28
May, 2026

A News 365Times Venture

28
Thursday
May, 2026

A News 365Times Venture

Vaibhav Sooryavanshi: సచిన్ కలలు చూపించాడు.. ధోనీ నమ్మకం నేర్పించాడు.. కోహ్లీ గర్జించాడు.. ఇక వైభవ్ సూర్యవంశీ యుగం ప్రారంభమైందా..?

Date:

Vaibhav Sooryavanshi: భారతదేశంలో క్రికెట్ కేవలం ఒక ఆట కాదు, అది కోట్లాది మంది భావోద్వేగాలతో ముడిపడిన ఒక మతం. గత మూడు దశాబ్దాలుగా భారత క్రికెట్ అభిమానుల మనసులను ప్రభావితం చేసిన ముగ్గురు మహానుభావులు ఉన్నారు.. వాళ్లే క్రికెట్‌ గార్డ్‌ సచిన్ టెండూల్కర్, మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్ ధోనీ, కింగ్‌ విరాట్ కోహ్లీ. ఇప్పుడు అదే వరుసలో మరో కొత్త పేరు వేగంగా వినిపిస్తోంది. అతడే 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ భారత క్రికెట్‌లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికినట్టుగా కనిపించింది. కేవలం 29 బంతుల్లో 97 పరుగులు చేసిన ఈ టీనేజ్ బ్యాట్స్‌మన్, ప్రపంచ స్థాయి బౌలర్లను ఎలాంటి భయం లేకుండా చితక్కొట్టాడు.

సచిన్ నుంచి కోహ్లీ వరకు.. భారత క్రికెట్ భావోద్వేగాల ప్రయాణం
1990లలో భారతదేశం ఆర్థిక సంస్కరణలతో కొత్త దిశలో అడుగులు వేస్తున్న సమయంలో సచిన్ టెండూల్కర్ కోట్లాది మందికి ఆశగా మారాడు. అతని బ్యాటింగ్ భారతీయులకు కలలు కనడం నేర్పించింది. ఆ తర్వాత చిన్న పట్టణం నుంచి వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ, ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో దేశానికి చూపించాడు. ప్రశాంత స్వభావంతో మ్యాచ్‌లను ముగించే ధోనీ, భారత క్రికెట్‌కు కొత్త నమ్మకాన్ని ఇచ్చాడు. తరువాత విరాట్ కోహ్లీ వచ్చాడు. అతని దూకుడు, ఆత్మవిశ్వాసం, ప్రపంచాన్ని జయించాలనే తపన భారత క్రికెట్‌కు కొత్త దిశను చూపించింది. కోహ్లీ బ్యాటింగ్ అంటే ప్రత్యర్థులకు భయం. ఇప్పుడు అదే జాబితాలో వైభవ్ సూర్యవంశీ పేరు చేరేలా కనిపిస్తోంది.

ఒకే ఇన్నింగ్స్‌తో దేశ దృష్టిని ఆకర్షించిన వైభవ్
బీహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ గురించి గత ఏడాది నుంచే క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అతన్ని “భవిష్యత్తు స్టార్”, “అసాధారణ ప్రతిభ” అని పిలిచినా, అంత పెద్ద మ్యాచ్‌లో పాట్ కమిన్స్ లాంటి ప్రపంచ స్థాయి బౌలర్లను ఇలా చితక్కొడతాడని చాలా మంది ఊహించలేదు. కానీ, ఎలిమినేటర్ మ్యాచ్‌లో అతను ఆ అంచనాలన్నింటినీ చెరిపేశాడు. కేవలం భారీ షాట్లు కొట్టడమే కాదు, మ్యాచ్ పరిస్థితిని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్న తీరు అతని మానసిక బలాన్ని చూపించింది.

అండర్-19 వరల్డ్ కప్ నుంచే స్పష్టమైన సంకేతాలు
2026 అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ తరఫున 175 పరుగులు చేసినప్పుడే వైభవ్ తన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆ ఇన్నింగ్స్ ద్వారా అతను కేవలం సిక్సర్లు కొట్టే ఆటగాడు కాదని, ఒత్తిడిలోనూ మ్యాచ్‌ను మలచగలిగే సామర్థ్యం తనలో ఉందని నిరూపించాడు. ఇప్పుడు ఐపీఎల్ ఎలిమినేటర్‌లో అతని బ్యాటింగ్ ఆ మాటలను మరింత బలపరిచింది.

