12
July, 2026

A News 365Times Venture

12
Sunday
July, 2026

A News 365Times Venture

Sri Charani: చరిత్ర సృష్టించిన కడప బిడ్డ.. టెస్ట్ ఫార్మాట్‌లోకి అడుగు పెట్టిన తెలుగమ్మాయి..

Date:

Sri Charani: మహిళల క్రికెట్ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక అద్భుతమైన రోజిది. భారత యువ స్పిన్ సంచలనం శ్రీ చరణి కెరీర్‌లో మరో మైలురాయి నమోదైంది. క్రికెట్ కాశీగా పిలిచే లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చరిత్రాత్మక ఏకైక టెస్ట్ మ్యాచ్ ద్వారా టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం (డెబ్యూ) చేసింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన చేతుల మీదుగా ఏపీకి చెందని కడప బిడ్డ శ్రీ చరణి టెస్ట్ క్యాప్ అందుకోవడం విశేషం.

నిజానికి లార్డ్స్ మైదానంలో పురుషుల టెస్ట్ మ్యాచ్‌లు 1884 నుంచే జరుగుతున్నా.. మహిళల అంతర్జాతీయ మ్యాచ్ జరిగి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఇక్కడ తొలిసారి ఒక మహిళల టెస్ట్ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ అరుదైన మ్యాచ్‌తోనే 21 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణి సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అడుగుపెట్టడం విశేషం. ఇక, ఇటీవల ముగిసిన మహిళల టీ20 వరల్డ్ కప్‌లో మన కడప బిడ్డ శ్రీ చరణి అద్భుత ప్రదర్శన చేసింది. కేవలం 5 మ్యాచ్‌ల్లోనే 14 వికెట్లు పడగొట్టి, ఒకే టీ20 ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు సృష్టించింది. గతంలో 2020లో పూనమ్ యాదవ్ (10 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును చరణి బద్దలు కొట్టింది. ఓవరాల్‌గా వరల్డ్ కప్ చరిత్రలోనే ఒకే ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో న్యూజిలాండ్ కెప్టెన్ అమేలియా కెర్ (15 వికెట్లు) తర్వాత చరణి రెండో స్థానంలో నిలిచింది. ఈ సంచలన ప్రదర్శనతోనే ఆమె ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 బౌలర్‌గా ఎదగడమే కాకుండా, ఇప్పుడు టెస్ట్ జట్టులోనూ చోటు సంపాదించుకుంది.

జట్టులోకి యాస్తికా భాటియా పునరాగమనం:

మరోవైపు, గాయం కారణంగా 2024లో దక్షిణాఫ్రికాతో జరిగిన చెన్నై టెస్టుకు, అలాగే ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన పెర్త్ టెస్టుకు దూరమైన వికెట్ కీపర్ బ్యాటర్ యాస్తికా భాటియా.. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ భారత టెస్ట్ జట్టులోకి తిరిగొచ్చింది. ఇక ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ జట్టు కూడా తమ ఆటగాళ్లు మేడీ విలియర్స్, అలిస్ క్యాప్సేలకు తొలిసారి టెస్ట్ క్యాప్‌లు అందించింది.

ఇరు జట్ల వివరాలు:

భారత మహిళల జట్టు: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తికా భాటియా, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, స్నేహ రాణా, సయాలీ సత్ఘరే, శ్రీ చరణి, క్రాంతి గౌడ్.

ఇంగ్లాండ్ మహిళల జట్టు: టామీ బ్యూమౌంట్, మాయా బూషియర్, హీథర్ నైట్, నాట్ సివర్ బ్రంట్ (కెప్టెన్), అలిస్ క్యాప్సే, అమీ జోన్స్ (వికెట్ కీపర్), మేడీ విలియర్స్, సోఫీ ఎక్లెస్టోన్, ఇస్సీ వాంగ్, లారెన్ బెల్, లారెన్ ఫిలర్.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಪೊಲೀಸರು ಡೀಲ್ ಹಾಗೂ ಅಪರಾಧಗಳಲ್ಲಿ ಭಾಗಿಯಾದರೆ ನಿರ್ದಾಕ್ಷಣ್ಯ ಕ್ರಮ -ಸಿಎಂ ಡಿ.ಕೆ ಶಿವಕುಮಾರ್

ಬೆಂಗಳೂರು, ಜುಲೈ,11,2026 (www.justkannada.in): “ಯಾವುದೇ ಪೊಲೀಸ್ ಅಧಿಕಾರಿಗಳು ಡೀಲ್ ಗಳು...

ഗവി പ്രിയദര്‍ശിനി ബസില്‍ നിയന്ത്രണം; പരമാവധി യാത്രക്കാരുടെ എണ്ണം 55

ഗവി: ഗവി പ്രിയദര്‍ശിനി ബസില്‍ നിയന്ത്രണം. പരമാവധി യാത്രക്കാരുടെ എണ്ണം 55...

“துரதிர்ஷ்டவசமாக தமிழ்நாட்டில் குருகுல கல்வியைச் செயல்படுத்த முடியவில்லை" – ஆளுநர் அர்லேக்கர்

சென்னை அரும்பாக்கத்தில் உள்ள துவாரகதாஸ் கோவர்தன்தாஸ் வைஷ்ணவ் கல்லூரியின் (தன்னாட்சி) 59-வது...