13
July, 2026

A News 365Times Venture

13
Monday
July, 2026

A News 365Times Venture

Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో “మాస్క్ మ్యాన్”.. ఎవరనేది తెలిసింది

Date:

Khamenei Funeral: ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ముగిశాయి. కోట్లాది సంఖ్యలో ఇరాన్ ప్రజలు అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయిల్ దాడుల్లో ఖమేనీతో సహా ఆయన కుటుంబీలకు చనిపోయారు. దాదాపు 4 నెలల తర్వాత ఖమేనీ అంత్యక్రియలు ఆయన స్వస్థలం మషాద్‌లో ముగిశాయి. అయితే, ఈ అంత్యక్రియల్లో ‘‘మాస్క్’’ ధరించిన వ్యక్తిపై అంతా ఆసక్తి నెలకొంది. అతను ఎవరనే దానిపై పలు రకాలు కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుత సుప్రీం లీడర్, ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ మాస్క్ ధరించి వచ్చాడనే ఊహాగానాలు కూడా వ్యక్తమయ్యాయి.

అయితే, మాస్క్ మ్యాన్ మొజ్తబా ఖాదని తేలింది. ఇరాన్ మీడియా ఇతడిని ఖమేనీ పెద్ద మనవడిగా గుర్తించింది. అంత్యక్రియల ప్రార్థన సమయంలో నల్లని ఫేస్ మాస్క్, నల్లని బేస్‌బాల్ క్యాప్ ధరించిన ఒక వ్యక్తి ముందు వరుసలో కూర్చుని కనిపించారు. ముసుగు ధరించిన ఆ వ్యక్తిని ఖమేనీ పెద్ద మనవడు మొహమ్మద్ జవాద్ ఖమేనీగా గుర్తించారు. అతను ఖమేనీ కుమారుడు మొజ్తాబా ఖమేనీ (అతను ఖమేనీకి కాబోయే వారసుడిగా విస్తృతంగా పరిగణించబడుతున్నారు) అని విస్తృత ఊహాగానాలు చెలరేగాయి.

ఫిబ్రవరి 28 దాడిలో జవాద్ ముఖంపై తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ కారణాల వల్లే అంత్యక్రియలకు హాజరైనప్పుడు అతను మాస్క్ ధరించాల్సి వచ్చిందని చెబుతున్నారు. మరోవైపు, ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేదు. యూఎస్ ఇంటెలిజెన్స్ ప్రకారం.. దాడుల్లో మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడి, ముఖం వికృతంగా మారిందని చెబుతోంది. దాడి జరిగిన సమయంలో మొజ్తబా తన తండ్రి నివాసంలోనే ఉన్నారని, వేరే గదిలో ఉండటంతో తీవ్ర గాయాలతో బయటపడ్డారని తెలుస్తోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

കുട്ടികളെ വളര്‍ത്തുന്നത് സ്ത്രീകളുടെ സഹജവാസന: യു.പി ഗവര്‍ണറുടെ ‘മിടുക്കിയായ അമ്മ’ പരാമര്‍ശത്തെ പിന്തുണച്ച് കങ്കണ റണാവത്ത്

ഛണ്ഡിഗഢ്: യു.പി ഗവര്‍ണര്‍ ആനന്ദി പട്ടേലിന്റെ സ്ത്രീകള്‍ക്കെതിരായ വിവാദ പ്രസ്താവനയെ പിന്തുണച്ച്...

அண்ணாமலையின் 'We The Leaders' மாநாடு: நிறைவேற்றப்பட்ட 6 தீர்மானங்கள் என்னென்ன?

பாஜக முன்னாள் மாநிலத் தலைவர் அண்ணாமலை அக்கட்சியில் இருந்து விலகி 'We...

ಮೈಸೂರು ದಸರಾ ವೇಳೆ ಕಂಬಳ ಬೇಡ: ಜನರ ಭಾವನೆಗೆ ಬೆಲೆ ಕೊಡಿ- ಬಿವೈ ವಿಜಯೇಂದ್ರ

ಮೈಸೂರು,ಜುಲೈ,11,2026 (www.justkannada.in):  ಮೈಸೂರು ದಸರಾದಲ್ಲಿ ಕಂಬಳ ಆಯೋಜನೆಗೆ ಮುಂದಾಗಿರುವ ರಾಜ್ಯ...

യുദ്ധക്കാറ്റില്‍ സമാധാനത്തിന്റെ തിരിനാളം അണയരുത്: ആഗോള അനുരഞ്ജനത്തിന് ആഹ്വാനവുമായി ലിയോ പതിനാലാമന്‍ മാര്‍പ്പാപ്പ

കാസ്റ്റല്‍ ഗാന്‍ഡോള്‍ഫോ: അന്താരാഷ്ട്ര തലത്തില്‍ സംഘര്‍ഷങ്ങള്‍ അതിരൂക്ഷമാകുന്ന പശ്ചാത്തലത്തില്‍, ലോകമെമ്പാടും ആഞ്ഞടിക്കുന്ന...