రికార్డుల వర్షం
సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై వైభవ్ సూర్యవంశీ ఆడిన ఇన్నింగ్స్‌లో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలుస్తూ క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. అలాగే ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించే అవకాశాన్ని కూడా కేవలం మూడు పరుగుల దూరంలో కోల్పోయాడు. 97 పరుగుల వద్ద బౌండరీ లైన్ వద్ద క్యాచ్‌గా ఔట్ కావడం అతనికి నిరాశ కలిగించినా, అభిమానుల హృదయాల్లో మాత్రం అతను ఇప్పటికే సెంచరీ సాధించాడు.

సంఖ్యలకు మించిన ప్రభావం
వైభవ్ బ్యాటింగ్‌ను ప్రత్యేకంగా నిలబెట్టింది కేవలం అతని స్ట్రైక్ రేట్ కాదు. అతని ఆత్మవిశ్వాసం, ప్రశాంతత, మ్యాచ్‌పై ఆధిపత్యం చూపించే తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. 145 కిలోమీటర్ల వేగంతో వచ్చిన బంతిని కూడా అతను ఎంతో ప్రశాంతంగా ఎదుర్కొన్న తీరు, అతని బ్యాటింగ్‌లోని మెచ్యూరిటీని చూపించింది. క్రికెట్ అభిమానులు అతనిలో సచిన్ టెండూల్కర్ స్వచ్ఛమైన టెక్నిక్‌ను, ధోనీలా బంతిని బలంగా పంపించే శక్తిని, కోహ్లీ తరహా ఆత్మవిశ్వాసాన్ని చూస్తున్నారు.

భారత క్రికెట్‌కు కొత్త సూపర్ స్టార్?
ఆధునిక టీ20 క్రికెట్‌లో భారీ షాట్లు కొట్టే ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధులను చేసే “ప్రెజెన్స్” చాలా కొద్దిమందికే ఉంటుంది. సచిన్ గౌరవాన్ని సంపాదించాడు. ధోనీ నమ్మకాన్ని కలిగించాడు. కోహ్లీ భయాన్ని సృష్టించాడు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ అభిమానుల్లో ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తున్నాడనే చెప్పాలి.. 15 ఏళ్ల ఈ యువ ఆటగాడు భారత క్రికెట్ భవిష్యత్తును కొత్త దిశలో నడిపించే సామర్థ్యం ఉన్న ఆటగాడిగా ఇప్పటికే కనిపిస్తున్నాడు. వేగంగా మారుతున్న టీ20 యుగానికి తగిన కొత్త తరం సూపర్ స్టార్‌గా వైభవ్ ఎదుగుతున్నాడనే భావన ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో బలపడుతోంది.. మరీ ఈ బుడ్డోడు.. అదే మన బేబీ బాస్‌ ఎప్పుడు.. టీమిండియాలో అడుగు పెట్టనున్నాడు.. ఎలాంటి ప్రదర్శన చూపించనున్నాడు.. ఎన్ని రికార్డులు తిరగరాయనున్నాడు.. ఎన్ని నయా రికార్డులు సృష్టించనున్నాడు.. అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഗോവധ നിരോധനം: സുപ്രീം കോടതിയെ സമീപിക്കുമോ അതോ സര്‍ക്കാരിന് ബുദ്ധിമുട്ടുണ്ടാക്കാതിരിക്കാന്‍ മിണ്ടാതിരിക്കുമോ; ലീഗിനോട് ഡി.എം.കെ

ചെന്നൈ: മദ്രാസ് ഹൈക്കോടതിയുടെ ഗോവധ നിരോധന ഉത്തരവില്‍ മുസ്‌ലിം ലീഗിനോട് ചോദ്യങ്ങളുമായി...

வேலூர்: குறைகளைச் சொன்ன தூய்மைப் பணியாளர்கள்; குறிப்பெடுத்துக்கொண்ட தவெக எம்எல்ஏ வினோத் கண்ணன்!

உலக பட்டினி தினத்தையொட்டி, வேலூர் சட்டமன்றத் தொகுதி த.வெ.க சார்பாக இன்றைய...

Kuwait-Iran: కువైట్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడి.. పశ్చిమాసియాలో టెన్షన్

అమెరికాతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని అమెరికా సెంట్రల్...

ಶಾಸಕ ಸ್ಥಾನದಿಂದ ಸಿಎಂ ಸ್ಥಾನದವರೆಗೆ: ಸಿದ್ದರಾಮಯ್ಯನವರ ಸುದೀರ್ಘ ರಾಜಕಾರಣದ ಹಾದಿ ಹೀಗಿತ್ತು..!

ಬೆಂಗಳೂರು, ಮೇ, 28,2026 (www.justkannada.in):  ಕೊಟ್ಟ ಮಾತಿನಂತೆ ಹೈಕಮಾಂಡ್ ಸಲಹೆಯಂತೆ...