18
September, 2026

A News 365Times Venture

18
Friday
September, 2026

A News 365Times Venture

OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..

Date:

టీడీపీలో కొత్తగా చేరిన చిన్న శ్రీను సడన్‌గా గోవా టూర్‌ ఎందుకు పెట్టుకున్నారు? అక్కడ గవర్నర్‌ అశోక్‌గజపతి రాజుతో ప్రత్యేకంగా ఎందుకు భేటీ అయ్యారు? ఇద్దరి మధ్య ప్యాచ్‌వర్క్‌ మొదలైందా? గతం చేసిన గాయాలను గోవాలో ఇచ్చిన పూల బొకేలు మార్చేస్తాయా? ఆ విషయంలో అశోక్‌ అనుచరులు ఏమంటున్నారు? రివెంజ్‌ కథ కంచికి చేరినట్టేనా? లేక కొత్త మలుపులు ఉంటాయా? లెట్స్‌ వాచ్‌.

విజయనగరం జిల్లా ముఖ్య నేతల్లో ఒకరైన చిన్న శ్రీను వైసీపీ నుంచి టీడీపీలోకి ఎంటరైపోయారు. కానీ… ఈ ఎంట్రీతో లోకల్‌గా తెలుగు తమ్ముళ్లంతా హ్యాపీగా ఉన్నారా అంటే… ఠక్కున ఎస్‌ అని చెప్పలేకపోతున్నాయి ఆ పార్టీ వర్గాలు. దీనికి సంబంధించి ఇప్పుడు జిల్లాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు వర్గం ఈ విషయంలో అసహనంగా ఉందని చెప్పుకుంటున్నారు. చిన్న శ్రీను గతంలో వైసీపీలో ఉన్నప్పుడు నాటి పార్టీ నేత విజయసాయిరెడ్డితో కలిసి అశోక్‌ను ఇబ్బంది పెట్టారన్న డిస్కషన్‌ తెర మీదికి వచ్చింది.

ఆ పాత వ్యవహారాలను అశోక్‌ వర్గం ఇప్పుడు గుర్తు చేసుకుంటోందట. మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్ పదవి నుంచి సింహాచలం దేవస్థానం బోర్డు నియామకాల వరకు.. అనేక వ్యవహారాల్లో ఇప్పట్లో అశోక్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయని అంటున్నారు ఆయన సన్నిహితులు. అప్పట్లో ట్రస్టుల్లో అనువంశిక ధర్మకర్త అయిన అశోక్ గజపతి రాజుని తప్పించి… సంచయిత గజపతిని రంగంలోకి దింపడం తీవ్ర వివాదాస్పదమైంది. దానికి సంబంధించి అశోక్‌ న్యాయ పోరాటం చేశారు కూడా. అలాగే… రామతీర్థంలో రాములవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసినప్పుడు కొత్త విగ్రహాల కోసం తాను పంపిన విరాళాన్ని తిరస్కరించడం లాంటి పరిణామాలలో చిన్న శ్రీను పాత్రపై అశోక్‌గజపతి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారన్నది లోకల్‌ టాక్‌.

అంతేకాదు.. విజయనగరంలో నిరసన కార్యక్రమానికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు బంగ్లా గేటుకు తాళాలు వేయించిన వ్యవహారం.. చివరకు వైసీపీ పార్టీ కార్యాలయానికి సంబంధించిన పరిణామాల్లో సైతం చిన్న శ్రీను నుంచే ఇబ్బందులు వచ్చాయంటూ గోవా గవర్నర్‌ గుర్తు చేసుకుంటున్నారట. అందుకే… వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకునే… చిన్న శ్రీను ప్యాచ్‌వర్క్‌ మొదలుపెట్టారన్నది లేటెస్ట్‌ టాక్‌. తన కుమార్తెతో కలిసి, అశోక్ కుమార్తె, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మిని వెంటబెట్టుకుని గోవా వెళ్లడం కూడా ఇందులో భాగమేనని చెప్పుకుంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చిన్న శ్రీను.. విజయసాయిరెడ్డితో కలిసి తనను బాగా ఇబ్బందిపెట్టారన్న భావన అశోక్‌లో బలంగా ఉందని అంటున్నారు. మాస్సాస్ ఛైర్మన్, సింహాచలం ట్రస్ట్ బోర్డు నియామకాల్లాంటి వ్యవహారాల్లో రాజుగారు బాగా హర్ట్‌ అయ్యారని చెబుతున్నారు ఆయన సన్నిహితులు.

