19
April, 2026

A News 365Times Venture

19
Sunday
April, 2026

A News 365Times Venture

Jammu Kashmir: శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఇద్దరు అమెరికా పౌరుల అరెస్ట్..

Date:

Jammu Kashmir: శ్రీనగర్ విమానాశ్రయంలో ఇద్దరు అమెరికన్ పౌరుల్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరి సామాను నుంచి గార్మిన్ శాటిలైట్ ఫోన్ దొరికింది. ఎయిర్ పోర్ట్ అధికారులు వీరిని ప్రశ్నించారు, ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. అమెరికా మోంటానాకు చెందిన జెఫ్రీ స్కాట్ అనే వ్యక్తి లగేజీలో ఈ ఫోన్ లభించింది. విమానాశ్రయంలో సాధారణ భద్రతా తనిఖీల్లో ఇద్దరు పౌరుల్ని చెక్ చేయగా జీపీఎస్, శాటిలైట్ పరికరాలను కనుగొన్నారు. వీరిని ప్రశ్నించగా, సంతృప్తికర సమాధానాలు రాకపోవడంతో పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: PM Modi: లొంగిపోండి లేదంటే వదిలిపెట్టం.. టీఎంసీ గుండాలకు మోడీ ఫైనల్ వార్నింగ్..

జెఫ్రీ స్కాట్ మోంటానా నివాసి. పర్వతాలతో నిండి ఉండే ప్రాంతానికి చెందిన వాడు. అయితే, ఈ ఇద్దరు అమెరికన్ పౌరులు ఏ పని కోసం శ్రీనగర్ వచ్చారనే దానిపై, శాటిలైట్ ఫోన్ ఎందుకుంది అనే దానిపై విచారణ జరుగుతోంది. గతంలో కూడా చాలా మంది విదేశీయులు శాటిలైట్ ఫోన్‌తో పట్టుబడ్డారు. శాటిలైట్ ఫోన్లపై నిషేధం ఉందని తెలియని విదేశీయులు వీటిని భారత్ తీసుకుని వస్తున్నారు. అయితే, కాశ్మీర్ వంటి సున్నితమైన ప్రాంతంలో భద్రతా బలగాలు వీటిని తీవ్రంగా పరిగణిస్తాయి.

ఇరిడియం వంటి శాటిలైట్ ఫోన్లపై భారత్‌లో నిషేధం ఉంది. ఇలాంటివి తీసుకువస్తే ముందుగా ఎయిర్ పోర్ట్ కస్టమ్స్‌లో ముందుగానే తెలియజేయాలి. ఇదే కాకుండా DoT లైసెన్స్ కూడా అవసరం. లైసెన్స్ లేకుండా, ఫోన్‌ను స్వాధీనం చేసుకుంటారు. టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023 ప్రకారం, శాటిలైట్ ఫోన్ లేదా శాటిలైట్ GPS పరికరాన్ని కలిగి ఉండటానికి అనుమతి తీసుకోకపోతే, దానిని కూడా నేరంగా పరిగణించవచ్చు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മുഖ്യ തെരഞ്ഞെടുപ്പ് കമ്മിഷണർ ഗ്യാനേഷ് കുമാറിനെ നീക്കം ചെയ്യാൻ പുതിയ ശ്രമങ്ങളുമായി പ്രതിപക്ഷ പാർട്ടികൾ

ന്യൂ ദൽഹി: മുഖ്യ തെരഞ്ഞെടുപ്പ് കമ്മിഷണർ ഗ്യാനേഷ് കുമാറിനെ നീക്കം ചെയ്യാനുള്ള...

“பெண்களுக்கு எதிரான தீய எண்ணத்தோடு இந்த மசோதாவை திமுக, காங்கிரஸ் தடுத்து விட்டது" – அமித்ஷா

2026 தமிழ்நாடு சட்டமன்றத் தேர்தலுக்கான இறுதிகட்ட வாக்கு சேகரிப்பில் பா.ஜ.க- வின்...

ಕೃತಕ ಬುದ್ದಿಮತ್ತೆಗಾಗಿ ನಿಯಂತ್ರಕ ಚೌಕಟ್ಟು ರೂಪಿಸುವಲ್ಲಿ ನ್ಯಾಯಾಂಗ ನಿರ್ಣಾಯಕ ಪಾತ್ರ ವಹಿಸುತ್ತದೆ- ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಬೆಂಗಳೂರು,ಏಪ್ರಿಲ್,18,2026 (www.justkannada.in): ಭಾರತದಲ್ಲಿ ಕೃತಕ ಬುದ್ಧಿಮತ್ತೆಗಾಗಿ ನಿಯಂತ್ರಕ ಚೌಕಟ್ಟನ್ನು ರೂಪಿಸುವಲ್ಲಿ...

പാര്‍ട്ടിവിട്ട് ഫ്രറ്റേണിറ്റി മലപ്പുറം ജില്ലാ പ്രസിഡന്റ് ജംഷീല്‍ അബൂബക്കര്‍

മലപ്പുറം: വെല്‍ഫയര്‍ പാര്‍ട്ടി മലപ്പുറം ജില്ലാ സെക്രട്ടറി സ്ഥാനം രാജിവെച്ച് ജംഷീല്‍...