27
June, 2026

A News 365Times Venture

27
Saturday
June, 2026

A News 365Times Venture

Women’s World Cup 2026: రన్‌రేట్ ప్లస్.. కానీ ఆసీస్‌తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్‌కు ఉన్న అవకాశాలివే..

Date:

Women’s World Cup 2026 – India: 2026 మహిళల ప్రపంచకప్‌లో గ్రూప్ A నుండి సెమీఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గ్రూప్ A లోని జట్లన్నీ నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాయి. అయితే ఇందులో ప్రస్తుతం ఆస్ట్రేలియా, భారత్, దక్షిణాఫ్రికా జట్లు నాకౌట్ బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా వరుసగా నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించి దాదాపు సెమీఫైనల్ స్థానం ఖాయం చేసుకుంది. మరోవైపు భారత్, దక్షిణాఫ్రికా జట్లు చెరో మూడు విజయాలతో 6 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి.

ప్రస్తుతం భారత్‌కు నెట్ రన్‌రేట్ భారీగా ప్లస్‌లో ఉండటం పెద్ద ఊరటనిచ్చే అంశం. భారత జట్టు నెట్ రన్‌రేట్ +2.268 కాగా, దక్షిణాఫ్రికా +0.734తో ఉంది. దీంతో చివరి మ్యాచ్‌ల ఫలితాలు సెమీస్ అవకాశాలను నిర్ణయించనున్నాయి.

దక్షిణాఫ్రికా ఓడితే భారత్‌కు నేరుగా సెమీస్:

దక్షిణాఫ్రికా తన చివరి లీగ్ మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో అద్భుతం జరిగి బంగ్లాదేశ్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడితే.. భారత్ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా సెమీఫైనల్‌కు చేరుతుంది. దీనికి కారణం.. రెండు జట్లకు 6 పాయింట్లు సమానంగా ఉన్నా, భారత్ నెట్ రన్‌రేట్ చాలా మెరుగ్గా ఉండటం.

Image (4) (1)

దక్షిణాఫ్రికా గెలిస్తే.?

ఒకవేళ దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్‌పై విజయం సాధిస్తే.. ఆ జట్టు 8 పాయింట్లతో ముందుకు వెళ్తుంది. ఈ పరిస్థితిలో భారత్ కూడా ఆస్ట్రేలియాపై తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. భారత్ విజయం సాధిస్తే ఆస్ట్రేలియా, భారత్, దక్షిణాఫ్రికా మూడు జట్లు 8 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. అప్పుడు సెమీఫైనల్‌కు వెళ్లే రెండు జట్లను నెట్ రన్‌రేట్ ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రస్తుతం భారత్ రన్‌రేట్ దక్షిణాఫ్రికా కంటే చాలా మెరుగ్గా ఉండటంతో టాప్-2లో నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఓడితే టోర్నీకి గుడ్‌బై:

భారత్ తన చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి, అదే సమయంలో దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్‌పై గెలిస్తే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. అప్పుడు దక్షిణాఫ్రికా 8 పాయింట్లతో సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తే.. భారత్ 6 పాయింట్లతోనే నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది.

కీలకంగా ఆస్ట్రేలియా మ్యాచ్:

మొత్తానికి భారత మహిళల జట్టుకు ఆస్ట్రేలియాతో జరిగే చివరి లీగ్ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. నెట్ రన్‌రేట్ పరంగా భారత్ బలంగా ఉన్నప్పటికీ.. సెమీఫైనల్ బెర్త్‌పై ఎలాంటి సందేహాలు లేకుండా ముందుకు వెళ్లాలంటే ఆస్ట్రేలియాపై విజయం సాధించడమే ఉత్తమ మార్గం.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಅಯೋಧ್ಯೆ ರಾಮಮಂದಿರ ಕಾಣಿಕೆ ದುರುಪಯೋಗ: ಇಬ್ಬರು ಅರೆಸ್ಟ್

ನವದೆಹಲಿ,ಜೂನ್,26,2026 (www.justkannada.in): ಅಯೋಧ್ಯೆಯ ರಾಮಮಂದಿರದ ಕಾಣಿಕೆ ದುರುಪಯೋಗ ಪ್ರಕರಣದ ತನಿಖೆ...

ധര്‍മേന്ദ്ര പ്രധാനെ പുകഴ്ത്തുമ്പോള്‍ പ്രധാനമന്ത്രി ഈ കുട്ടികളെക്കുറിച്ച് ഓര്‍ക്കുകയെങ്കിലും ചെയ്തിട്ടുണ്ടോ: രാഹുല്‍ ഗാന്ധി

ന്യൂദല്‍ഹി: നീറ്റ് ചോദ്യച്ചോര്‍ച്ചയടക്കമുള്ള വിഷയങ്ങളില്‍ പ്രതിഷേധം തുടരുന്നതിനിടെ കേന്ദ്ര വിദ്യാഭ്യാസ മന്ത്രി...

`ஈஷாவில் அடுத்தடுத்து மரணங்கள்; செயல்பாடுகளில் மர்மம்; CBCID விசாரணை வேண்டும்' – பெ.சண்முகம் அறிக்கை

`ஈஷாவில் அடுத்தடுத்து மரணங்கள் நடக்கிறது. இது குறித்து சி.பி.சி.ஐ.டி விசாரணை வேண்டும்'...

ತೆರಿಗೆ ವಂಚನೆ ಮತ್ತು ತೆರಿಗೆ ಸೋರಿಕೆ ಸಂಪೂರ್ಣ ತಡೆಗೆ ಕಟ್ಟುನಿಟ್ಟಿನ ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಿ- ಸಿಎಂ ಡಿಕೆಶಿ ಸೂಚನೆ

ಬೆಂಗಳೂರು,ಜೂನ್,26,2026 (www.justkannada.in): ತೆರಿಗೆ ವಂಚನೆಗೆ ಯಾವುದೇ ಅವಕಾಶ ನೀಡಬಾರದು. ತೆರಿಗೆ...