19
August, 2026

A News 365Times Venture

19
Wednesday
August, 2026

A News 365Times Venture

Yuvraj Singh: “శాంతియుత పరిష్కారమే మార్గం”.. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!

Date:

Yuvraj Singh: ఢిల్లీలో నీట్ (NEET) పేపర్ లీక్ వివాదంపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) చేపడుతున్న ఆందోళనలు మరింత ఉద్రిక్తంగా మారాయి. మొదట జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ప్రారంభమైన ఈ నిరసన, జూలై 20, 2026న విద్యార్థులు చేపట్టిన ‘సంసద్ చలో’ మోర్చాతో తీవ్రరూపం దాల్చింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు టీర్ గ్యాస్ ప్రయోగించడంతో పరిస్థితి చేయిదాటింది. పోలీసుల ఈ చర్యకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో, పలువురు సెలబ్రిటీలు, ప్రతిపక్ష నేతలు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. చాలా మంది విద్యార్థులకు తమ మద్దతును ప్రకటిస్తున్నారు. కొందరు ప్రముఖులు స్వయంగా ఢిల్లీకి చేరుకుని నిరసనలో పాల్గొనగా, మరికొందరు సోషల్ మీడియా వేదికగా నిరసనకారులకు మద్దతు తెలిపారు.

ఈ క్రమంలో భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ సైతం స్పందించాడు. “ప్రతి ఒక్క చిన్నారికి, విద్యార్థికి, పురుషుడికి, మహిళకు ప్రశాంతమైన వాతావరణంలో విద్యనభ్యసించే, సురక్షితంగా ఎదిగే, తమ కలలను నెరవేర్చుకునే హక్కు ఉండాలి. మీ సంక్షేమమే ఒక బలమైన భారత్‌కు ప్రాతిపదిక. మనమందరం కలిసి శ్రద్ధ, అవకాశాలు, ఆశలతో కూడిన సమాజాన్ని నిర్మించుకోవడానికి కృషి చేద్దాం. భారతదేశ భవిష్యత్తు కోసం పరస్పర చర్చల ద్వారా ఈ సమస్యకు శాంతియుతమైన పరిష్కారాన్ని కనుగొనవచ్చు” అని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన సందేశాన్ని పంచుకున్నాడు.

మరోవైపు ఈ పేపర్ లీకేజీ అంశం పార్లమెంట్‌ను తీవ్రంగా కుదిపేస్తోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండటంతో ప్రభుత్వం, విపక్షాల మధ్య తీవ్ర మునిగిపోకలు సాగుతున్నాయి. ప్రత్యేక నిబంధనల కింద చర్చ జరపాలని విపక్షాలు పట్టుబడుతుండగా, సాధారణ చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెబుతోంది. దీంతో ఉభయ సభల (లోక్‌సభ, రాజ్యసభ) కార్యకలాపాలు పదేపదే వాయిదా పడుతున్నాయి. ఈ క్రమంలో జూలై 21న ప్రతిపక్ష నేతలు ప్రధాని నివాసం వైపునకు మోర్చాగా వెళ్లేందుకు యత్నించగా, రాహుల్ గాంధీ సహా పలువురు ముఖ్య నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత విడుదల చేశారు.

Yuvraj Singh

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಬಲಾಢ್ಯ ಶೈಕ್ಷಣಿಕ, ಧಾರ್ಮಿಕ ಸಂಸ್ಥೆಗಳಿಗೆ ಸರ್ಕಾರಿ ಭೂಮಿ ನೀಡಬಾರದು: MLC ಕೆ.ಶಿವಕುಮಾರ್

ಬೆಂಗಳೂರು,ಆಗಸ್ಟ್,19,2026 (www.justkannada.in): ರಾಜ್ಯದ ಸರ್ಕಾರಿ ಭೂಮಿಯನ್ನು ಬಡವರ ಕಲ್ಯಾಣ  ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ...

സെൻസസിനൊപ്പം എൻ.പി.ആർ നടപ്പാക്കാൻ കേന്ദ്രനീക്കം; പൗരത്വത്തെ മതവുമായി ബന്ധിപ്പിക്കാനുള്ള ശ്രമം അംഗീകരിക്കാനാകില്ലെന്ന് പിണറായി വിജയൻ

തിരുവനന്തപുരം: വരാനിരിക്കുന്ന സെൻസസ് ചോദ്യാവലിയിൽ മാതാപിതാക്കളുടെ ജനനസ്ഥലം, മതം തുടങ്ങിയ വിവരങ്ങൾ...

மாணவர்கள் போராட்டம் குறித்த சுற்றறிக்கை: "பாசிச அரசியலைத் தொடங்க ஆழம் பார்த்ததா தவெக அரசு?"- கனிமொழி

காக்ரோச் ஜனதா கட்சி மற்றும் இடதுசாரி போராட்டங்களில் மாணவர்கள் பங்கேற்பதைத் தடுக்க...

Pakistan: ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట.. 9 నెలల తర్వాత భార్య, సోదరిని కలిసిన మాజీ ప్రధాని..

Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి మరియు పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పిటిఐ) వ్యవస్థాపకుడు...