15
May, 2026

A News 365Times Venture

15
Friday
May, 2026

A News 365Times Venture

Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్

Date:

ప్రస్తుతం భారత్‌లోనూ.. అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ కష్టాలు ప్రజలను ముప్ప తిప్పలు పెడుతున్నాయి. దీంతో ఆయా దేశాల్లో పొదుపు మంత్రం పాటిస్తున్నారు. ఇప్పుడు భారత్‌లో కూడా ప్రధాని దగ్గర నుంచి పౌరులంతా పొదుపు మంత్రం పాటిస్తున్నారు. ఇలాంటి తరుణంలో గుజరాత్‌లోని ఓ జానపద గాయకుడిపై లక్షల రూపాయల నోట్లు కుమ్మరించడం వివాదాస్పదమవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జునాగఢ్ జిల్లా ఖంభాలియా గ్రామంలో సంప్రదాయ ‘డైరో’ కార్యక్రమం జరిగింది. డైరో అనేది గుజరాత్‌లో సంగీతం, కథలు, హాస్యాన్ని మేళవించి నిర్వహించే ప్రత్యేక జానపద కార్యక్రమం. ఈ కార్యక్రమంలో గాయకుడు గోపాల్ సాధు హార్మోనియం వాయిస్తూ పాటలు పాడుతుండగా భక్తులు పరవసించిపోయారు. ఇంకేముంది.. బ్యాగుల నిండా భారీగా నోట్ల కట్టలను తీసుకొచ్చి కుమ్మరించారు. సంచుల్లో తీసుకొచ్చిన డబ్బును వేదికపైనే కుమ్మరించడంతో గోపాల్ సాధు దాదాపు నోట్ల కుప్పలో కనిపించకుండా పోయారు. అయినప్పటికీ ఆయన ఏ మాత్రం ఆగకుండా తన గానం కొనసాగించారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఇదే అసలు వర్క్ ఫ్రం హోమ్.. కూర్చొని నోట్ల వర్షంలో తడుస్తున్నారు” అంటూ ఒకరు కామెంట్ చేయగా.. “అంత డబ్బు మధ్యలో కూడా ప్రశాంతంగా పాడుతున్నారు” అంటూ మరొకరు స్పందించారు. ఇంకొందరు ఈ డబ్బును పేదల సంక్షేమానికి వినియోగించాలని సూచించారు.

ఇదే తరహా ఘటనలు గుజరాత్‌లో గతంలో కూడా చోటుచేసుకున్నాయి. 2023లో వల్సాద్‌లో నిర్వహించిన భజన కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు కీర్తిదాన్ గడ్వీపై కూడా రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్ల వర్షం కురిసింది. అలాగే 2022లో నవ్‌సారీలో జరిగిన మరో కార్యక్రమంలో ఆయనపై సుమారు రూ.50 లక్షల విలువైన నోట్లను భక్తులు కురిపించారు.

గుజరాత్‌లో జానపద సంగీత కార్యక్రమాల్లో గాయకులపై నగదు నోట్ల వర్షం కురిపించడం సాధారణమేనని స్థానికులు చెబుతున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా వచ్చిన మొత్తాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించే సంప్రదాయం కూడా ఉందని సమాచారం.

 

View this post on Instagram

 

A post shared by Gopal Sadhu (@thegopalsadhu)


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഇതാണ് ഉത്തരവാദിത്തമുള്ള ഭരണം; എല്ലായിടത്തും കൂടി, എന്നാല്‍ ഇവിടെ അത്രയ്‌ക്കൊന്നുമില്ലല്ലോ; ഇന്ധനവിലവര്‍ധനവിനെ ന്യായീകരിച്ച് റിജിജു

ന്യൂദല്‍ഹി: രാജ്യത്ത് ഇന്ധനവില വര്‍ധിപ്പിച്ച കേന്ദ്ര സര്‍ക്കാര്‍ തീരുമാനത്തെ ന്യായീകരിച്ച് കേന്ദ്രമന്ത്രി...

த.வெ.க அரசின் அமைச்சரவை விரிவாக்கம் எப்போது? | பின்னணி தகவல்!

முதல்வர் விஜய் தலைமையிலான த.வெ.க அரசு பொறுப்பேற்று, இன்றுடன் ஆறு நாட்கள்...

ಸೇತುವೆ ಮೇಲಿಂದ ಉರುಳಿ ಬಿದ್ದ ಟ್ರ್ಯಾಕ್ಟರ್ ಒಂದೇ ಕುಟುಂಬದ 6 ಮಂದಿ ಸಾವು

ಕೊಪ್ಪಳ, ಮೇ,15,2026 (www.justkannada.in):  ಹಿಂದಿನಿಂದ ಟ್ಯಾಂಕರ್ ಡಿಕ್ಕಿಯಾದ ಪರಿಣಾಮ ಸೇತುವೆ...

‘ഇതുകൊണ്ടാണ് ഇവരെ കോമാളി നിലവാരത്തില്‍ കാണുന്നത്’; സ്ഥാനമേല്‍ക്കാത്ത സര്‍ക്കാര്‍ വാഗ്ദാനം പാലിക്കാന്‍ ആവശ്യപ്പടുന്ന മഹിളാ മോര്‍ച്ച സമരത്തെക്കുറിച്ച് വി.ടി. ബല്‍റാം

കൊച്ചി: അധികാരത്തിലെത്തിയാല്‍ കെ.എസ്.ആര്‍.ടി.സി. ബസ്സുകളില്‍ സ്ത്രീകള്‍ക്ക് യാത്ര സൗജന്യമാക്കുമെന്നതായിരുന്നു ഇത്തവണ നിയമസഭാ...