13
September, 2026

A News 365Times Venture

13
Sunday
September, 2026

A News 365Times Venture

Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..

Date:

Bangladesh: బంగ్లాదేశ్‌లో విద్యుత్ సంక్షోభం ముదిరింది. జార్ఖండ్ రాష్ట్రంలోని అదానీ పవర్‌కు చెందిన గొడ్డా థర్మల్ పవర్ ప్లాంట్‌లోని రెండు యూనిట్లలో ఒక దానిలో బాయిలర్ సమస్య ఏర్పడింది. దీంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో 1600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ పవర్ ప్లాంట్‌లో ప్రస్తుతం ఉత్పత్తి సగానికి పడిపోయింది. బంగ్లాదేశ్‌తో దీర్ఘకాలిక ఒప్పందంలో భాగంగా దాదాపు 1500 మెగావాట్ల విద్యుత్ ఈ ప్లాంట్ నుంచే సరఫరా అవుతోంది. ఈ పరిణామాలు బంగ్లాదేశ్‌లో విద్యుత్ సమస్యల్ని మరింతగా పెంచనుంది. సరఫరా పూర్తిగా పునరుద్ధరించడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది.

గత కొంత కాలంగా బొగ్గు రవాణా సమస్యల కారణంగా ఈ ప్లాంట్ తక్కువ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఈ సమస్య పరిష్కారమవుతుందని అనుకుంటున్న సమయంలో ఒక యూనిట్ ట్రిప్ కావడం బంగ్లాదేశ్‌కు కరెంట్ షాక్‌గా చెప్పొచ్చు. బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డు అధికారుల ప్రకారం.. మరమ్మతు పనులు ప్రారంభించడానికి కనీసం 48 గంటల పట్టొచ్చు. ఆ తర్వాత విద్యుత్ పూర్తిస్థాయిలో పునరుద్ధరించడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది.

భారత్‌తో ఉద్రిక్తతల వేళ బంగ్లాకు కరెంట్ షాక్..

షేక్ హసీనా విషయంలో బంగ్లాదేశ్ భారత్‌ను హెచ్చరించే స్థాయికి వచ్చింది. 2024 ఆగస్టులో హింసాత్మక అల్లర్ల సమయంలో హసీనా బంగ్లా నుంచి భారత్ పారిపోయి వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఈ అల్లర్లలో మానవత్వానికి వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని బంగ్లాదేశ్ కోర్టు హసీనాకు మరణశిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ఆమెను అప్పగించాలని ఆ దేశం డిమాండ్ చేస్తోంది. ఈ అంశం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైంది.

బంగ్లా ప్రధాని తారిఖ్ రెహ్మాన్ భారత పర్యటనకు రాకుండా చైనా పర్యటనకు వెళ్లారు. బ్రిక్స్ సదస్సుకు ఆహ్వానం అందినా కూడా వింత కారణాలు చెబుతూ తారిఖ్ రెహ్మాన్ ఈ సమావేశాలకు రాలేదు. బిమ్‌స్టెక్ చైర్మన్ హోదాలో ఆహ్వానం అందిందని, బంగ్లా ప్రధాని హోదాలో ఆహ్వానం పంపలేదని ఆ దేశ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమాయున్ కబీర్ చెప్పారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഉക്രൈനിലേക്ക് സൈന്യത്തെ അയച്ചാൽ നേരിട്ടുള്ള യുദ്ധം: യൂറോപ്പിന് വ്ളാദിമിർ പുടിന്റെ മുന്നറിയിപ്പ്

ന്യൂദൽഹി: ഉക്രൈനിലേക്ക് യൂറോപ്യൻ രാജ്യങ്ങൾ സൈന്യത്തെ വിന്യസിക്കാൻ തുനിഞ്ഞാൽ അത് റഷ്യയുമായുള്ള...

"நீங்கள் திருந்தாவிட்டால் திருத்தப்படுவீர்கள்" – தவெகவிற்கு ஆ.ராசா எச்சரிக்கை

தமிழ்நாடு சட்டப்பேரவையில் தமிழ்நாடு முதலமைச்சர் விஜய் திமுகத் தலைவர் ஸ்டாலின் மிசா...

ಚಿದಂಬರರಾವ್ ಜಂಬೆ ಅವರಿಗೆ ನುಡಿ ನಮನ

ಮೈಸೂರು,ಸೆಪ್ಟಂಬರ್,12,2026 (www.justkannada.in): ಒಬ್ಬ ಕಲಾವಿದನ ಸಾವು ಒಂದು ಜೀವದ ಅಂತ್ಯವಾಗಬಹುದು…...

കൊങ്കണികളും മാല്‍വണികളും ഹിന്ദുത്വത്തിന്റെ പിന്തുണക്കാര്‍’; പ്രസ്താവനയുമായി ബി.ജെ.പി നേതാവ് അമീത് സതം

മുംബൈ: മുംബൈയില്‍ താമസിക്കുന്ന കൊങ്കണ്‍ മേഖലയിലെ കൊങ്കണി, മാല്‍വണി വിഭാഗങ്ങള്‍ ഉള്‍പ്പെടെയുള്ളവര്‍...