1
October, 2026

A News 365Times Venture

1
Thursday
October, 2026

A News 365Times Venture

Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే ‘మష్రూమ్ ఆనియన్ పకోడీ’.! చేసేయండి ఇలా..

Date:

Mushroom Onion Pakoda: వర్షాకాలం రాగానే సాయంత్రం వేళ వేడి వేడిగా టీ లేదా కాఫీ తాగుతూ, మరోవైపు కరకరలాడే పకోడీ తింటే ఆ మజానే వేరు కదా.. సాధారణంగా చాలామంది ఇలాంటి సమయాల్లో ఆనియన్ పకోడీ, చికెన్ పకోడీ తింటూ ఉంటారు. కానీ ఒక్కసారి కాస్త డిఫరెంట్ గా మేరకు ‘మష్రూమ్ (పుట్టగొడుగుల) ఆనియన్ పకోడీ’ ట్రై చేస్తే ఎలా ఉంటుందో తెలుసా.? ఆ మజా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. బయట స్వీట్ షాప్స్, హోటల్స్ లో దొరికేలా ఇంట్లోనే ఎంతో క్రిస్పీగా, రుచిగా చేసుకునే ఈ సీక్రెట్ రెసిపీని ఇంట్లోనే చేసుకోండిలా..

కావలసిన పదార్థాలు:

* మష్రూమ్స్ (పుట్టగొడుగులు): 1 కప్పు (చిన్నగా కట్ చేసినవి),
* ఉల్లిపాయలు: 1 (సన్నగా, పొడవుగా కట్ చేసినవి),
* శెనగపిండి: 4 – 5 టేబుల్ స్పూన్లు,
* బియ్యప్పిండి: 1 టేబుల్ స్పూన్ (మంచి క్రిస్పీనెస్ కోసం),
* అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1/2 టీస్పూన్,
* పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు: తగినంత (సన్నగా తరిగినవి),
* కారం, పసుపు, ఉప్పు: రుచికి సరిపడా,
* నూనె: వేయించడానికి సరిపడా.

తయారీ విధానం:

ముందుగా ఒక బాణలిలో కట్ చేసుకున్న మష్రూమ్స్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేయండి. ఆ తర్వాత శెనగపిండి, బియ్యప్పిండి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు అలాగే సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. అయితే పకోడీ బాగా రావాలంటే పిండి తక్కువగా.. మష్రూమ్, ఆనియన్ ముక్కలు ఎక్కువగా ఉంటె బాగుంటుంది.

బాణలిలో నూనె బాగా వేడెక్కిన తర్వాత, కలుపుకున్న మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా పకోడీల్లా వేయండి. ఇవి 50% మాత్రమే వేగగానే (సగం వేగిన తర్వాత) తీసి పక్కన పెట్టుకోండి. బయట కొనే పకోడీలు అంత క్రిస్పీగా ఉండటానికి కారణం “డబుల్ ఫ్రై” చేయడమే. వేయించిన పకోడీలను కాసేపు పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు నూనెను బాగా వేడిగా అయ్యేంత వరకు మరిగించాలి. ఇప్పుడు చల్లారిన పకోడీలను మళ్లీ ఈ వేడి నూనెలో వేసి పెద్ద మంట మీద మంచి గోల్డెన్ కలర్, క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాలి. అంతే 5 నిమిషాల్లో మీ కరకరలాడే మష్రూమ్ ఆనియన్ పకోడీ రెడీ..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಡಿಸ್ಟ್ರಿಕ್ ಜಡ್ಜ್‌ ಕಾರಿಗೆ ಆಟೋ ಡಿಕ್ಕಿ: ಓರ್ವ ಸಾವು, ಇಬ್ಬರಿಗೆ ಗಾಯ

ಮಂಗಳೂರು,ಅಕ್ಟೋಬರ್‌,1,2026 (www.justkannada.in): ದಕ್ಷಿಣ ಕನ್ನಡ ಜಿಲ್ಲಾ 1ನೇ ಹೆಚ್ಚುವರಿ ಜಿಲ್ಲಾ...

പൊലീസ് രാജിനെയും സ്പോൺസർഷിപ്പ് രാജിനെയും ചെറുക്കാൻ ജനകീയ പ്രതിരോധം ഉയരും: എം.വി. ഗോവിന്ദൻ

തിരുവനന്തപുരം: തലസ്ഥാനത്ത് യൂണിവേഴ്സിറ്റി കോളേജിന് മുന്നിൽ വിദ്യാർത്ഥികൾക്ക് നേരെ അരങ്ങേറിയത് പൊലീസിനെ...

'முதல்வர் விஜய்யின் வீட்டுக்கு எதிரே நடைபாதையில் தவெகவினரின் அபாய பேனர்!' – கவனிக்குமா தலைமை?

முதல்வர் விஜய்யின் பட்டினப்பாக்கம் வீட்டுக்கு எதிரே மக்கள் நடப்பதற்காக அமைக்கப்பட்டிருக்கும் நடைமேடையில்...

Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..

గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో వెస్టిండీస్‌‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో...