16
May, 2026

A News 365Times Venture

16
Saturday
May, 2026

A News 365Times Venture

Cyber Fraud : వృద్ధుడి ఆధార్ కార్డు మానవ అక్రమ రవాణా కేసుల్లో

Date:

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ మధ్య వృద్ధులే లక్ష్యంగా అందినకాడికి దోచేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్ల ఆటకు మరో వృద్ధుడు దారుణంగా మోసపోయాడు. అతని వద్ద నుంచి ఏకంగా రూ. 80 లక్షలు కొట్టేశారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో 3 రోజులు ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేసేశారు. డిజిటల్ అరెస్ట్.. ఇది సైబర్ క్రిమినల్స్‌కు చాలా కీలకమైన పదం. దీన్ని ఉపయోగించి అమాయకులైన వారిని టార్గెట్ చేస్తున్నారు. వారి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ వృద్ధున్ని ఇలాగే మోసం చేశారు…

2025 జులై 12న బాధితుడికి గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తనకు తాను TRAI అధికారినని చెప్పుకున్నాడు. వృద్ధుడి ఆధార్ కార్డు ఆయనకే చూపించారు. అంతే కాదు ఆ ఆధార్ కార్డును మానవ అక్రమ రవాణా కేసుల్లో వాడారని చెప్పారు. దీనిపై కంబోడియా, మయన్మార్, ఫిలిప్పీన్స్ దేశాల్లో సైబర్ నేరాలకు సంబంధించి కేసు నమోదైందని చెప్పుకొచ్చారు. అంతే కాదు ఈ విషయంలో ఢిల్లీ పోలీసులు విచారణ చేస్తున్నారని భయపెట్టారు. ఇక తాము చెప్పిన దానికి రుజువులు అన్న విధంగా గతంలో వృద్ధుడి పేరు మీద ఉన్న కెనెరా బ్యాంక్ ఏటీఎం కార్డుతోపాటు నకిలీ సుప్రీం కోర్టు నోటీస్ చూపించారు. ఈ కేసులో మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని బెదిరించారు..

అప్పటికే కేటుగాళ్ల మాటలు నమ్మిన వృద్దుడు తీవ్రంగా భయాందోళనకు గురయ్యాడు. నిజానికి గతంలో బ్యాంక్ ఉద్యోగిగా పని చేసి రిటైరైనప్పటికీ.. కేటుగాళ్లు చెప్పిన విధంగా ఫాలో అయ్యాడు. కేసుల నుంచి విముక్తి కలిగించాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు పంపించాలని చెప్పారు సైబర్ క్రిమినల్స్. వారు చెప్పిన విధంగానే… ఆయా అకౌంట్లకు 80,64,002 రూపాయలు పంపించాడు. కాల్ కట్ చేసిన తర్వాత ఇది మోసమని గ్రహించాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు…

 

అసలు ‘డిజిటల్ అరెస్ట్’ అనే పదమే లేదని పోలీసులు చెబుతున్నారు. మోసగాళ్లు తరచూ TRAI, CBI, పోలీసు, ఇతర ప్రభుత్వ సంస్థల పేర్లను వాడి భయపెట్టే ప్రయత్నం చేస్తారని..కానీ అలాంటి వాటిని నమ్మవద్దంటున్నారు. CBI వారెంట్‌లు, FIRలు, సుప్రీంకోర్టు ఆర్డర్‌లు వంటి నకిలీ డాక్యుమెంట్లు చూపించి మోసం చేస్తారని.. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అంతే కాదు.. తెలియని వారికి బ్యాంక్ ఖాతా వివరాలు, OTP, వ్యక్తిగత సమాచారం ఎప్పుడూ ఇవ్వవద్దని… ఫోన్‌లో అసలే చెప్పవద్దని కోరుతున్నారు…

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഇറാന്‍ യുദ്ധത്തിനിടെ നെതന്യാഹുവിന്റെ രഹസ്യ യു.എ.ഇ സന്ദര്‍ശനം: മൊസാദ്, ഐ.ഡി.എഫ് തലവന്മാരും കൂടെയുണ്ടായിരുന്നതായി റിപ്പോര്‍ട്ട്

  ടെല്‍ അവീവ്: ഇറാനെതിരായ യുദ്ധത്തിനിടയില്‍ ഇസ്രഈല്‍ പ്രധാനമന്ത്രി ബെഞ്ചമിന്‍ നെതന്യാഹു...

ಬೆಂಗಾವಲು ವಾಹನ ಕಡಿಮೆ ಮಾಡಿದ ವಿಚಾರ: ಇವೆಲ್ಲ ನಾಟಕೀಯ ಎಂದ ಸಚಿವ ಎಂ.ಬಿ ಪಾಟೀಲ್

ವಿಜಯಪುರ,ಮೇ,15,2026 (www.justkannada.in): ಇಂಧನ ಮಿತ ಬಳಕೆಗೆ  ಪ್ರಧಾನಿ ಮೋದಿ ಕರೆ...

ഇതാണ് ഉത്തരവാദിത്തമുള്ള ഭരണം; എല്ലായിടത്തും കൂടി, എന്നാല്‍ ഇവിടെ അത്രയ്‌ക്കൊന്നുമില്ലല്ലോ; ഇന്ധനവിലവര്‍ധനവിനെ ന്യായീകരിച്ച് റിജിജു

ന്യൂദല്‍ഹി: രാജ്യത്ത് ഇന്ധനവില വര്‍ധിപ്പിച്ച കേന്ദ്ര സര്‍ക്കാര്‍ തീരുമാനത്തെ ന്യായീകരിച്ച് കേന്ദ്രമന്ത്രി...

த.வெ.க அரசின் அமைச்சரவை விரிவாக்கம் எப்போது? | பின்னணி தகவல்!

முதல்வர் விஜய் தலைமையிலான த.வெ.க அரசு பொறுப்பேற்று, இன்றுடன் ஆறு நாட்கள்...