23
September, 2026

A News 365Times Venture

23
Wednesday
September, 2026

A News 365Times Venture

Rukmini Vasanth : రుక్మిణి వసంత్ ను ఆ ఇద్దరు హీరోలే ఆదుకోవాలి

Date:

శాండిల్ వుడ్ కలిసొచ్చినట్లుగా కన్నడ కస్తూరీ రుక్మిణీ వసంత్‌కు టాలీవుడ్, కోలీవుడ్ అస్సలు అచ్చి రావడం లేదు. సప్తసాగరాలు దాచే ఎల్లోతో ఆమెకు వచ్చిన హైప్‌తో టాలీవుడ్ మేడమ్‌కు డోర్స్ ఓపెన్స్ చేసింది. నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడోకి ఎందుకు కమిటైందో కానీ బొమ్మ వచ్చిందీ వెళ్లిన విషయం కూడా తెలియదు. దీంతో ఫెర్మామెన్స్ ప్రదర్శించడానికి స్కోప్ లేకుండా పోయింది భామకు. టాలీవుడ్ భయంకరమైన రిజల్ట్ ఇస్తే తమిళంలో ఇదే సిచ్యుయేషన్ రిపీట్ అయ్యింది. విజయ్ సేతుపతి ఏస్‌లో నటించింది. రుక్మిణీ స్టన్నింగ్ లుక్స్ కు పడిపోయారు తమిళ తంబీలు. కానీ బొమ్మ బాక్సాఫీస్ దగ్గర బెడిసికొట్టింది.

Also Read : Tollywood : టాలీవుడ్ యంగ్ లవ్ కపుల్స్.. పెళ్లి పీటలు ఎక్కుతారా?

అయితే మదరాసితో గట్టెక్కెస్తాననుకుంటే సినిమా ఎంగేజింగ్‌గా లేదని టాక్ వచ్చింది. తుపాకీ, కత్తిని కలిపి మదరాసి అనే కొత్త కర్రీ వండడని మురుగుదాస్‌ను ఏకేస్తున్నారు. అయితే గుడ్డి కన్నా మెల్ల మేలు అన్నట్లుగా.. సికిందర్ కన్నా మదరాసి కాస్త బెటర్ అన్న ఫీలవుతున్నారు. ఆగస్టు 5న రిలీజైన మదరాసి మిక్స్ డ్ రివ్యూస్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా తమిళ్ లో సూపర్ స్టార్ట్ అందుకుంది. కానీ ఈ సినిమా రుక్మిణి కి ఆశించిన ఫలితం అయితే ఇవ్వలేదు. మరోవైపు రుక్మిణీ ఖాతాలో ప్లాప్స్ ఉన్నా కన్నడ ఇండస్ట్రీ అవేమీ పట్టించుకోకుండా భారీ ఆఫర్లు కట్టబెడుతోంది. కన్నడ హీరో రిషబ్ శెట్టి కాంతార ప్రీక్వెల్‌తో పాటు టాక్సిక్, తారక్- ప్రశాంత్ నీల్ మూవీలో హీరోయిన్‌గా ఫిక్సైనట్లు అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇక మేడమ్ హిట్ కొట్టడమే తరువాయి. రుక్మిణీ వసంత్‌ను ఇప్పుడు రిషబ్ శెట్టి, ఎన్టీఆర్ లే కాపాడాలి. రుక్మిణి కెరీర్ కు బిగ్గెస్ట్ హిట్ ఇవ్వాలి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

പിണറായി വിജയന്‍ പോയിട്ടില്ലേ, ഞാന്‍ ഇനിയും പോകും; പേരുവെളിപ്പെടുത്തേണ്ട ആവശ്യമില്ലെന്ന് വി.ഡി. സതീശന്‍

തിരുവനന്തപുരം: സ്വകാര്യവ്യക്തി അറേഞ്ച് ചെയ്ത വാഹനത്തിലാണ് യാത്ര ചെയ്തതെന്നും അതാരുടേതാണെന്ന് വെളിപ്പെടുത്തേണ്ട...

"IIT-களில் 45 மாணவர்கள் தற்கொலை; 62%க்கும் மேல் SC/ST/OBC மாணவர்கள்" – மாணிக்கம் தாகூர் கண்டனம்

"SC/ST/OBC மாணவர்களின் பாதுகாப்பு, சமத்துவம் மற்றும் கண்ணியத்தை உறுதி செய்ய மோடி...

Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!

పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ హార్ముజ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు...

വെസ്റ്റ് ബാങ്കിലെ ഇസ്രഈല്‍ അതിക്രമങ്ങളും ഭൂമി കൈയേറ്റവും വംശീയ ഉന്മൂലന സാധ്യത വര്‍ദ്ധിപ്പിക്കുന്നു: യു.എന്‍ സെക്രട്ടറി ജനറല്‍

ന്യൂയോര്‍ക്ക്: വെസ്റ്റ് ബാങ്കില്‍ ഇസ്രഈല്‍ നടത്തുന്ന അക്രമങ്ങളും കുടിയൊഴിപ്പിക്കലും അനധികൃത കുടിയേറ്റ...