Shocking Love Story: బీహార్ లోని కతిహార్‌లో ఒక లవ్ స్టోరీ చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. 22 ఏళ్ల యువతి, 60 ఏళ్ల వృద్ధుడితో ప్రేమలో పడింది. వీరిద్దరు ఏకాంతంగా ఒక నిర్మానుష్య ప్రాంతంలో గ్రామస్తులకు చిక్కడంతో కథ వేరే మలుపు తీసుకుంది. వీరిద్దరిని గ్రామంలోని ఒక గుడికి తీసుకెళ్లి, పూజారి సమక్షంలో వేద మంత్రాల మధ్య వివాహం జరిపించారు. ఇప్పుడు ఈ ప్రేమ పెళ్లి ఆ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరు గత 2 ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామస్తులు పెళ్లి చేస్తామని చెప్పినప్పుడు కూడా వీరిద్దరు సంతోషంగా ఒక్కటవ్వడానికి ఇష్టపడ్డారు.
కతిహార్ జిల్లాలోని మణిహరి బ్లాక్‌లో ఉన్న బాఘ్మారా పంచాయతీకి చెందిన 60 ఏళ్ల సుగ్రిమ్ పాశ్వాన్, బోలియా పంచాయతీకి చెందిన 22 ఏళ్ల యువతితో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరిద్దరు దాదాపుగా 2 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇద్దరి మధ్య 38 ఏళ్ల వయసు తేడా ఉన్నప్పటికీ గాఢంగా ప్రేమించుకున్నారు. చిన్న వయసు యువతి ఒక వృద్ధుడితో ఎలా ప్రేమలో పడిందని గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. ఈ పెళ్లి చూడటానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చాలా మంది ఈ పెళ్లి తంతును తమ ఫోన్లలో వీడియోలు తీశారు. ఇప్పుడు ఈ వివాహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాను ఇష్టప్రకారమే వివాహం చేసుకున్నానని యువతి చెబుతోంది. ప్రేమకు వయసుతో సంబంధం లేదని చెప్పే డైలాగ్, ఈ సంఘటనను చూస్తే తెలుస్తోంది.
बिहार के कटिहार में 60 साल के एक बुजुर्ग और एक महिला के बीच प्यार इतना गहरा हो गया कि…
दोनों लंबे समय से रिलेशनशिप में थे !
तभी दोनों की सहमति से ग्रामीण वालों ने दोनों की शादी स्थानीय मंदिर में करवा दी!#Katihar #ViralWedding pic.twitter.com/a9zaakFE1u— pk मौर्यवंश की बेटी
(@speak000000) May 15, 2026




(@speak000000) 

