6
July, 2026

A News 365Times Venture

6
Monday
July, 2026

A News 365Times Venture

Polavaram Agency: ఏజెన్సీలో ఇంకా డోలీ మోతలే.. 4 కొండలు దాటి బాలికను మోసుకెళ్లిన గిరిజనులు

Date:

Polavaram Agency: పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో వైద్య, రవాణా సౌకర్యాల కొరత మరోసారి బహిర్గతమైంది. పాము కాటుకు గురైన ఓ గిరిజన బాలికను అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డోలిలో మోసుకుంటూ కొండలు దాటి ఆసుపత్రికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చింతూరు మండలం కర్మన్ కొండ గ్రామానికి చెందిన 16 ఏళ్ల సమ్మక్క ప్రియ పాము కాటుకు గురైంది. అత్యవసరంగా వైద్యం అవసరమైనప్పటికీ గ్రామానికి అంబులెన్స్ చేరుకోలేకపోయింది. దీంతో కొండరెడ్డి గిరిజనులు బాలికను డోలిలో పడుకోబెట్టి సుమారు నాలుగు కొండలు ఎక్కి, దిగి కూటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు.

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న ఈఎంటీ వెంకట్ విధుల్లో లేకపోయినా మానవత్వంతో స్పందించారు. తన సొంత బైక్‌పై వెళ్లి బాధితురాలిని ఆసుపత్రికి చేర్చేందుకు సహకరించారు. అయితే కూటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్న తర్వాత అక్కడ వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో స్టాఫ్ నర్స్ బాలికకు ప్రాథమిక చికిత్స అందించారు. ఈ ఘటనతో స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికీ డోలి మోతలు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అత్యవసర వైద్య సేవలు, రోడ్లు, అంబులెన్స్ సౌకర్యాలు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మరోసారి వెలుగులోకి వచ్చింది.

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

തെറ്റ് തിരുത്താനുള്ള ശ്രമമല്ല സി.പി.ഐ.എമ്മില്‍ നടക്കുന്നത്; വിവാദമുണ്ടാക്കുന്നത് പാര്‍ട്ടി നേതൃത്വം തന്നെ: വി.കുഞ്ഞികൃഷ്ണന്‍

കണ്ണൂര്‍: തെറ്റ് തിരുത്താനുള്ള ശ്രമമല്ല സി.പി.ഐ.എമ്മില്‍ നടക്കുന്നതെന്ന് പയ്യന്നൂര്‍ എം. എല്‍.എ...

`Last Bench'சர்ச்சை: அமைச்சர் கீர்த்தனாவுக்கு முன்னாள் அமைச்சர் அன்பில் மகேஸ் கண்டனம்!

விருதுநகர் மாவட்டம் சிவகாசி அருகே திருத்தங்கலில் உள்ள அரசுப் பெண்கள் மேல்நிலைப்...

SIR ಪ್ರಕ್ರಿಯೆ: ಪ್ರತಿಪಕ್ಷದವರು ನಮ್ಮ ಕೆಲಸಕ್ಕೆ ಅಭಿನಂದನೆ ಸಲ್ಲಿಸಬೇಕು- ಸಿಎಂ ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್

ಬೆಂಗಳೂರು,ಮೇ,6,2026 (www.justkannada.in): ಎಸ್ ಐಆರ್ ಬಗ್ಗೆ ಜಾಹೀರಾತು ನೀಡುತ್ತಿದ್ದೇವೆ. ಜಾಗೃತಿ...

വഖഫ് ബോര്‍ഡില്‍ ഹിന്ദു അംഗങ്ങളെ നിയമിച്ച് മധ്യപ്രദേശ് സര്‍ക്കാര്‍; വഖഫ് നിയമഭേദഗതിയിലെ വിവാദ വ്യവസ്ഥ നടപ്പിലാക്കുന്ന ആദ്യ സംസ്ഥാനം

  ഭോപ്പാല്‍: ചരിത്രത്തിലാധ്യമായി വഖഫ് ബോര്‍ഡില്‍ രണ്ട് ഹിന്ദു അംഗങ്ങളെ ഉള്‍പ്പെടുത്തി...