18
June, 2026

A News 365Times Venture

18
Thursday
June, 2026

A News 365Times Venture

INDA Vs AFGA: ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా.. ఆప్ఘనిస్థాన్‌పై భారీ విజయం..

Date:

శ్రీలంకలో జరుగుతున్న ట్రై నేషన్ ఎ సిరీస్ 2026 టోర్నమెంట్‌లో భారత్ ఎ జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్లోకి దూసుకెళ్లింది. సిరీస్‌లో భాగంగా జరిగిన 5వ వన్డే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ ఎ జట్టుపై భారత్ ఎ 101 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో మెరుగైన నెట్ రన్ రేట్ (+0.797) సాధించిన టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఎ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 320 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్ ఎ జట్టుకు భారత బౌలర్లు ఆదిలోనే చుక్కలు చూపించారు. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ, ఆరంభంలోనే కీలక వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. దీంతో ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు సరైన భాగస్వామ్యాలు లభించలేదు. అయితే ఈ దశలో ఫైసల్, బిహార్ జోడి భారత బౌలర్లను కాసేపు ప్రతిఘటించింది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు అత్యంత కీలకమైన 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బిహార్ బాధ్యతాయుతంగా ఆడి అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, ఫైసల్ కేవలం 4 పరుగుల తేడాతో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకుని అవుట్ అయ్యాడు.

ఆఫ్ఘన్ జట్టుకు ఆశాకిరణంగా నిలిచిన ఈ భాగస్వామ్యం విడిపోవడంతో వారి బ్యాటింగ్ లైన్ అప్ పూర్తిగా కుప్పకూలింది. భారత బౌలర్ల ధాటికి ఆఫ్ఘన్ బ్యాటర్లు క్రీజులో నిలబడలేక క్రమశిక్షణతో వికెట్లు సమర్పించుకున్నారు. భారత కెప్టెన్ తిలక్ వర్మ సమయానుకూలంగా చేసిన బౌలింగ్ మార్పులు జట్టుకు అద్భుతంగా కలిసివచ్చాయి. ముఖ్యంగా భారత స్పిన్నర్ నిశాంత్ సింధు తన స్పిన్ మాయాజాలంతో ఆఫ్ఘన్ బ్యాటర్లను తిప్పలు పెట్టాడు. నిశాంత్ సింధు చివరి వికెట్‌తో సహా మొత్తం నాలుగు కీలక వికెట్లు పడగొట్టి ఆఫ్ఘనిస్థాన్ పతనాన్ని శాసించాడు. దీంతో ఆఫ్ఘనిస్థాన్ ఎ జట్టు 36.5 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌట్ అయింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో సమిష్టిగా రాణించిన భారత్ ఎ జట్టు ఈ మ్యాచ్‌ను ఏకపక్షంగా ముగించి అర్హత సాధించింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

DA Hike: విద్యుత్ ఉద్యోగులకు సర్కార్‌ గుడ్‌న్యూస్..

DA Hike: రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది....

ಜಯದೇವ ರೋಗಿಗಳ ಸಾವು ಕೇಸ್: ಇನ್ನೆರಡು ತಿಂಗಳಲ್ಲಿ ಸಿಬ್ಬಂದಿಗಳ ಕೊರತೆ ನಿವಾರಣೆ- ಸಚಿವ ಡಾ ಶರಣ ಪ್ರಕಾಶ್ ಪಾಟೀಲ್

ಮೈಸೂರು,ಜೂನ್,17,2026 (www.justkannada.in):  ಜಯದೇವ ಹೃದ್ರೋಗ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ 11 ರೋಗಿಗಳ ಸಾವು...

നാഷണല്‍ കോണ്‍ഫറന്‍സിന്റെ തത്വങ്ങള്‍ വില്പനയ്ക്കുള്ളതല്ല; രാഷ്ട്രീയ നിലപാട് വ്യക്തമാക്കി ഒമര്‍ അബ്ദുള്ള

  ശ്രീനഗര്‍: അധികാരത്തിന് വേണ്ടി തങ്ങളുടെ രാഷ്ട്രീയ പ്രത്യയശാസ്ത്രത്തിലോ അടിസ്ഥാന മൂല്യങ്ങളിലോ...

`அனிதாவில் துவங்கிய நீட் மரணம் என் மகளோடு முடியணும்’ – தற்கொலை செய்த கோவை மாணவியின் தந்தை வேதனை!

கோவைப்புதூர் பார்க் டவுன் பகுதியைச் சேர்ந்த செந்தில் பிரபு என்பவர், கோவை...