19
October, 2026

A News 365Times Venture

19
Monday
October, 2026

A News 365Times Venture

Skincare Tips: బ్యూటీ పార్లర్‌కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..

Date:

Natural Face Bleach at Home: ముఖంపై అవాంఛిత రోమాలను కవర్ చేయడానికి, ట్యాన్‌ను తొలగించి వెంటనే మెరుపు తీసుకురావడానికి చాలామంది మహిళలు పార్లర్‌కి వెళ్లి రసాయనాలతో కూడిన బ్లీచ్ చేయించుకుంటారు. అయితే, ఈ కెమికల్ బ్లీచింగ్ వల్ల చర్మంపై మంట, ఎరుపుదనం, పొడిబారడం మాత్రమే కాకుండా సుదీర్ఘకాలంలో స్కిన్ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఇంట్లో దొరికే ఐటమ్స్‌తోనే ముఖాన్ని సహజంగా, కాంతివంతంగా మార్చుకోవచ్చు. మన ఇంట్లో సులభంగా దొరికే బంగాళాదుంప, టమాటా, పెరుగు, నిమ్మకాయ వంటి పదార్థాల్లో సహజసిద్ధమైన బ్లీచింగ్ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి చర్మంపై ఉన్న నలుపును, పిగ్మంటేషన్‌ను క్రమంగా తగ్గించి, చర్మ ఛాయను స్పష్టంగా మెరుగుపరుస్తాయి. ఇప్పుడు కొన్ని టిప్స్ గురించి చూద్దాం..

1. బంగాళాదుంప, నిమ్మరసం బ్లీచ్

కావలసినవి: 1 స్పూన్ పచ్చి బంగాళాదుంప తురుము (లేదా రసం), 1/2 స్పూన్ నిమ్మరసం.
ఉపయోగాలు: బంగాళాదుంపలోని కేటకోలేజ్ ఎంజైమ్, నిమ్మరసంలోని విటమిన్-సి ముఖంపై ఉన్న మచ్చలను తగ్గించి చర్మ ఛాయను మెరుగుపరుస్తాయి.
వాడే విధానం: రెండింటినీ కలిపి ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.

2. టమోటా, పెరుగు డి-ట్యాన్ బ్లీచ్

కావలసినవి: 1 స్పూన్ టమోటా గుజ్జు, 1 స్పూన్ చిక్కటి తాజా పెరుగు.
ఉపయోగాలు: టమోటాలోని లైకోపీన్, పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మంపై ఉన్న ట్యాన్‌ను తొలగించి సహజమైన గ్లోను ఇస్తాయి.
వాడే విధానం: ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై రాసి 2 నిమిషాలు శాంతంగా మసాజ్ చేయాలి. 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.

3. శనగపిండి, పసుపు, పాలు బ్లీచ్
కావలసినవి: 1 స్పూన్ శనగపిండి, చిటికెడు కస్తూరి పసుపు, 2 స్పూన్లు పచ్చిపాలు.
ఉపయోగాలు: ఇది ముఖంపై ఉండే సన్నని వెంట్రుకలకు సహజమైన రంగును అందిస్తూ చర్మాన్ని లోతుగా మోయిశ్చరైజ్ చేస్తుంది.
వాడే విధానం: చిక్కటి పేస్ట్‌లా చేసి ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత తేలికపాటి చేతులతో రుద్దుతూ తొలగించి కడిగేయాలి.

సహజ బ్లీచ్ వాడేటప్పుడు పాటించాల్సిన 3 ముఖ్యమైన జాగ్రత్తలు:

ప్యాచ్ టెస్ట్: నిమ్మరసం లేదా ఇతర పదార్థాలను ముఖమంతటా రాసేముందు చేతిపై లేదా మెడపై ప్యాచ్ టెస్ట్ చేసి సరిపడుతుందో లేదో చూసుకోవాలి.
ఎండలో వెళ్లకూడదు: బ్లీచ్ వేసుకున్న వెంటనే ఎండలోకి వెళ్లడం మంచిది కాదు. దీన్ని సాయంత్రం లేదా రాత్రి సమయంలో వాడటం ఉత్తమం.
మోయిశ్చరైజర్ తప్పనిసరి: బ్లీచ్ కడిగేసిన తర్వాత చర్మంలో తేమ తగ్గకుండా ఉండటానికి కలబంద జెల్ (Aloe Vera) లేదా తేలికపాటి మోయిశ్చరైజర్ రాసుకోవాలి.

 

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

പ്രതിഷേധങ്ങളില്‍ കത്തുന്ന ഫ്രാന്‍സ്: അക്രമങ്ങളില്‍ ലജ്ജയും രോഷവുമെന്ന് ഇമ്മാനുവേല്‍ മാക്രോണ്‍

പാരിസ്: റിപബ്ലികിനെ താഴെയിറക്കാനുള്ള അക്രമാസക്തമായ പ്രതിഷേധ ശ്രമങ്ങളില്‍ രോഷം പ്രകടിപ്പിച്ച് ഫ്രാന്‍സ്...

அதிபர் தேர்தல் அரசியலா?: `பிரான்ஸ் எரிகிறது; கடுமையான நடவடிக்கை உண்டு' – இம்மானுவேல் மக்ரோன்!

விலைவாசி உயர்வு, மோசமான கல்விச் சூழல் போன்றவற்றைக் கண்டித்து பிரான்ஸ் நாடு...

അശുതോഷിന്റെയും സൗരവിന്റെയും ജാമ്യം വൈകിപ്പിക്കാന്‍ ആസൂത്രിത നീക്കം: സി.ജെ.പി

ന്യൂദല്‍ഹി: സി.ജെ.പി നേതാക്കളായ അശുതോഷ് രങ്കയുടെയും സൗരവ് ദാസിന്റെയും ജാമ്യം വൈകിപ്പിക്കാന്‍...