15
July, 2026

A News 365Times Venture

15
Wednesday
July, 2026

A News 365Times Venture

ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!

Date:

Mahindra Thar Prices: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా తన ప్రముఖ ఆఫ్-రోడ్ SUV థార్ (Mahindra Thar) ధరలను మరోసారి పెంచింది. జూలై 10 నుంచి అమల్లోకి వచ్చిన ఈ తాజా ధరల పెంపుతో థార్ వేరియంట్‌ను బట్టి రూ.27,000 నుంచి రూ.37,000 వరకు ధరలు పెరిగాయి. 2026లో ఇది థార్‌కు మూడో ధరల పెంపు. అంతకుముందు జనవరి, ఏప్రిల్ నెలల్లో కూడా కంపెనీ ధరలను సవరించింది. ఈసారి ధరల పెంపు కొన్ని వేరియంట్లకే పరిమితం కాకుండా థార్‌ లోని అన్ని వేరియంట్లపై అమలు చేసింది. ముడి పదార్థాల (కమోడిటీ) ధరలు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహీంద్రా తెలిపింది. ఇంజిన్, గేర్‌బాక్స్, డ్రైవ్‌ట్రైన్‌ను బట్టి ధరల పెంపులో తేడా ఉంది.

ఏ వేరియంట్‌పై ఎంత పెరిగింది?

అత్యధికంగా LXT 4WD 2.2 డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్‌పై రూ.37,000 పెరిగింది. LXT 4WD పెట్రోల్ ఆటోమేటిక్ ధర రూ.36,000, LXT 4WD 2.2 డీజిల్ మాన్యువల్ ధర రూ.34,000 పెరిగాయి. అలాగే LXT 4WD పెట్రోల్ మాన్యువల్ ధర రూ.33,000, AXT 2WD 1.5 డీజిల్ మాన్యువల్ ధర రూ.32,500 పెరిగింది. LXT 2WD డీజిల్ మాన్యువల్ ధర రూ.29,500, LXT 2WD పెట్రోల్ ఆటోమేటిక్ ధర రూ.27,000 మేర పెరిగింది.

తాజా ఎక్స్‌షోరూమ్ ధరలు:

వేరియంట్ – ధర (ఎక్స్‌షోరూమ్)
* AXT డీజిల్ 2WD (MT) – రూ.10.32 లక్షలు.
* LXT డీజిల్ 2WD (MT) – రూ.12.99 లక్షలు.
* LXT పెట్రోల్ 2WD (AT) – రూ.14.76 లక్షలు.
* LXT పెట్రోల్ 4WD (MT) – రూ.15.59 లక్షలు.
* LXT డీజిల్ 4WD (MT) – రూ.16.42 లక్షలు.
* LXT పెట్రోల్ 4WD (AT) – రూ.17.22 లక్షలు.
* LXT డీజిల్ 4WD (AT) – రూ.17.99 లక్షలు.

2026లో మహీంద్రా థార్ ధరలు ఇప్పటికే మూడు సార్లు పెరిగాయి. జనవరిలో రూ.20,000, ఏప్రిల్‌లో రూ.43,000, తాజాగా జూలైలో రూ.37,000 వరకు పెంచింది. దీంతో ఏడు నెలల్లో వరుసగా మూడు సార్లు ధరలు పెరిగింది. థార్ కొనుగోలు చేయాలనుకునే వారు బుకింగ్ చేసే ముందు తమకు కావాల్సిన వేరియంట్‌కు సంబంధించిన తాజా ఆన్-రోడ్ ధరను డీలర్ వద్ద తప్పనిసరిగా తెలుసుకోవడం మంచిది. వరుసగా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని వారాల క్రితం తీసుకున్న ధర అంచనాలు ఇప్పుడు మారి ఉండే అవకాశం ఉంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

റബ്ബിമാരെയും ജൂതസംഘടനകളെയും അവഗണിച്ച് ഗസയിലെ വംശഹത്യയില്‍ ഫലസ്തീന്‍ ക്രൈസ്തവരെ കേള്‍ക്കാന്‍ വോട്ട് ചെയ്ത് ചര്‍ച്ച് ഓഫ് ഇംഗ്ലണ്ട്

ലണ്ടന്‍: ഗസയില്‍ ഇസ്രഈല്‍ നടത്തുന്നത് വംശഹത്യയാണെന്ന് ആരോപിക്കുന്ന ഫലസ്തീനിയന്‍ ക്രൈസ്തവരുടെ റിപ്പോര്‍ട്ട്...

"எனது சொந்தக்காரர் 100 கோடிக்கு நிலம் வாங்கினாரா?" – பத்திரப்பதிவு சர்ச்சைக்கு அமைச்சர் விளக்கம்!

பழனி அடிவாரத்தில் உள்ள தண்டபாணி சுவாமிகள் மடத்திற்குச் சொந்தமான 100...

ದಸರಾದಲ್ಲಿ ಕಂಬಳ ಆಯೋಜನೆ ಬಗ್ಗೆ ಸಿಎಂ ತೀರ್ಮಾನ ಮಾಡ್ತಾರೆ- ಸಚಿವ ಯತೀಂದ್ರ ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಕಲಬುರಗಿ,ಜುಲೈ,13,2026 (www.justkannada.in): ದಸರಾದಲ್ಲಿ ಕಂಬಳ ಆಯೋಜನೆ ಬಗ್ಗೆ ಸಿಎಂ ತೀರ್ಮಾನ...

യു.എന്‍ പൂര്‍ണാംഗത്വത്തിനുള്ള പിന്തുണക്ക് പുറമെ ഫലസ്തീന് കൂടുതല്‍ സഹായം പ്രഖ്യാപിച്ച് ഇന്ത്യ

ന്യൂയോര്‍ക്ക്: ഫലസ്തീന് ഇന്ത്യ പുതിയ മാനുഷിക സഹായങ്ങള്‍ പ്രഖ്യാപിച്ചു. ഫലസ്തീന്‍ അഭയാര്‍ത്ഥികള്‍ക്കായി...