24
November, 2026

A News 365Times Venture

24
Tuesday
November, 2026

A News 365Times Venture

Donald Trump: ఎన్విడియా సీఈఓగా హువాంగ్ రీఎంట్రీ.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..

Date:

Donald Trump:  అమెరికా చిప్‌ తయారీ దిగ్గజం ఎన్విడియా సహ వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్‌ను తిరిగి సీఈఓగా నియమించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. బోర్డు తీసుకున్న నిర్ణయం సరైనదని, అమెరికా ఆర్థిక వ్యవస్థతో పాటు ఎన్విడియా విజయానికి హువాంగ్ నాయకత్వం అవసరమని అన్నారు. ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టడం వల్ల అమెరికా జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదని ట్రంప్ స్పష్టం చేశారు. ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అటార్నీ జనరల్ కూడా హువాంగ్ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినట్లు తమ వద్ద ఆధారాలు లేవని ధృవీకరించినట్లు ఆయన ప్రస్తావించారు. జెన్సన్ తిరిగి సీఈఓగా నియమించాలనే బోర్డు నిర్ణయం సరైందని, హువాంగ్ గొప్ప దేశభక్తుడని, జాతీయ సంపద అని ట్రంప్ అభివర్ణించారు.

దీనికి ముందు, జెన్సన్ హువాంగ్‌కు సీఈఓ బాధ్యతలు కట్టబెట్టాలని ఎన్విడియా బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. తాజాగా అమెరికా ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి అధికారుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత హువాంగ్ పునర్నియామకంపై నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది. 1993లో ఎన్విడియాను సహ స్థాపించిన జెన్సన్ హువాంగ్ మూడు దశాబ్దాలకు పైగా కంపెనీకి నాయకత్వం వహిస్తున్నారు. అలిస్ హువాంగ్ అనే మహిళతో సంబంధం, ఆమె చైనాకు ఎన్విడియా చిప్‌లను అక్రమంగా తరలించిందనే ఆరోపణల నేపథ్యంలో ఆయన నవంబర్ 12న రాజీనామా చేశారు. తిరిగి 11 రోజులకే మళ్లీ సీఈఓగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മോദി ഭരണം ഇന്ത്യന്‍ ജനാധിപത്യ സ്ഥാപനങ്ങളെ ദുര്‍ബലപ്പെടുത്തുന്നു: ഹ്യൂമന്‍ റൈറ്റ്‌സ് വാച്ച് റിപ്പോര്‍ട്ട്

ലണ്ടന്‍: പ്രധാനമന്ത്രി നരേന്ദ്രമോദിയുടെ നേതൃത്വത്തിലുള്ള ഹിന്ദുത്വ ദേശീയവാദ സര്‍ക്കാര്‍ ഇന്ത്യയിലെ മനുഷ്യാവകാശങ്ങളും ജനാധിപത്യ...

ഷാഫി എ ഗ്രൂപ്പിന്റെ ഭാഗമല്ല; ഉണ്ണിത്താനെ പിന്തുണച്ച് മറിയാമ്മ ഉമ്മന്‍

കാസര്‍കോട്: ഷാഫി പറമ്പില്‍ എ ഗ്രൂപ്പില്‍ അല്ലെന്ന രാജ്‌മോഹന്‍ ഉണ്ണിത്താന്റെ പരാമര്‍ശത്തെ...

வழக்கமான இடத்தில் தீபம்; தூணில் தீபமேற்றாததால் போராட்டம்… பதற்றம்… போர்க்களமான திருப்பரங்குன்றம்

திருப்பரங்குன்றத்தில் உள்ள தூணில் கார்த்திகை தீபத்தன்று தீபம் ஏற்ற வேண்டும். இதற்கு...