22
September, 2026

A News 365Times Venture

22
Tuesday
September, 2026

A News 365Times Venture

MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్

Date:

ఎన్నికల్లో ఓటమి అంటే ఎవరూ జీర్ణించుకోలేరు. ఆ ఓటమి నుంచి వెంటనే తేరుకోలేరు. తిరిగి నార్మల్ స్థితికి రావడానికి చాలా సమయం పడుతుంది. అలాంటిది ఎంకే.స్టాలిన్ మాత్రం అందుకు భిన్నంగా ఓటమి నుంచి వెంటనే తేరుకున్నారు. తాజా ఎన్నికల ఫలితాల్లో సొంత నియోజకవర్గమైన కొళత్తూరులో ఓటమి పాలయ్యారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిని నియోజకవర్గ ప్రజలు ఓడగట్టారు. ఇది మామూలు విషయం కాదు. కానీ స్టాలిన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు.

ఫలితాలు వచ్చి కొన్ని గంటలైనా గడవక ముందే సొంత నియోజకవర్గం కొళత్తూరులో పర్యటించారు. ప్రజలను నేరుగా కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్‌లో పంచుకున్నారు. 15 ఏళ్ల పాటు తనను ఆదరించినందుకు గాను కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ నియోజకవర్గం నుంచే 10 ఏళ్లు ప్రతిపక్షంలోనూ.. ఐదేళ్లు అధికారంలో ఉన్నట్లు స్టాలిన్ తెలిపారు. తన శక్తిమేరకు సంక్షేమ పథకాలు అందించానని.. అంతేకాకుండా నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు మౌలిక వసతులు కూడా కల్పించానని.. ప్రజల సమస్యలు పరిష్కరించినట్లు పేర్కొన్నారు. తాను ఏర్పాటు చేసిన క్రీడా మైదానాలు, పార్కులు, లైబ్రరీలు, మ్యారేజ్‌ హాల్స్‌, బస్టాండ్లు, ఆస్పత్రులు, స్కూళ్లు, కాలేజీలను చూసి ఎంతో విశ్వాసంతో నిర్వర్తించాననే ప్రగాఢమైన సంతృప్తి కలిగిందన్నారు.

సోమవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో టీవీకే అతి పెద్ద పార్టీగా అవతరించింది. 234 స్థానాలకు గాను 108 స్థానాలు గెలుచుకుంది. డీఎంకే 75 స్థానాలకే పరిమితం అయింది. ఇక టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.

 


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಕಬಿನಿ ನಾಲೆಗಳಿಗೆ  ನೀರು ಹರಿಸುವಂತೆ ರೈತರಿಂದ  ಬೃಹತ್ ಪ್ರತಿಭಟನೆ, ಆಕ್ರೋಶ

ಮೈಸೂರು,ಸೆಪ್ಟಂಬರ್‌, 21,2026 (www.justkannada.in): ಕಬಿನಿ  ಜಲಾಶಯದಿಂದ ನಾಲೆಗಳಿಗೆ  ನೀರು ಹರಿಸುವಂತೆ...

ഐ.ഐ.ടി വിദ്യാര്‍ത്ഥിയുടെ മരണത്തില്‍ പ്രതിഷേധം: സൂര്യനാരായണ ദുല്ലയെ ഡീന്‍ സ്ഥാനത്ത് നിന്ന് നീക്കി

മുംബൈ: ഇന്ത്യന്‍ ഇന്‍സ്റ്റിറ്റ്യൂട്ട് ഓഫ് ടെക്‌നോളജി ബോംബെയിലെ വിദ്യാര്‍ത്ഥിയുടെ മരണത്തെ തുടര്‍ന്ന്...

வீரமணி பாலியல் வழக்கு: "அவரிடம் அதிக நிதி வாங்கியதே…" – நிர்மலின் குற்றச்சாட்டுக்கு RS பாரதி பதில்

ஜெம் நிறுவனத்தின் உரிமையாளர் வீரமணி பாலியல் வன்கொடுமை வழக்கு விவகாரம் தீவிரமாகி...

Pakistan: ఒకవైపు ఇమ్రాన్‌ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్

Pakistan: పాకిస్తాన్‌లో కీలక పరిణామాలు ఎదురవుతున్నాయి. పాకిస్తాన్ మాజీ ప్రధాని, జైలులో...