20
August, 2026

A News 365Times Venture

20
Thursday
August, 2026

A News 365Times Venture

Tamil Nadu: CJPపై విజయ్ సర్కార్ సంచలన ఆదేశాలు.. ఆ తర్వాత యూ-టర్న్..

Date:

Tamil Nadu: తమిళనాడులో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై వ్యతిరేకత రావడంతో మళ్లీ యూ-టర్న్ తీసుకుంది. వామపక్ష పార్టీలు, తమిళనాడు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిర్వహించే నిరసనల్లో విద్యార్థులు, యువత పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని జారీ చేసిన వివాదాస్పద ఆదేశాలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆగస్టు 14న పాఠశాల విద్య, ఉన్నత విద్యాశాఖలకు ఈ ఆదేశాలు జారీ కాగా.. తీవ్ర విమర్శలు రావడంతో ఆగస్టు 19న వెనక్కి తీసుకుంది.

విద్యార్థులు, యువత సీజేపీ, వామపక్ష నిరసనల్లో, ఆందోళనల్లో పాల్గొనాలనే ఉత్సాహానికి లోనుకాకుండా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. తీసుకున్న చర్యలపై ఆగస్టు 20లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని పాఠశాల, కళాశాలల్ని ఆదేశించింది. ఈ నిర్ణయంపై సీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీ జాతీయ కో కన్వీనర్ సౌరవ్ దాస్ ప్రభుత్వ ఆదేవఆలు రాజ్యాంగ విరుద్ధమని, అర్థరహితమని, అసమంజసమైనవని విమర్శించారు.

అయితే, బీజేపీ విజయ్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. సీజేపీ, వామపక్ష సంస్థలను బీజేపీ నేత వినోద్ పీ సెల్వం ‘‘అరాచకానికి ఏజెంట్లు’’గా అభివర్ణించింది. నీట్ పేపర్ లీక్ వ్యహరానికి వ్యతిరేకంగా సీజేపీ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసనల తర్వాత దేశవ్యాప్తంగా యువత నిరసనలు పెరుగుతున్నాయి. పరీక్షలు, విద్యా మౌలిక సదుపాయాలపై జెన్-జీ, జెన్-ఆల్ఫా ఆందోళనలు పెరిగాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

'தலைவர் ஏண்டா அரசியலுக்கு வந்தார் என நினைத்தேன்…' – அமைச்சர் ஆனந்த் ஓபன் டாக்!

சட்டமன்றத்தில் இன்று நீர்வளத்துறைக்கான மானியக் கோரிக்கை விவாதம் நடந்திருந்தது. இதில் பதிலளித்து...

EXCLUSIVE BREAKING NEWS: MDA ಬದಲಿ ನಿವೇಶನ ಹಂಚಿಕೆ ರದ್ದು: ₹2,000 ಕೋಟಿ ಮೌಲ್ಯದ 1,100 ನಿವೇಶನಗಳಿಗೆ ಕುತ್ತು!

  ಮೈಸೂರು, ಆ.19: ಮೈಸೂರು ಅಭಿವೃದ್ಧಿ ಪ್ರಾಧಿಕಾರದಲ್ಲಿ (MDA) ನಿಯಮ ಉಲ್ಲಂಘಿಸಿ...

മഹാത്മാ ഗാന്ധിയുടെ കുടുംബം സി.ജെ.പിക്കൊപ്പം നിൽക്കുന്നു; അത് തങ്ങളുടെ രാജ്യസ്നേഹത്തിനുള്ള ഒരു സർട്ടിഫിക്കറ്റെന്ന് അഭിജീത് ദീപ്കെ

ഛത്രപതി സംഭാജി നഗർ: മഹാത്മാഗാന്ധിയുടെ കുടുംബം തങ്ങൾക്കൊപ്പം നിൽക്കുന്നുവെന്നത് തങ്ങളുടെ രാജ്യസ്നേഹത്തിനുള്ള...