1
October, 2026

A News 365Times Venture

1
Thursday
October, 2026

A News 365Times Venture

ప్రీమియం ఫీచర్లు బడ్జెట్ ధరలో.. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్‌ప్లేతో Samsung Galaxy F70 Pro 5G లాంచ్..!

Date:

Samsung Galaxy F70 Pro 5G: భారత మార్కెట్లో శాంసంగ్ F-సిరీస్‌లో మరో కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ F70 ప్రో 5G (Samsung Galaxy F70 Pro 5G)ను అధికారికంగా లాంచ్ చేసింది. ప్రీమియం డిజైన్, శక్తివంతమైన Snapdragon 6 Gen 3 ప్రాసెసర్, 6000mAh భారీ బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లేతో ఈ ఫోన్ వినియోగదారుల ముందుకు వచ్చేసింది.

Super AMOLED డిస్‌ప్లే:

ఈ కొత్త స్మార్ట్ ఫోన్లో 6.7 అంగుళాల FHD+ (1080 × 2340 పిక్సెల్స్) Infinity-O సూపర్ AMOLED డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ HBM బ్రైట్‌నెస్, 1400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో వస్తుంది. స్క్రీన్ రక్షణ కోసం ‘కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+’ ను ఉపయోగించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అరోరా గ్రీన్, ఆల్ఫా బ్లాక్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంటుంది. లెదర్ ఫినిష్‌ను పోలిన టెక్స్చర్డ్ బ్యాక్ ప్యానెల్ దీనికి ప్రీమియం లుక్‌ను అందిస్తోంది.

Snapdragon ప్రాసెసర్:

ఈ ఫోన్‌కు క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 3 (4nm) (Qualcomm Snapdragon 6 Gen 3) చిప్‌సెట్ ను అందించారు. గ్రాఫిక్స్ కోసం Adreno 710 GPU ఉంది. ఇది 6GB/8GB LPDDR5X RAM, 128GB/256GB UFS 3.1 స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. అవసరమైతే microSD కార్డ్ ద్వారా 2TB వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత శాంసంగ్ One UI 8.5పై పనిచేస్తుంది. అలాగే 6 సంవత్సరాల పాటు OS, సెక్యూరిటీ అప్డేట్లు అందిస్తామని కంపెనీ తెలిపింది.

OIS కెమెరా & బ్యాటరీ:

ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరా (OIS), 5MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో సెన్సార్ తో ఉన్న ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఇక ఇందులో 6000mAh భారీ బ్యాటరీను అమర్చారు. దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే రోజంతా సులభంగా ఉపయోగించుకునేలా బ్యాటరీ పనితీరు ఉంటుందని కంపెనీ చెబుతోంది.

ఇతర ముఖ్య ఫీచర్లు:

* IP64 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెన్స్
* సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్
* స్టీరియో స్పీకర్లు
* USB Type-C పోర్ట్
* NFC సపోర్ట్
* Bluetooth 5.3
* 5G SA/NSA, Dual SIM సపోర్ట్

ధర:

ప్రత్యేక ఆఫర్‌లో Samsung Galaxy F70 Pro 5G మొబైల్ రూ.23,999 ప్రారంభ ధరకు అందుబాటులోకి వచ్చింది. దీని అసలు ధర రూ.25,999గా ఉంది. ఈ ఫోన్ ఆగస్టు 8 నుంచి ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడం సేల్లో అమ్మకలకు అందుబాటులో ఉంటుంది.

Fruad (1)

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಡಿಸ್ಟ್ರಿಕ್ ಜಡ್ಜ್‌ ಕಾರಿಗೆ ಆಟೋ ಡಿಕ್ಕಿ: ಓರ್ವ ಸಾವು, ಇಬ್ಬರಿಗೆ ಗಾಯ

ಮಂಗಳೂರು,ಅಕ್ಟೋಬರ್‌,1,2026 (www.justkannada.in): ದಕ್ಷಿಣ ಕನ್ನಡ ಜಿಲ್ಲಾ 1ನೇ ಹೆಚ್ಚುವರಿ ಜಿಲ್ಲಾ...

പൊലീസ് രാജിനെയും സ്പോൺസർഷിപ്പ് രാജിനെയും ചെറുക്കാൻ ജനകീയ പ്രതിരോധം ഉയരും: എം.വി. ഗോവിന്ദൻ

തിരുവനന്തപുരം: തലസ്ഥാനത്ത് യൂണിവേഴ്സിറ്റി കോളേജിന് മുന്നിൽ വിദ്യാർത്ഥികൾക്ക് നേരെ അരങ്ങേറിയത് പൊലീസിനെ...

'முதல்வர் விஜய்யின் வீட்டுக்கு எதிரே நடைபாதையில் தவெகவினரின் அபாய பேனர்!' – கவனிக்குமா தலைமை?

முதல்வர் விஜய்யின் பட்டினப்பாக்கம் வீட்டுக்கு எதிரே மக்கள் நடப்பதற்காக அமைக்கப்பட்டிருக்கும் நடைமேடையில்...

Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..

గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో వెస్టిండీస్‌‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో...