4
May, 2026

A News 365Times Venture

4
Monday
May, 2026

A News 365Times Venture

కేవలం 6.3 సెకన్లలో 0-100 కిమీ వేగం.. భారత్‌లో BMW X3 30 xDrive M Sport Pro లాంచ్!

Date:

BMW X3 30 xDrive M Sport Pro: లగ్జరీ కార్ తయారీ సంస్థ BMW గ్రూప్ ఇండియా భారత మార్కెట్లో ఆల్-న్యూ BMW X3 30 xDrive M Sport Pro కారును అధికారికంగా లాంచ్ చేసింది. ఈ మోడల్ కార్లు చెన్నైలోని BMW గ్రూప్ ప్లాంట్‌లో ఈ వాహనం తయారవుతుండగా, దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌లలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ కొత్త పెట్రోల్ వేరియంట్ ఇప్పటికే అందుబాటులో ఉన్న xDrive 20 పెట్రోల్, xDrive 20d డీజిల్ వేరియంట్ల సరసన X3 లైన్-అప్‌లో చేరింది.

మెటల్ ఫ్రేమ్‌ ఫ్లాట్ డిజైన్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌లో రానున్న Lava Bold N2!

ఇంజిన్ & పనితీరు:
BMW X3 30 xDrive M Sport Pro కారులో 2.0 లీటర్, నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ అందించారు. ఇది గరిష్టంగా 258HP శక్తిని, 1,600 – 4,600 rpm మధ్య 400 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వాహనం 0-100 కిమీ వేగాన్ని కేవలం 6.3 సెకన్లలో అందుకుంటుంది. ఈ మోడల్‌లో BMW xDrive ఆల్-వీల్ డ్రైవ్ టెక్నాలజీ, 8-స్పీడ్ స్టెప్‌ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, 48V మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ స్టాండర్డ్‌గా అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు ఎలక్ట్రానిక్‌గా నియంత్రిత డ్యాంపర్లతో అడాప్టివ్ సస్పెన్షన్ కూడా ఉంటుంది.

Image (2)

ఎక్స్‌టీరియర్ డిజైన్:
వాహనం బ్లాక్ కిడ్నీ గ్రిల్ (ఇల్యూమినేషన్‌తో), 20-అంగుళాల M అలాయ్ వీల్స్, M స్పోర్ట్ బ్రేక్స్, అడాప్టివ్ LED హెడ్‌లైట్స్‌తో మరింత స్పోర్టీ లుక్‌ను అందిస్తుంది. ఈ SUV మొత్తం పొడవు 4,755 మి.మీ. కాగా.. వీల్‌బేస్ 2,865 మి.మీ. మాత్రమే.

AP New DWCRA Schemes 2026: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. మార్చి 8న రెండు కొత్త పథకాల ప్రారంభం!

ఇంటీరియర్ & ఫీచర్లు:
కార్ లోపల 12.3 అంగుళాల ఇన్ఫర్మేషన్ స్క్రీన్, 14.9 అంగుళాల కంట్రోల్ డిస్‌ప్లే కలిగిన కర్వ్డ్ డిస్‌ప్లే సెటప్ అందించారు. ఇంకా ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌ను సెన్సాటెక్ మెటీరియల్‌తో అలంకరించారు. స్పోర్ట్స్ సీట్లు, పానోరమిక్ గ్లాస్ సన్‌రూఫ్, హార్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్, BMW కనెక్టెడ్ డ్రైవ్ సేవలు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి.

ధర & కలర్ ఆప్షన్లు:
BMW X3 30 xDrive M Sport Pro బృక్లిన్ గ్రే మెటాలిక్, డ్యూన్ గ్రే మెటాలిక్, అల్పైన్ వైట్, ఇండివిడ్యువల్ టాంజనైట్ బ్లూ, బ్లాక్ సఫైర్ మెటాలిక్ వంటి పలు రంగుల్లో లభిస్తుంది. ఇక కారును ఎక్స్-షోరూమ్ ధర రూ. 74,50,000గా నిర్ణయించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഖലിസ്ഥാനെ തീവ്രവാദികളെ രാജ്യസുരക്ഷാ ഭീഷണിയായി പ്രഖ്യാപിച്ച് കാനഡ

  ഒട്ടാവ: ഖലിസ്ഥാന്‍ തീവ്രവാദികളെ രാജ്യസുരക്ഷാ ഭീഷണിയായി പ്രഖ്യാപിച്ച് കാനഡ. രഹസ്യാന്വേഷണ...

4 States Election Results: அனல் பறக்கும் அரசியல் களம் – வெல்லப் போவது யார்? – நாளை வாக்கு எண்ணிக்கை | Live Updates

புதுச்சேரி, கேரளா மற்றும் அஸ்ஸாம் ஆகிய மூன்று மாநிலச் சட்டமன்றத் தேர்தல்கள்...

Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక వార్త తీవ్ర సంచలనం సృష్టిస్తోంది....

മുഖ്യമന്ത്രി ഫേസ്ബുക്ക് ബയോ തിരുത്തിയത് ഇന്നല്ല, വോട്ടെണ്ണല്‍ കാരണവുമല്ല; പി.ബി അംഗമെന്ന് മാറ്റിയത് മാര്‍ച്ച് 16ന്

തിരുവനന്തപുരം: വോട്ടെണ്ണലിന് തൊട്ടുമുമ്പ് മുഖ്യമന്ത്രി പിണറായി വിജയന്‍ തന്റെ ഫേസ്ബുക്ക് ബയോ തിരുത്തിയെന്ന...