30
May, 2026

A News 365Times Venture

30
Saturday
May, 2026

A News 365Times Venture

IPL 2026 Final: ఫైనల్ కు వర్షం గండం.. మరి రిజర్వ్ డే సంగతేంటి.?

Date:

IPL 2026 Final: ఐపీఎల్ 2026 సీజన్ చివరి మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ ఫైనల్ మే 31న జరగనుంది. ఈసారి టైటిల్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు తలపడనున్నాయి. అయితే అహమ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు ముందు వర్షం భయం అభిమానుల్లో కాస్త టెన్షన్ గా మారింది.

ఈ సీజన్‌ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగి అద్భుత ప్రదర్శనతో ఆర్‌సీబీ ఫైనల్‌కు దూసుకొచ్చింది. క్వాలిఫైయర్-1లో గుజరాత్ టైటాన్స్‌పై భారీ విజయాన్ని నమోదు చేసి నేరుగా ఫైనల్ బెర్త్ కైవసం చేసుకుంది. మరోవైపు క్వాలిఫైయర్-2లో గుజరాత్ అద్భుత కంబ్యాక్ ఇచ్చి మరోసారి టైటిల్ రేసులో నిలిచింది. దీంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇరు జట్లలో ఎవరు గెలిచినా ట్రోఫీని రెండోసారి ముద్దాడుతుంది.

అయితే ఫైనల్ మ్యాచ్ జరిగే అహ్మదాబాద్‌లో వాతావరణ పరిస్థితులు ఇప్పుడు హాట్ టాపిక్‌గా కీలకంగా మారింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం గుజరాత్‌లో మే 30 నుంచి జూన్ 2 వరకు ప్రీ-మాన్‌సూన్ వర్షాలు కురిసే అవకాశముంది. ముఖ్యంగా అహ్మదాబాద్ సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో అభిమానుల్లో ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అడ్డుపడితే విజేతను ఎలా నిర్ణయిస్తాని.

అయితే ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఫైనల్ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా రిజర్వ్ డే ఏర్పాటు చేశారు. మే 31న మ్యాచ్ పూర్తిగా జరగకపోయినా లేదా మధ్యలో ఆగిపోయినా, మరుసటి రోజు జూన్ 1న మ్యాచ్‌ ను కొనసాగిస్తారు. ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే ఆట మొదలవుతుంది. రిజర్వ్ డే రోజున కూడా వర్షం ప్రభావం ఉంటే అంపైర్లు ఓవర్ల సంఖ్యను తగ్గించే అవకాశం ఉంటుంది. మ్యాచ్ ఫలితం రావాలంటే రెండు జట్లూ కనీసం 5 ఓవర్లు ఆడాలి. అలాంటి పరిస్థితుల్లో డక్‌వర్త్ లూయిస్ స్టెర్న్ (DLS) విధానం ద్వారా ఫలితాన్ని నిర్ణయిస్తారు. అయితే రెండు రోజులు కూడా పూర్తిగా వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోతే మరో కీలక నిబంధన అమల్లోకి వస్తుంది. ట్రోఫీని రెండు జట్లకు పంచడం కాకుండా.. లీగ్ స్టేజ్ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న జట్టునే ఛాంపియన్‌గా ప్రకటిస్తారు. ఈ రూల్ వర్తిస్తే RCB మరోసారి ఛాంపియన్ గా నిలుస్తుంది.

ఈ సీజన్ లీగ్ దశ ముగిసే సమయానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మెరుగైన నెట్ రన్‌రేట్‌తో అగ్రస్థానంలో నిలిచింది. కాబట్టి ఫైనల్ పూర్తిగా రద్దైతే ఐపీఎల్ 2026 టైటిల్ ఆర్‌సీబీకే దక్కుతుంది. ఇదిలా ఉంటే అభిమానులకు మరో ఊరటనిచ్చే విషయం కూడా ఉంది. తాజా వాతావరణ అంచనాల ప్రకారం మే 31 సాయంత్రం అహ్మదాబాద్‌లో భారీ వర్ష సూచనలు లేవు. ఆకాశంలో మేఘాలు తక్కువగానే ఉండే అవకాశం ఉందని, వర్షం పడే అవకాశాలు కూడా చాలా స్వల్పమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీంతో ఫైనల్ మ్యాచ్ ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ചിക്കനും ബീഫുമെല്ലാം വാങ്ങി, പണം മുഴുവന്‍ നല്‍കാതെ മുങ്ങി; അജസുന്ദരി സിനിമാ പ്രവര്‍ത്തകര്‍ക്കെതിരെ പരാതിയുമായി വ്യാപാരികള്‍

കോഴിക്കോട്: റിലീസിനൊരുങ്ങുന്ന ആഷിഖ് അബു ചിത്രം അജസുന്ദരിയുടെ അണിയറ പ്രവര്‍ത്തകര്‍ പലചരക്ക്...

இனி ரூபாய் நோட்டு பேப்பரில் வராது; 'பிளாஸ்டிக்கில்' வரப்போகிறது? – RBI-க்கு ஏன் இந்த யோசனை?

இதுவரை இந்திய ரூபாய் நோட்டுகளைத் தாள்களில் தானே பார்த்திருக்கிறோம். இனி பிளாஸ்டிக்கில்...

ನಾನು ಸಚಿವ ಸ್ಥಾನದ ಆಕಾಂಕ್ಷಿಯಲ್ಲ: ಡಿಕೆಶಿ ಪದಗ್ರಹಣಕ್ಕೆ ಹೋಗಲು ತಯಾರಿ- ಶಾಸಕ ಸಿ.ಪಿಯೋಗೇಶ್ವರ್

ರಾಮನಗರ,ಮೇ,30,2026 (www.justkannada.in):  ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್  ಅಧಿಕಾರ ವಹಿಸಿಕೊಳ್ಳುವ...

മറ്റുള്ളവരുടെ ബ്രാന്‍ഡ് മൂല്യം വിറ്റ് കാശാക്കാന്‍ ഗൂഗിളിന് അവകാശമില്ല; ഹിന്‍ഡ് വെയര്‍ കേസില്‍ 30 ലക്ഷം രൂപ പിഴയിട്ട് ദല്‍ഹി ഹൈക്കോടതി

ന്യൂദല്‍ഹി: ബ്രാന്‍ഡ് നെയിമുകള്‍ പരസ്യ കീവേഡായി ലേലം വിളിക്കുന്നതിനെതിരെ ഗൂഗിളിന് പിഴ...