19
July, 2026

A News 365Times Venture

19
Sunday
July, 2026

A News 365Times Venture

Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!

Date:

Messi vs Ronaldo Luxury Phones: స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో ఎప్పటినుంచో కొనసాగుతున్న Android vs iPhone చర్చకు ఇప్పుడు ఫుట్‌బాల్ రంగు పులిమింది. లగ్జరీ స్మార్ట్‌ఫోన్ కస్టమైజేషన్ బ్రాండ్ కావియర్ (Caviar) ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజాలు లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో పేర్లతో ప్రత్యేక ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. దీంతో టెక్నాలజీ ప్రపంచంలోని అతిపెద్ద రైవర్లి ఫుట్‌బాల్‌లోని GOAT (Greatest of All Time) చర్చతో కలిపి కొత్త ఆకర్షణగా మార్చింది.

మెస్సీకి Samsung.. రొనాల్డోకు iPhone:

కావియర్ నుండి కొత్తగా లెజెండ్స్ కలెక్షన్లో భాగంగా రెండు ప్రత్యేక ఫోన్లను రూపొందించింది. ఇందులో లియోనెల్ మెస్సీ (Lionel Messi) పేరుతో శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 అల్ట్రా (Samsung Galaxy Z Fold 8 Ultra), క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) పేరుతో ఐఫోన్ 17 ప్రో (iPhone 17 Pro)ను కస్టమైజ్ చేసింది. ప్రతి ఫోన్ ఆయా ఫుట్‌బాల్ దిగ్గజాల వ్యక్తిత్వం, దేశభక్తిని ప్రతిబింబించేలా ప్రత్యేక డిజైన్‌తో రూపొందించారు.

24 క్యారెట్ల బంగారంతో ప్రీమియం డిజైన్:

ఈ ప్రత్యేక ఎడిషన్ మొబైల్స్ లో 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, క్లోయిజోనే ఎనామెల్ (Cloisonné Enamel) ఆర్ట్‌వర్క్‌ను ఉపయోగించారు. చేతితో తయారు చేసిన ప్రత్యేక డిజైన్ కారణంగా ఇవి కలెక్టర్ ఎడిషన్‌గా నిల్వునుందని కంపెనీ తెలిపింది. ప్రతి ఫోన్‌కు ప్రత్యేక సీరియల్ నంబర్‌తో పాటు ధృవీకరణ పత్రం (Certificate of Authenticity) కూడా అందజేస్తారు. ఈ లిమిటెడ్ ఎడిషన్ సిరీస్‌లో మెస్సీ మోడల్ 19 యూనిట్లు, రొనాల్డో మోడల్ 19 యూనిట్లు మాత్రమే తయారు చేయనున్నారు. ప్రతి ఫోన్ ప్రీమియం బాక్స్‌లో గోల్డ్ ప్లేటెడ్ కీతో అందించబడుతుంది. అంతేకాకుండా.. కొనుగోలుదారులు కోరుకుంటే ప్రత్యేక వ్యక్తిగత కస్టమైజేషన్ సదుపాయాన్ని కూడా కావియర్ అందిస్తోంది.

Image

ధరలు ఎంతంటే?

ఈ లగ్జరీ ఫోన్ల ధరలు తారా స్థాయిలో ఉన్నాయి. క్రిస్టియానో ​​రొనాల్డో ఎడిషన్ ఐఫోన్ 17 ప్రో ప్రారంభ ధర 11,410 డాలర్లు (రూ.9.8 లక్షలు) కాగా, లియోనెల్ మెస్సీ ఎడిషన్ శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 అల్ట్రా ప్రారంభ ధర 13,130 డాలర్లు (రూ.11.3 లక్షలు)గా ఉంది. స్టోరేజ్ వేరియంట్‌ను బట్టి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

సాధారణ వినియోగదారుల కంటే లగ్జరీ కలెక్టర్లు, ఫుట్‌బాల్ అభిమానులను లక్ష్యంగా చేసుకుని Caviar ఈ ప్రత్యేక ఎడిషన్‌ను రూపొందించింది. ఫుట్‌బాల్‌లోని మెస్సీ vs రొనాల్డో పోటీని.. టెక్ ప్రపంచంలోని Android vs iPhone చర్చతో మేళవించి ఈ కలెక్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

'ரத்தத்திற்கு ரத்தம்' கேட்கும் ஈரான்; ட்ரம்ப் குடும்பம் மீது குறியா?

மிக பயங்கரமான போர்... தற்காலிக போர் நிறுத்தம்... அவ்வப்போது தாக்குதல்கள்... புரிந்துணர்வு...

ಬಿಡದಿ ಟೌನ್ ಶಿಪ್ ವಿರುದ್ದ ಬಿಜೆಪಿಯವರದ್ದು ಪ್ರಾಯಶ್ಚಿತ ಯಾತ್ರೆ: ಶಾಸಕ ಹೆಚ್. ಸಿ ಬಾಲಕೃಷ್ಣ

ಬೆಂಗಳೂರು, ಜುಲೈ,18,2026 (www.justkannada.in):  ಬಿಡದಿ ಟೌನ್ ಶಿಪ್ ಯೋಜನೆ ವಿಚಾರವಾಗಿ...