2
June, 2026

A News 365Times Venture

2
Tuesday
June, 2026

A News 365Times Venture

Annamalai: బీజేపీకి గుడ్‌బై చెప్పనున్న అన్నామలై.. సొంత పార్టీపై ఫోకస్

Date:

Annamalai: తమిళనాడులో బీజేపీకి ఆశాకిరణంగా కనిపించిన కే. అన్నామలై, ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పనున్నారు. ఇప్పటికే ఆయన జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్‌కు రాజీనామా లేఖ అప్పగించినట్లు సమాచారం. గత కొన్నేళ్లుగా అన్నామలై తమిళనాడులో బీజేపీని నడిపించేందుకు ప్రయత్నించారు. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, బీజేపీ ఆయనను పక్కన పెట్టింది. ఆయన ఆకస్మిక నిర్ణయం వెనక ఏఐడీఎంకేతో పొత్తు, ఎన్నికల వైఫల్యాలు, పార్టీ కేంద్ర నాయకత్వ ప్రణాళిక మధ్య పెరుగుతున్న అంతరాలు దాగి ఉన్నాయి.

తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు మంగళవారం ఉదయం పార్టీ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సంస్థాగత కార్యదర్శి బి.ఎల్. సంతోష్‌లను కలిశారు. తాను సొంత పార్టీ పెట్టి, సొంత మార్గంలో పయనించాలని అన్నామలై భావిస్తున్నారు. బీజేపీ నుంచి సౌహార్దపూర్వక రీతిలో విడిపోవాలని కోరుకుంటున్నట్లు ఆయన బీజేపీ అగ్ర నాయకత్వానికి తెలియజేసినట్లు తెలుస్తోంది. తన రాజీనామాకు దారి తీసిన పరిస్థితులను కూడా బీజేపీ అగ్రనాయకత్వానికి వివరించారు. అయితే, అన్నామలై లెవనెత్తిన అంశాలను పరిశీలించడానికి తమకు కొంత సమయం ఇవ్వాలని పార్టీ ఆయనను కోరింది. బుధవారం వరకు ఆయన ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది.

అన్నామలై పార్టీలో కొనసాగేలా ఒప్పించేలా బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే, ఆయన మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోకూడదని గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. అన్నామలై ముందుగా ఒక రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించి, ఆ తర్వాత పార్టీ పెట్టే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆయన ‘వి ది లీడర్స్’ అనే నాయకత్వ కార్యక్రమాన్ని నడుపుతున్నారు. 234 సభ్యులు ఉన్న తమిళనాడు ఎన్నికల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ కేవలం 1 స్థానానికి మాత్రమే పరిమితమైంది. ఈ ఫలితాల తర్వాత అన్నామలై రాజీనామా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

WMO Warning: ప్రమాదకర ఎల్‌నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక

ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ...

IPLಗೂ ಡಾ. ರಾಜ್ ಕುಟುಂಬಕ್ಕೂ ವಿಶೇಷ ನಂಟು? ಕಾಕತಾಳೀಯವಾದರೂ ಕುತೂಹಲ ಮೂಡಿಸಿದ ಸಂಗತಿಗಳು!

  ಬೆಂಗಳೂರು, ಜೂ.೦೨,೨೦೨೬: ಕ್ರಿಕೆಟ್ ಅಭಿಮಾನಿಗಳ ಹಬ್ಬವೆಂದೇ ಕರೆಯಲಾಗುವ ಐಪಿಎಲ್‌ ಟ್ರೋಫಿ...

കുട്ടികള്‍ക്ക് മിഠായി കൈയില്‍ കൊടുക്കാതിരുന്ന സംഭവം; വിമര്‍ശങ്ങള്‍ക്കൊടുവില്‍ പ്രതികരണവുമായി വി. മുരളീധരന്‍

തിരുവനന്തപുരം: കട്ടേല മോഡല്‍ റസിഡന്‍ഷ്യല്‍ സ്‌കൂളില്‍ കുട്ടികള്‍ക്ക് മിഠായി കൈയില്‍ കൊടുക്കാതെ...

போலி கையொப்ப சிக்கல்; அதிகரிக்கும் அதிருப்தி… பிளவை நோக்கிச் செல்கிறதா மம்தா கட்சி?!

மேற்கு வங்கத்தில் திரிணாமுல் காங்கிரஸ் சமீபத்தில் நடந்த சட்டமன்றத் தேர்தலில் தோல்வியைத்...