16
May, 2026

A News 365Times Venture

16
Saturday
May, 2026

A News 365Times Venture

Mrunal Thakur : హృతిక్ రోషన్‌ను చూసి నా మాజీ ప్రియుడు భయపడ్డాడు

Date:

బాలీవుడ్ మరియు టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మృణాల్ ఠాకూర్, ఇటీవల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది. తన కెరీర్ ఆరంభంలో ‘సూపర్ 30’ సినిమా షూటింగ్ సమయంలో తన మాజీ ప్రియుడు ఎదుర్కొన్న అభద్రతా భావం (Insecurity) గురించి ఆమె షేర్ చేసుకుంది.

బాలీవుడ్ లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ హృతిక్ రోషన్ సరసన ‘సూపర్ 30′ చిత్రంలో నటిస్తున్న సమయంలో, నా బాయ్ ఫ్రెండ్ చాలా ఆందోళనకు గురయ్యాడు. హృతిక్ వంటి అందగాళ్లు, ఫిట్‌గా ఉండే వ్యక్తుల మధ్య మృణాల్ షూటింగ్ చేస్తోందని తెలిసి, అతను తనను తాను నిరూపించుకోవాలని ప్రయత్నించాడు. నన్నుఎక్కడ కోల్పోతానో అన్న భయంతో అతను కష్టపడి వర్కవుట్స్ చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే అతను ఏకంగా 15 నుండి 17 కేజీల బరువు తగ్గి, మంచి కండరాలు పెంచి ఫిట్‌గా తయారయ్యాడు. అయితే, ఈ మార్పు ఎంతో కాలం కొనసాగలేదు. కొన్నాళ్ల తర్వాత అతను అకస్మాత్తుగా వ్యాయామం చేయడం మానేసి, విపరీతంగా తినడం మొదలుపెట్టాడు. దీనివల్ల అతను మళ్ళీ 20 కేజీల బరువు పెరిగాడు. అతని ప్రవర్తనలో వచ్చిన ఈ మార్పును చూసి నేను చాలా ఆశ్చర్యపోయను “ఏమైంది? ఎందుకు ఇలా చేస్తున్నావు?” అని ప్రశ్నించగా.. అతను ఎంతో నిరాశగా సమాధానమిచ్చాడట. “నీ చుట్టూ ఉన్న అందగాళ్లతో పోటీ పడలేక నేను అలసిపోయాను అందుకే వదిలేశాను” అని తన మనసులో మాట చెప్పాడు. అందం మరియు ఫిట్‌నెస్ విషయంలో ఇతరులతో పోల్చుకోవడం ఎంత ఒత్తిడికి గురిచేస్తుందో ఈ ఘటన ద్వారా తెలిసింది’ అని తెలిపింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

രാഹുൽ ഗാന്ധിയുടെ വിദേശയാത്രകളിൽ ദുരൂഹത; സാമ്പത്തിക സ്രോതസ്സ് വെളിപ്പെടുത്തണമെന്ന് കിരൺ റിജിജു

ന്യൂദൽഹി: കോൺഗ്രസ് നേതാവും ലോക്‌സഭാ എം.പിയുമായ രാഹുൽ ഗാന്ധിയുടെ വിദേശയാത്രകളെയും അതിനായി...

'ஆயிரம் கோடிக்கணக்கில் இந்தியாவில் இருந்து வெளியேறும் பணம்' இந்திய ரூபாய் மதிப்பு ரூ.96-க்கு சரிவு!

அமெரிக்க டாலருக்கு எதிரான இந்திய ரூபாயின் மதிப்பு தொடர்ந்து வீழ்ச்சியடைந்துகொண்டே வருகிறது....

Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..

Shocking Love Story: బీహార్ లోని కతిహార్‌లో ఒక లవ్ స్టోరీ...