ఐపీఎల్ 2026 సీజన్ ముగిసినా, ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటింగ్ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పేరు మారుమోగిపోతోంది. ఆదివారం అహ్మదాబాద్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ తర్వాత అందరి కళ్ళు ఈ కుర్రాడి పైనే పడ్డాయి. ఈ సీజన్‌లో అద్భుతంగా రాణించిన వైభవ్.. ఏకంగా ఐదు ప్రతిష్టాత్మక అవార్డులను తన సొంతం చేసుకున్నాడు. ఆయన ఆరెంజ్ క్యాప్, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, సూపర్ స్ట్రైకర్, మరియు మోస్ట్ సిక్సెస్ అవార్డులను గెలుచుకున్నాడు.
కేవలం 15 సంవత్సరాల 65 రోజుల వయసులోనే ఆరెంజ్ క్యాప్ సాధించి, ఐపీఎల్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ సీజన్‌లో 16 ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతను ఏకంగా 776 పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ ఫైనల్ మ్యాచ్‌లో ఈ పరుగుల రికార్డును దాటలేకపోయారు. అంతేకాదు, గతంలో క్రిస్ గేల్ పేరిట ఉన్న 59 సిక్సర్ల రికార్డును బద్దలు కొడుతూ.. ఈ సీజన్‌లో ఏకంగా 72 సిక్సర్లు బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు.
Funny conversations between Ravi Shastri and Vaibhav Suryavanshi
pic.twitter.com/FmY2TpPr5g
— Shin Kohli (@Shinkohli) May 31, 2026
అవార్డుల ప్రధానోత్సవం తర్వాత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి వైభవ్‌ను వేదికపై సరదాగా ఒక ప్రశ్న అడిగారు. ‘నువ్వు ఇంత చిన్న వయసులో అంత బలంగా సిక్సర్లు ఎలా కొడుతున్నావు? రోజుకు ఎన్ని లీటర్ల పాలు తాగుతావు?’ అని అడిగారు. దానికి వైభవ్ నవ్వుతూ.. ‘నేను ఇప్పుడు పాలు తాగడం మానేశాను’ అని సమాధానం ఇవ్వడంతో అక్కడ నవ్వులు విరిశాయి. మొత్తానికి ఈ చిన్న వయసులోనే వైభవ్ సూర్యవంశీ అద్భుత ఆటతీరుతో క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు.






