20
June, 2026

A News 365Times Venture

20
Saturday
June, 2026

A News 365Times Venture

Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్

Date:

Paraquat Herbicide Ban: పారాక్వాట్ డైక్లోరైడ్ 24% ఎస్‌ఎల్ (Paraquat Dichloride 24% SL) గడ్డి మందు అమ్మకాలను 60 రోజుల పాటు నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ ఈ ఏడాది మే 22న జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి. వెంకట నాగిరెడ్డి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటిషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, గడ్డి మందు సేవించి ఆత్మహత్యలు జరుగుతున్నాయనే అంశాన్ని ప్రస్తావిస్తూ డీజీపీ పంపిన లేఖ ఆధారంగా ప్రభుత్వం నిషేధం విధించిందని తెలిపారు. అయితే, ఈ నిర్ణయం తీసుకునే ముందు డీలర్లకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని, తమ అభ్యంతరాలు లేదా వివరణలు చెప్పుకునే అవకాశం కూడా కల్పించలేదని పిటిషనర్ వాదించారు.

కీటకనాశన చట్టంలోని నిబంధనల ప్రకారం, వ్యవసాయంలో వినియోగించే రసాయన పదార్థం వల్ల నేరుగా ప్రమాదం ఉన్నప్పుడే నిషేధం విధించవచ్చని, ఆత్మహత్యలను కారణంగా చూపి అమ్మకాలపై నిషేధం విధించడం చట్టబద్ధం కాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే, వ్యవసాయశాఖ ఆకస్మిక నిర్ణయం కారణంగా ప్రస్తుత సాగు సీజన్‌లో రైతులు కలుపు నివారణ సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని, భారీగా నిల్వలు ఉంచుకున్న డీలర్లకు కూడా ఆర్థిక నష్టం కలుగుతోందని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ జీవోను రద్దు చేయాలని, నిషేధ ఉత్తర్వులను నిలిపివేయాలని హైకోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టనుండటంతో రైతులు, డీలర్లు, వ్యవసాయ రంగ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഗ്രേറ്റ് നിക്കോബാര്‍: കേന്ദ്രത്തിന് സുതാര്യതയില്ലാത്ത നയമെന്ന് ജയറാം രമേശ്

ന്യൂദല്‍ഹി: ഗ്രേറ്റ് നിക്കോബാര്‍ പദ്ധതിയില്‍ കേന്ദ്രസര്‍ക്കാര്‍ സ്വീകരിക്കുന്നത് അസാധാരണമായ തരത്തില്‍ സുതാര്യതയില്ലാത്ത...

தவெகவில் இணைந்த சி.மகேந்திரன்: 'அமைப்பு விதிகளுக்கு விரோதமாக செயல்பட்டவர்' – CPI கருத்து

இந்திய கம்யூனிஸ்ட் கட்சியின் மூத்த உறுப்பினர் சி.மகேந்திரன் நேற்று தவெகவில் இணைந்தார்....

ಪೌರ ಕಾರ್ಮಿಕರ ತ್ಚರಿತ ನೇಮಕಾತಿಗೆ  ಸೂಚಿಸಿದ ನಗರಾಭಿವೃದ್ಧಿ ಸಚಿವ ಡಾ.ಯತೀಂದ್ರ ಸಿದ್ದರಾಮಯ್ಯ.

  ಬೆಂಗಳೂರು, ಜೂ.೧೯,೨೦೨೬:  ಎಲ್ಲಾ ನಗರಗಳಲ್ಲಿ ಪೌರ ಕಾರ್ಮಿಕರ ಕೊರತೆ ಇದೆ....

സി.പി.ഐ.എമ്മും ലീഗും കോണ്‍ഗ്രസും പിന്തുണയ്ക്കുന്ന സര്‍ക്കാര്‍; പക്ഷേ തമിഴ്നാട്ടില്‍ ഇസ്രാഈല്‍ റഡാറുകള്‍ നിര്‍മിക്കാനൊരുങ്ങുന്നു

ചെന്നൈ: തമിഴ്നാട്ടിലെ കൃഷ്ണഗിരി ജില്ലയില്‍ ഇസ്രഈല്‍ സര്‍ക്കാര്‍ ഉടമസ്ഥതയിലുള്ള ഇസ്രഈല്‍ എയ്റോസ്പേസ്...