24
September, 2026

A News 365Times Venture

24
Thursday
September, 2026

A News 365Times Venture

Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..

Date:

Natural gas: ఇంధన రంగంలో భారత్‌కు ఇది భారీ శుభవార్త. అండమాన్ సముద్రంలో సహజ వాయువు(నేచురల్ గ్యాస్) నిల్వల్ని ఆయిల్ ఇండియా లిమిటెడ్(OIL) గుర్తించింది. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. అండమాన్ దీవుల తూర్పు తీరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో 355 మీటర్ల నీటి లోతులో ఉన్న ‘‘శ్రీ విజయపురం-3’’ బావిలో ఈ గ్యాస్ నిల్వల్ని గుర్తించినట్లు తెలిపారు. ఈ బావిని 1900 మీటర్లకు పైగా లోతులోని ఈయోసిన్ శిలా పొరల వరకు తవ్వారు. భూగర్భం నుంచి వచ్చిన గ్యాస్‌ను మండించడం ద్వారా సహజవాయువు ఉనికిని గుర్తించారు.

ఆయిల్ ఇండియా లిమిటెడ్ ప్రస్తుత వాయువు మూలాన్ని అర్థం చేసుకోవడానికి ఐసోటోప్ అధ్యయనాలతో పాటు, దాని రసాయనిక స్వరూపం, కిలోరిఫిక్ వాల్యూ తెలుసుకోవడానికి అధ్యయనాలు నిర్వహిస్తోంది. భారతదేశ తీర ప్రాంతాల్లో, అత్యంత లోతైన జనాల్లో అన్వేషన చేయడానికి కేంద్రం ప్రకటించిన ‘‘సముద్ర మంథన్ మిషన్’’లో భాగంగా ఈ ఆవిష్కరణ జరిగింది.

ప్రస్తుతం, అండమాన్ బేసిన్‌లో ఆయిల్ ఇండియా తవ్విన మూడు బావుల్లో రెండింటిలో హైడ్రోకార్బన్లను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో అండమాన్‌లో దొరికిన ఈ గ్యాస్ భారత ఇంధన భద్రతకు కీలక ప్రదేశం మారే అవకాశాలు ఉన్నాయి. భారత్ తన ఇంధన అవసరాల కోసం గల్ఫ్ తో పాటు ఇతర దేశాలపై ఆధారపడుతోంది. ఈ ప్రాంతాల్లో ఏదైనా సంక్షోభం నెలకొంటే, దేశంలో ఇంధన ధరలు పెరగడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం, ఇరాన్ యుద్ధం వల్ల భారత్ ఇంధన రంగం ఒత్తిడిని ఎదుర్కొంటోంది.


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

தேர்தல் ஆணையம்: “இதனால்தான் இந்த விவகாரம் சர்ச்சையாகியுள்ளது..!" – முன்னாள் ஆணையர் சொல்வதென்ன?

தேர்தல் ஆணையத்தில் பெரும்பான்மை உறுப்பினர்களின் ஆதரவோ அல்லது ஒருமித்த கருத்தோ இன்றி...

AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!

AP Liquor Shops: ఆంధ్రప్రదేశ్‌లో 2026–27 ఎక్సైజ్ సంవత్సరానికి ఏ4 మద్యం...

കുടുംബ കലഹങ്ങള്‍ വേണ്ട; എ.ഐ ക്യാമറ നിയമ ലംഘന നോട്ടീസുകളില്‍ ചിത്രങ്ങള്‍ ഒഴിവാക്കാന്‍ എം.വി.ഡി

തിരുവനന്തപുരം: മോട്ടോര്‍ വാഹന വകുപ്പിന്റെ എ.ഐ ക്യാമറകള്‍ വഴിയുള്ള നിയമലംഘനങ്ങള്‍ പരിശോധിക്കുന്നതിനുള്ള...

“நாங்கள் யார் மீதும் போர் தொடுத்ததில்லை; எங்கள் மீது போர் திணிக்கப்பட்டது!” – ஐ.நா-வில் ஈரான் அதிபர்

ஈரான் போர் தொடர்ந்துகொண்டிருக்கும் இதே வேளையில், அமெரிக்காவிற்குச் சென்றிருக்கிறார் ஈரான் அதிபர்...