22
September, 2026

A News 365Times Venture

22
Tuesday
September, 2026

A News 365Times Venture

Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్‌కు కలిసొచ్చింది ఇదే…

Date:

భారతదేశ ఎన్నికల ముఖచిత్రం ప్రస్తుతం భారీ మార్పులకు లోనవుతోంది. ముఖ్యంగా జన్-జీ (Gen-Z) , మిల్లీనియల్ తరం ఓటర్లు రాజకీయ గమనాన్ని మార్చే నిర్ణాయక శక్తులుగా అవతరించారు. తమిళనాడు నుంచి పశ్చిమ బెంగాల్ వరకు యువత ఆలోచనా ధోరణి ప్రాంతీయ రాజకీయాల పునాదులను కదిలిస్తోంది.

తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం సరికొత్త అధ్యాయం మొదలైంది. దాదాపు 2.28 కోట్ల మంది యువ ఓటర్లు (20-40 ఏళ్ల వారు) ఈసారి సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఆలోచించారు. గత ఆరు దశాబ్దాలుగా డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యే సాగుతున్న పీఠాలాటను చూసి విసిగిపోయిన యువతకు, నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ఒక ప్రత్యామ్నాయంగా కనిపించింది. డ్రగ్స్ రహిత రాష్ట్రం, గ్యారంటీ ఉద్యోగాలు, తనఖా లేని విద్యారుణాలు వంటి వాగ్దానాలు నేరుగా యువత అవసరాలను తాకాయి. కేవలం సినిమా అభిమానానికే పరిమితం కాకుండా, తమ అభిమాన నటుడిని రాజకీయ వేదికపైకి తీసుకురావడం ద్వారా తమ ఆకాంక్షలను నెరవేర్చుకోవాలని జెన్-జీ తరం భావించింది. స్టాలిన్ పాలనలో ఎదురైన నిరుత్సాహం వీరిని కొత్త నాయకత్వం వైపు నడిపించింది.

ఇతర రాష్ట్రాల్లో యువత పోకడలు..
తమిళనాడులో మార్పు కోసం ప్రయత్నిస్తే, మిగిలిన రాష్ట్రాల్లో యువత తమ సమస్యల ప్రాతిపదికన స్పందించారు. పశ్చిమ బెంగాల్ లో.. స్కూల్ సర్వీస్ కమిషన్ నియామకాల రద్దు యువతలో తీవ్ర ఆగ్రహాన్ని నింపింది. కోటి మందికి పైగా ఉన్న నిరుద్యోగులు ప్రభుత్వ నగదు పథకాలను లంచంగా భావించి తిరస్కరించడం విశేషం. అస్సాంలో దాదాపు 29 శాతం ఉన్న యువ ఓటర్లు తమ అస్తిత్వం కోసం ఓటు వేశారు. పౌరస్మృతి ఆందోళనలతో పెరిగిన చైతన్యం ఇక్కడ బీజేపీకి మూడోసారి అధికారాన్ని అందించడంలో కీలకమైంది.

కేరళలో.. విద్యావంతులైన యువత ‘నాణ్యమైన పరిపాలన’కు పట్టం కట్టారు. సోషల్ మీడియా ప్రభావం.. మౌలిక సదుపాయాల కల్పనపై వారు చూపిన ఆసక్తి ఫలితాలను తారుమారు చేసింది. మొత్తానికి.. ఈ ఎన్నికలు భారత రాజకీయాల్లో యువత ఒక నిశ్శబ్ద విప్లవమని నిరూపించాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

സ്വകാര്യ സര്‍വകലാശാലകള്‍ ലാഭം ലക്ഷ്യമിട്ട് പ്രവര്‍ത്തിക്കരുത്; അഞ്ച് വര്‍ഷത്തെ സാമ്പത്തിക കണക്കുകള്‍ തേടി സുപ്രീം കോടതി

ന്യൂദല്‍ഹി: സ്വകാര്യ സര്‍വകലാശാലകള്‍ ലാഭം ലക്ഷ്യമിട്ട് പ്രവര്‍ത്തിക്കുന്ന സ്ഥാപനമായി മാറാന്‍ അനുവദിക്കില്ലെന്ന്...

அரசியல் மேடைகளில் பெண் இழிவு வார்த்தைகள்… கடுமையான எதிர்வினைகளால் வைப்போம் முற்றுப்புள்ளி!

அரசியல் சச்சரவுகளில் எதிர்த்தரப்பினரை சீண்ட பெண்களை ஆபாசமாகப் பேசுவது ஒரு கலாசாரமாகவே...

Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట

Story Board: నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైంది. ఈ ఏడాది నైరుతి...

ಕಬಿನಿ ನಾಲೆಗಳಿಗೆ  ನೀರು ಹರಿಸುವಂತೆ ರೈತರಿಂದ  ಬೃಹತ್ ಪ್ರತಿಭಟನೆ, ಆಕ್ರೋಶ

ಮೈಸೂರು,ಸೆಪ್ಟಂಬರ್‌, 21,2026 (www.justkannada.in): ಕಬಿನಿ  ಜಲಾಶಯದಿಂದ ನಾಲೆಗಳಿಗೆ  ನೀರು ಹರಿಸುವಂತೆ...