24
September, 2026

A News 365Times Venture

24
Thursday
September, 2026

A News 365Times Venture

Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..

Date:

జపాన్‌తో జరిగిన చారిత్రాత్మక తొలి పురుషుల టీ20 మ్యాచ్‌లో భారత్ తరఫున ఆడుతున్న 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు దక్కలేదు. ఈ మ్యాచ్‌లో భారత్ కేవలం 2 పరుగుల తేడాతో అతికష్టం మీద విజయం సాధించింది. అయితే, వైభవ్ బరిలోకి దిగుతాడని ఆశించిన జపాన్ కెప్టెన్ కెండెల్ కడోవాకీ-ఫ్లెమింగ్ నిరాశ వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్న ఆ యువ సంచలనాన్ని మైదానంలో ఆడటాన్ని తాను చూడాలనుకున్నానని, కానీ టీమ్ షీట్‌లో అతని పేరు లేకపోవడం తనకు నిరాశ కలిగించిందని పేర్కొన్నారు.

భారత్, జపాన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలకి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన ఈ మ్యాచ్‌లో వైభవ్ భారత స్క్వాడ్‌లో ఉన్నప్పటికీ తుది జట్టులో అవకాశం లభించలేదు. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను ఐదు ఓవర్లకు కుదించడంతో ఇన్నింగ్స్ కేవలం ముప్పై బంతులకే పరిమితమైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఐదు ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి కేవలం 32 పరుగులు మాత్రమే చేసింది. జపాన్ స్పిన్నర్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మ తొలి బంతికే వెనుదిరగగా, సంజు శాంసన్ కూడా నిరాశపరిచారు.

చిన్న లక్ష్యంతో బరిలోకి దిగిన జపాన్ జట్టు భారత్‌కు చుక్కలు చూపించింది. జపాన్ కెప్టెన్ 12 పరుగులు చేసి జట్టును గెలుపు ముఖం వైపు నడిపించినప్పటికీ.. చివరి ఓవర్‌లో అక్షర్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కేవలం రెండు పరుగులే ఇచ్చారు. చివరి బంతికి నాలుగు పరుగులు కావాల్సిన దశలో జపాన్ ఒక్క పరుగు మాత్రమే తీయగలిగింది. దీంతో భారత్ 2 పరుగుల తేడాతో అతికష్టంగా విజయం సాధించింది. ఏషియన్ గేమ్స్ 2026కు ముందు జరిగిన ఈ సన్నాహక మ్యాచ్‌లో టీమిండియా ప్రదర్శన తీవ్ర చర్చనీయాంశమైంది. వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం ఇవ్వకపోవడంపై సర్వత్రా చర్చ సాగుతోంది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

കുടുംബ കലഹങ്ങള്‍ വേണ്ട; എ.ഐ ക്യാമറ നിയമ ലംഘന നോട്ടീസുകളില്‍ ചിത്രങ്ങള്‍ ഒഴിവാക്കാന്‍ എം.വി.ഡി

തിരുവനന്തപുരം: മോട്ടോര്‍ വാഹന വകുപ്പിന്റെ എ.ഐ ക്യാമറകള്‍ വഴിയുള്ള നിയമലംഘനങ്ങള്‍ പരിശോധിക്കുന്നതിനുള്ള...

“நாங்கள் யார் மீதும் போர் தொடுத்ததில்லை; எங்கள் மீது போர் திணிக்கப்பட்டது!” – ஐ.நா-வில் ஈரான் அதிபர்

ஈரான் போர் தொடர்ந்துகொண்டிருக்கும் இதே வேளையில், அமெரிக்காவிற்குச் சென்றிருக்கிறார் ஈரான் அதிபர்...

ഗര്‍ബ നൃത്തത്തിന് വരുമ്പോള്‍ നിങ്ങളുടെ സഹോദരിമാരെയും പെണ്‍മക്കളെയും കൊണ്ടുവരൂ: മുസ്‌ലിം സ്ത്രീകള്‍ക്കെതിരെ ബലാത്സംഗ ഭീഷണിയുമായി ബി.ജെ.പി എം.എല്‍.എ

ഭോപാല്‍: മുസ്‌ലിം സ്ത്രീകള്‍ക്കെതിരെ ബലാത്സംഗഭീഷണിയുമായി ഭോപ്പാലിലെ ഹുസൂരില്‍ നിന്നുള്ള ബി.ജെ.പി എം.എല്‍.എ...

"எடப்பாடியுடன் கூட்டணி வைத்தால் துணை முதல்வர் பதவி என்றார் ஆதவ் அர்ஜுனா" – ரகசியம் பகிர்ந்த சீமான்

தாராபுரம் இடைத்தேர்தலில் நாம் தமிழர் கட்சி வேட்பாளராக களத்தில் உள்ள கார்த்திகாவை...