6
July, 2026

A News 365Times Venture

6
Monday
July, 2026

A News 365Times Venture

Eluru: తీవ్ర విషాదం.. రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!

Date:

Eluru: ఏలూరు జిల్లా చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి దారుణంగా చోటు చేసుకుంది. రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ప్రాణాలు కోల్పోయారు. రాత్రి సుమారు 9 గంటల సమయంలో ప్లాట్‌ఫారం సమీపంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా, విశాఖపట్నం వైపు వెళ్తున్న ఓ ప్రత్యేక రైలు వీరిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిని తాడేపల్లిగూడెంలో నివసిస్తున్న షేక్ చాంద్ బాషా (50), ఆయన భార్య షేక్ హసీనా (45), వారి కుమార్తెలు షేక్ షర్మిల (23), షేక్ సమీరా (20)గా రైల్వే అధికారులు గుర్తించారు. వీరిలో పెద్ద కుమార్తె షర్మిల ఎంబీఏ చదువుతోంది. చాంద్ బాషా, హసీనా దంపతులు తాడేపల్లిగూడెంలో ఒక ఆప్టికల్ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

మృతుల నేపథ్యం పరిశీలిస్తే.. వీరి స్వస్థలం గుడివాడ కాగా, సుమారు 25 ఏళ్ల క్రితమే వీరు తాడేపల్లిగూడెం వచ్చి స్థిరపడ్డారు. పట్టణంలోని 6వ వార్డు, మామిడితోట ప్రాంతంలో గత మూడేళ్లుగా ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. అయితే, ఈ కుటుంబం కొంతకాలంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన జూలై 4వ తేదీ సాయంత్రం కూడా ఈ కుటుంబ సభ్యులంతా కలిసి రెండు మోటార్‌సైకిళ్లపై ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు పొరుగువారు గుర్తుచేసుకున్నారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనా లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా అనే విషయాలు ఇంకా స్పష్టం కాలేదు. సమాచారం అందుకున్న వెంటనే జీఆర్పీ సీఐ, ఎస్‌ఐలు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

യു.എസുമായി ഇറാന്‍ സമാധാനത്തിലല്ല; ധാരണാപത്രം നടപ്പാക്കുന്നത് പ്രയാസമെങ്കിലും അസാധ്യമല്ലെന്ന് ഖാലിഭാഫ്

ടെഹ്‌റാന്‍: ഇറാന്‍-യു.എസ് ധാരണാ പത്രത്തിലെ വ്യവസ്ഥകള്‍ നടപ്പാക്കുന്നത് പ്രയാസകരമാണെങ്കിലും അസാധ്യമല്ലെന്ന് ഇറാന്‍...

'காமேனியின் இறுதிச் சடங்கிலேயே ஈரான் தலைவர்களை ஒழித்துவிட முடியும்'- ட்ரம்ப் பேச்சு; ஈரான் பதிலடி!

ஈரான் மீதான அமெரிக்கா, இஸ்ரேல் தாக்குதலில், கடந்த பிப்ரவரி 28-ம் தேதி...

‘അധികാരത്തിലുള്ളത് ഹിന്ദുക്കളെ കൊള്ളയടിക്കുന്നവര്‍’; രാമക്ഷേത്ര തട്ടിപ്പില്‍ കേന്ദ്രത്തിനെതിരെ ഉദ്ധവ് താക്കറെ

മുംബൈ: അയോധ്യ രാമക്ഷേത്ര ഫണ്ട് തട്ടിപ്പില്‍ കേന്ദ്ര സര്‍ക്കാരിനും ബി.ജെ.പിക്കുമെതിരെ വീണ്ടും...

மேகதாது: டெல்டா விவசாயிகள் அச்சத்தைப் போக்க அனைத்து கட்சிக் கூட்டத்தைக் கூட்ட வேண்டும்! – அன்புமணி

காவிரி ஆற்றின் குறுக்கே மேகதாது அணை கட்டுவதற்கான நடவடிக்கைகளை கர்நாடக அரசு...