పరిగణించకపోవచ్చని ఇండియన్ ఆయిల్ తరఫు న్యాయవాది వాదించారు. మహిళలు కూడా తమ ఇళ్లలో పగలు, రాత్రి గ్యాస్ సిలిండర్లను ఎత్తడం, మార్చడం చేస్తుంటారని కోర్టు వ్యాఖ్యానించింది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

”அது AI போட்டோ; போலி புகார்; என் மீதான நடவடிக்கையை ஏற்க முடியாது" – கருப்பு முருகானந்தம்!

திருவாரூர் மாவட்டத்தைச் சேர்ந்த கருப்பு முருகானந்தம் தஞ்சாவூரில் வசித்து வருகிறார். தமிழக...

Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!

Pakistan: అరేబియా సముద్రంలో పాకిస్తాన్ నేవీ, భారత నేవీని కవ్వించే ప్రయత్నం...

ಕರಾವಳಿಗೆ ಹೊಸ ಟೂರಿಸಂ ಪಾಲಿಸಿ: ರಾಜ್ಯದ 2ನೇ ಆಧಿಕೃತ ಭಾಷೆಯಾಗಿ ತುಳು – ಸಿಎಂ ಡಿಕೆಶಿ ಘೋಷಣೆ

ಮಂಗಳೂರು,ಸೆಪ್ಟಂಬರ್,18,2026 (www.justkannada.in): ಮಲೆನಾಡು ಕರಾವಳಿ ಪ್ರದೇಶಕ್ಕೆ ಹೊಸ ಟೂರಿಸಂ ಪಾಲಿಸಿ...