25
August, 2026

A News 365Times Venture

25
Tuesday
August, 2026

A News 365Times Venture

Sangareddy: చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.3 కోట్లతో భార్యాభర్తలు పరార్.!

Date:

Sangareddy: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం బీరంగూడ రాఘవేంద్ర కాలనీలో భారీ చిట్టీ మోసం వెలుగులోకి వచ్చింది. స్థానిక మహిళలకు అధిక లాభాల ఆశ చూపి కోట్ల రూపాయలు వసూలు చేసిన దంపతులు రాత్రికి రాత్రే పరారవడంతో బాధితులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు.

స్థానికంగా శిరీష, సాంబశివరావు దంపతులు కొన్నేళ్లుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి కాలనీలోని పలువురు మహిళల నుంచి సుమారు రూ.3 కోట్ల వరకు వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు. శిరీష ‘సాయి గణేష్ టెక్స్ టైల్స్’ పేరుతో బట్టల దుకాణాన్ని నిర్వహిస్తూ.. అదే సమయంలో చిట్టీల వ్యాపారం కూడా సాగించినట్లు తెలుస్తోంది. స్థానికుల నమ్మకాన్ని సంపాదించి భారీ మొత్తంలో డబ్బులు సేకరించారు.

బాధితుల కథనం ప్రకారం.. దంపతులు కాలనీలో ఉన్న తమ సొంత ఇంటిని అమ్మేసి, ఆ తర్వాత ఎవరికి సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే పరారయ్యారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు.. తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దంపతుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతూ.. పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಕುಂಟು ನೆಪವಿಟ್ಟುಕೊಂಡು ಸದನ ನಡೆಸಲು ಬಿಡುತ್ತಿಲ್ಲ: ಸ್ಪಷ್ಟ ಆರೋಪಗಳಿದ್ದರೆ ಸಾಕ್ಷಿ ಮೂಲಕ ಹೇಳಲಿ- ದಿನೇಶ್ ಗುಂಡೂರಾವ್

 ಬೆಂಗಳೂರು,ಆಗಸ್ಟ್,22,2026 (www.justkannada.in): ಸಚಿವ ಬಿ.ನಾಗೇಂದ್ರ ರಾಜೀನಾಮೆಗೆ ಆಗ್ರಹಿಸಿ ಬಿಜೆಪಿ ಪ್ರತಿಭಟನೆ...

പരസ്പര വിമര്‍ശനങ്ങളില്ല; മഹായുതി സഖ്യകക്ഷികള്‍ ഒരുമിച്ച് തെരഞ്ഞെടുപ്പിനെ നേരിടും: ബി.ജെ.പി

മുംബൈ: മഹാരാഷ്ട്രയിലെ ഭരണകക്ഷിയായ മഹായുതി സഖ്യത്തിലെ ഘടകകക്ഷികള്‍ പരസ്പരം വിമര്‍ശനാത്മകമായ പരാമര്‍ശങ്ങള്‍...

"அது நான்தான்; அமைச்சர் கீர்த்தனா இல்ல" – மலேசியா பெண் வெளியிட்ட விளக்க வீடியோ

சமீபத்தில் காரில் இருந்து ஒரு பெண் இறங்குவது போன்ற வீடியோ சமூக...

AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన

AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్...