27
June, 2026

A News 365Times Venture

27
Saturday
June, 2026

A News 365Times Venture

Naveen Reddy : మిస్టర్ టీ యజమాని నవీన్ రెడ్డికి 6 నెలల నగర బహిష్కరణ

Date:

Naveen Reddy : రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాలపై మిస్టర్ టీ బ్రాండ్ యజమాని నవీన్ రెడ్డికు నగరంలో 6 నెలల పాటు బహిష్కరణ విధించబడింది. ఆదిభట్ల పోలీస్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడని పోలీసుల నివేదికల ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నవీన్ రెడ్డి పై ఐదు కేసులు నమోదు కాగా, సాక్షులను బెదిరిస్తూ, నగరంలో కలవరం సృష్టిస్తున్నట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు. ఆదిబట్ల ఇన్స్పెక్టర్, ఇబ్రహీంపట్నం ఏసీపీ నివేదికల ఆధారంగా సీపీ సుధీర్ బాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా, 2022లో డెంటల్ విద్యార్థిని నిశ్చితార్థ వేడుకలో తన గ్యాంగ్‌తో కిడ్నాప్ చేసిన ఘటన, అలాగే డెంటల్ డాక్టర్ ఇంట్లో హంగామా చేసి ఆస్తి ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన ఆరోపణలు నవీన్ రెడ్డి పై ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.

Viral Video : గాల్లో ప్రీ వెడ్డింగ్ షూట్ .. తేడా కొడితే.. అంతే సంగతులు

అదేవిధంగా, బాధిత విద్యార్థిని , ఆమె కుటుంబాన్ని నిరంతరం బెదిరిస్తున్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి లాంఛనక సంఘటనల కారణంగా పీడీ యాక్ట్ కూడా ఇప్పటికే అమలు చేయబడినట్లు పోలీసులు తెలిపారు. రాచకొండ సీపీ చర్య తర్వాత, మిస్టర్ టీ యజమాని నవీన్ రెడ్డి కోసం ఇది పెద్ద షాక్‌గా మారింది. ఈ నిర్ణయం స్థానికంగా , వ్యాపార పరిషరాల్లో చర్చలకు దారితీస్తుందని, నగర శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు తమ చర్యల్లో సీరియస్‌గా ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు.

Supreme court: ‘‘ ఉరిశిక్ష ’’ మార్పుకు కేంద్రం సిద్ధంగా లేదు.. సుప్రీంకోర్టు ఆక్షేపణ..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..

CM Yogi: అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర...

ಅಯೋಧ್ಯೆ ರಾಮಮಂದಿರ ಕಾಣಿಕೆ ದುರುಪಯೋಗ: ಇಬ್ಬರು ಅರೆಸ್ಟ್

ನವದೆಹಲಿ,ಜೂನ್,26,2026 (www.justkannada.in): ಅಯೋಧ್ಯೆಯ ರಾಮಮಂದಿರದ ಕಾಣಿಕೆ ದುರುಪಯೋಗ ಪ್ರಕರಣದ ತನಿಖೆ...

ധര്‍മേന്ദ്ര പ്രധാനെ പുകഴ്ത്തുമ്പോള്‍ പ്രധാനമന്ത്രി ഈ കുട്ടികളെക്കുറിച്ച് ഓര്‍ക്കുകയെങ്കിലും ചെയ്തിട്ടുണ്ടോ: രാഹുല്‍ ഗാന്ധി

ന്യൂദല്‍ഹി: നീറ്റ് ചോദ്യച്ചോര്‍ച്ചയടക്കമുള്ള വിഷയങ്ങളില്‍ പ്രതിഷേധം തുടരുന്നതിനിടെ കേന്ദ്ര വിദ്യാഭ്യാസ മന്ത്രി...

`ஈஷாவில் அடுத்தடுத்து மரணங்கள்; செயல்பாடுகளில் மர்மம்; CBCID விசாரணை வேண்டும்' – பெ.சண்முகம் அறிக்கை

`ஈஷாவில் அடுத்தடுத்து மரணங்கள் நடக்கிறது. இது குறித்து சி.பி.சி.ஐ.டி விசாரணை வேண்டும்'...