8
October, 2026

A News 365Times Venture

8
Thursday
October, 2026

A News 365Times Venture

CJP: కాక్రోచ్ పార్టీ నిరసనల్లో 2873 మంది క్రిమినల్స్.. కేంద్రం కీలక ప్రకటన..

Date:

CJP: జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిర్వహించిన నిరసనపై పార్లమెంట్‌లో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నిరసనల్లో 2873 మంది క్రిమినల్స్‌ను గుర్తించినట్లు చెప్పింది. ‘ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్’ (FRS) వాహనాలు, రియల్-టైమ్ ముఖ గుర్తింపు సాంకేతికత ద్వారా నేర చరిత్ర కలిగిన వారిని గుర్తించినట్లు వెల్లడించింది. పార్లమెంట్‌కు సమర్పించిన ఒక పత్రంలో.. క్రైమ్-కుండ్లి డేటా బేస్ ద్వారా 2402 మందిని గుర్తించినట్లు, డోసియర్ రికార్డుల ద్వారా మరో 471 మందిన గుర్తించినట్లు తెలిపింది.

నేరస్తుల్లో వివిధ నేరాలకు పాల్పడిన వ్యక్తులు ఉన్నట్లుగా చెప్పింది. , 101 మంది హత్య కేసులతో, 62 మంది హత్యాయత్నం కేసులతో మరియు 284 మంది దోపిడీ (dacoity) మరియు దొంగతనం (robbery) సంబంధిత నేరాలతో సంబంధం కలిగి ఉన్నారు. అత్యాచార కేసుల్లో నిందితులుగా ఉన్న వారు 61 మంది, పోక్స్ కేసులో ఉన్న ఆరుగురిని గుర్తించినట్లు పేర్కొంది. మరో 25 మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినవారు ఉన్నట్లు పేర్కొంది.

ఆయుధాల చట్టం కేసుల్లో 229 మందిని, దొంగతనం కేసుల్లో 135 మంది, కిడ్నాప్ సంబంధిత నేరాల్లో 19 మందిని, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్(NDPS) చట్టం కింద నమోదైన కేసులలో 67 మందిని గుర్తించారు.మొత్తం 1,884 మంది భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ శిక్షాస్మృతి (IPC) మరియు ఇతర ప్రత్యేక చట్టాల కింద నమోదైన వివిధ కేసులకు సంబంధించిన వ్యక్తులుగా వర్గీకరించినట్లు ప్రభుత్వం తెలిపింది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ദി ഓറഞ്ച് പ്ലേഗ്: യൂറോപ്യന്‍ പാര്‍ലമെന്റില്‍ സ്വര്‍ണത്തില്‍ പൊതിഞ്ഞ ട്രംപിന്റെ നഗ്നപ്രതിമ പ്രദര്‍ശിപ്പിച്ചു

സ്ട്രാസ്‌ബെര്‍ഗ്: യൂറോപ്യന്‍ പാര്‍ലമെന്റ് കെട്ടിടത്തില്‍ ഓറഞ്ച് പ്ലേഗ് എന്ന് പേരിട്ട് ഡൊണാള്‍ഡ്...

ஜந்தர் மந்தர்: பெண் பத்திரிகையாளர்களிடம் பாலியல் சீண்டலில் ஈடுபட்ட ஏசிபி? யார் இந்த விவேக் பகத்?

தலைமைத் தேர்தல் ஆணையர் ஞானேஷ் குமார் ராஜினாமா செய்ய வலியுறுத்தி, அக்டோபர்...

France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం

ఫ్రాన్స్‌లో విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, కిక్కిరిసిన...

ധ്രുവ് റാഠി വ്യാഴാഴ്ച ബെംഗളൂരുവില്‍: എസ്.ഐ.ആറിനെതിരായ പ്രതിഷേധത്തില്‍ പങ്കുചേരാന്‍ ആഹ്വാനം ചെയ്ത് പ്രകാശ് രാജ്

ബെംഗളൂരു: ബെംഗളൂരു ഫ്രീഡം പാര്‍ക്കില്‍ വ്യാഴാഴ്ച നടക്കുന്ന എസ്.ഐ.ആറിനെതിരായ പ്രതിഷേധത്തില്‍ പൊളിറ്റിക്കല്‍...