2
July, 2026

A News 365Times Venture

2
Thursday
July, 2026

A News 365Times Venture

YS Jagan: పీఎస్‌కు వెళ్లాలంటే భయపడే పరిస్థితి.. జగన్ సంచలన వ్యాఖ్యలు

Date:

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో చట్టవ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరోపించారు. గతంలో రాష్ట్ర అభివృద్ధిపై చర్చ జరిగేదని, ఇప్పుడు మాత్రం “రెడ్‌బుక్ రాజ్యాంగం”, పోలీస్ స్టేషన్లలో జరుగుతున్న లాకప్ మరణాలపై చర్చ జరుగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలంటే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారి గొంతులు నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని విభేదించే స్వరాలను అణచివేస్తున్నారని జగన్ ఆరోపించారు. విజయవాడ సాయికృష్ణ కేసు, క్రాంతికుమార్ ఆత్మహత్య, కర్నూలు గంగమ్మ ఘటన వంటి సంఘటనలు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు.

సాయికృష్ణ కేసును ప్రస్తావిస్తూ, కస్టడీలో ఒక వ్యక్తిని హింసించి హత్య చేసి, ఆధారాలను మాయం చేశారని ఆరోపించారు. కుటుంబ సభ్యులకు కనీసం అస్థికలు కూడా ఇవ్వలేదని అన్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైన తర్వాత ప్రభుత్వం వైఖరి మార్చుకుందని, తొలుత బాధితుడిని రౌడీషీటర్‌గా చిత్రీకరించి, తర్వాత కుటుంబాన్ని పిలిచి న్యాయం చేస్తామని చెప్పడం విరుద్ధ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం అమలు కావడం లేదని, బాధితులకు మద్దతు తెలిపిన వారిపైనా విమర్శలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ప్రభుత్వ చర్యలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

 

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മൊജ്തബയെ വധിക്കുമെന്ന ഭീഷണി: ഭരണകൂട ഭീകരതയെ ഇസ്രഈല്‍ നോര്‍മലൈസ് ചെയ്യുകയാണ്; യു.എന്നിനോട് ഇറാന്‍

ടെഹ്‌റാന്‍: ഇറാന്‍ പരമോന്നത നേതാവ് മൊജ്തബ ഖാംനഇയെ വധിക്കുമെന്ന ഇസ്രഈല്‍ പ്രതിരോധ...

"இது ட்ரைலர்தான்; மெயின் பிக்சரை டெல்டாவில் காட்டுவோம்" – தவெக இணைப்பு விழாவில் விஜயபாஸ்கர் 'பன்ச்'

அதிமுக முன்னாள் எம்.எல்.ஏக்கள் சி. விஜய பாஸ்கர், எம்.ஆர். விஜயபாஸ்கர் இன்று...

ಕಲ್ಲುಕ್ವಾರಿ ದುರಂತದಲ್ಲಿ ಮೃತಪಟ್ಟವರಿಗೆ ಸಂತಾಪ: ವರದಿ ಪಡೆದು ಸೂಕ್ತ ಕ್ರಮ – ಸಿಎಂ ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್

ಬೆಂಗಳೂರು,ಜುಲೈ,2,2026 (www.justkannada.in):  ಬೆಂಗಳೂರು ದಕ್ಷಿಣ ಜಿಲ್ಲೆಯ ಮಾದಪಟ್ಟಣದಲ್ಲಿ ಕಲ್ಲುಕ್ವಾರಿಯಲ್ಲಿ ಬಂಡೆ...

യു.പിയില്‍ എസ്.പിയുടെ അത്രയും സീറ്റുകള്‍ വേണമെന്ന് കോണ്‍ഗ്രസ്; മുന്നണിയിലേക്ക് ബി.എസ്.പി അടക്കമുള്ള മറ്റു പാര്‍ട്ടികളെയും പരിഗണിച്ചേക്കും

ലഖ്‌നൗ: ഉത്തര്‍ പ്രദേശില്‍ സമാജ്‌വാദി പാര്‍ട്ടിക്കൊപ്പം(എസ്.പി) കോണ്‍ഗ്രസും ഇന്ത്യ സഖ്യത്തില്‍ തുല്യ...