విజయనగరంలో రాజకీయంగా కీలకమైన సమయంలో బంగ్లా గేటుకు తాళాలు వేయించిన వ్యవహారం కూడా ఇప్పుడు మరోసారి చర్చకు వస్తోంది. చివరకు స్థానిక వైసీపీ కార్యాలయానికి సంబంధించిన వ్యవహారంలోనూ చిన్న శ్రీను కారణంగా ఇబ్బందులు ఎదురయ్యాయని టీడీపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో… చిన్న శ్రీను.. అదితిని వెంటబెట్టుకుని గోవా వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే ఆయనకు టీడీపీలో ఏ పదవి.. ఎలాంటి బాధ్యతలకు హామీ ఇచ్చారన్నది మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు.

ప్రస్తుతానికి పార్టీలో చేరి పని చేయాలని మాత్రమే సూచించారన్నది జిల్లా టీడీపీలో వినిపిస్తున్న మాట. ఇక్కడే అసలు అసంతృప్తి మొదలవుతోందన్నది మరో వాదన. నాడు తనను ఇబ్బందులకు గురిచేసిన వ్యక్తినే ఇప్పుడు పార్టీలోకి తీసుకుంటే.. గతాన్ని పూర్తిగా పక్కన పెట్టేయగలమా అన్నది అశోక్‌ అభిప్రాయంగా తెలుస్తోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరన్నది నిజమేగానీ…. గత పరిణామాల తాలూకు ప్రభావం వెంటనే పోతుందా అంటూ ఇప్పుడు విజయనగరంలో మాట్లాడుకుంటున్నారు. చిన్న శ్రీను ఎంట్రీతో లోకల్‌ వైసీపీ లెక్కలు ఎలా మారతాయోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ചിഹ്നവും പേരും മരവിപ്പിച്ചു: തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷനെതിരെ കടുത്ത പ്രതിഷേധവുമായി തൃണമൂൽ കോൺഗ്രസ്; പുതിയ പേരുകളും ചിഹ്നങ്ങളും സമർപ്പിച്ചു

കൊൽക്കത്ത: പശ്ചിമ ബംഗാളിൽ വരാനിരിക്കുന്ന നിയമസഭാ ഉപതെരഞ്ഞെടുപ്പുകൾക്ക് മുന്നോടിയായി ഔദ്യോഗിക പേരും...

“மூளை திசு ஆய்வு படிப்பை இவர் மட்டுமே படிக்கிறார்; அரசு உறுதுணையாக இருக்கும்" – அமைச்சர் வன்னி அரசு

அயலக மாணவர் பாரதிதாசனுக்குத் தேவையான அனைத்து கல்வி உதவித்தொகைகளும் தமிழ்நாடு அரசால்...

Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?

భారత్‌లో వైవాహిక అత్యాచారం (Marital Rape) అంశంపై దాదాపు దశాబ్దంగా కొనసాగుతున్న...

ನಮಗೆ ರಾಜಕೀಯಕ್ಕಿಂತ ಜನರ ಬದುಕು ಮುಖ್ಯ: ಸಿಎಂ ಡಿ.ಕೆ ಶಿವಕುಮಾರ್

ಮಂಗಳೂರು, ಸೆಪ್ಟಂಬರ್, 18,2026 (www.justkannada.in): ನಮಗೆ ರಾಜಕೀಯಕ್ಕಿಂತ ಜನರ ಬದುಕು...