18
April, 2026

A News 365Times Venture

18
Saturday
April, 2026

A News 365Times Venture

Ukraine-Russia: ఉక్రెయిన్‌పై రష్యా భీకరదాడులు.. డ్రోన్లు, క్షిపణులు ప్రయోగం

Date:

ఉక్రెయిన్-రష్యా మధ్య ఓ వైపు శాంతి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకోవైపు బాంబుల వర్షం కురుస్తూనే ఉంది. అలాస్కా వేదికగా పుతిన్‌తో ట్రంప్ చర్చలు జరిపారు. అనంతరం జెలెన్‌స్కీ, పశ్చిమ దేశాధినేతలతో కూడా చర్చలు జరిపారు. కానీ చర్చలు మాత్రం కొలిక్కి రాలేదు. ఇంతలోనే ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు పాల్పడింది. తాజాగా పుతిన్ చైనాలో సైనిక కవాతు వీక్షిస్తుండగా.. ఉక్రెయిన్‌పై రష్యా వైమానిక దాడులకు పాల్పడింది. ఉక్రెయిన్‌పై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. దీంతో నాటో మిత్రదేశమైన పోలాండ్ జెట్‌లతో యుద్ధానికి దిగింది.

ఇది కూడా చదవండి: China: అత్యంత శక్తివంతమైన అణు క్షిపణులను ప్రదర్శించిన చైనా.. ఎవరికి వార్నింగ్!

బుధవారం ఉక్రెయిన్ అంతటా వైమానిక దాడి సైరన్లు మోగాయి. రష్యా భారీ వైమానిక దాడిని ప్రారంభించింది. కైవ్ నుంచి పశ్చిమాన ఉన్న లివివ్, వోలిన్.. ఇలా 24 ప్రాంతాలను తాకాయి. దీంతో ఉక్రెయిన్ వైమానిక దళం తప్పికొట్టింది. మూడు క్షిపణులు, 69 స్ట్రైక్ డోన్లను 14 చోట్ల ఢీకొట్టాయి. కూలిన శిథిలాలు 14 చోట్ల పడిపోయాయి.

మాస్కో 502 మానవరహిత వైమానిక విమానాలు, 24 క్షిపణుల ప్రయోగించిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. పౌరులకు గాయాలయ్యాని పేర్కొన్నారు. ప్రజా మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లినట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి: Trump: ఆ ముగ్గురూ కలిసి అమెరికాపై కుట్ర.. చైనా కవాతుపై ట్రంప్ ఆరోపణలు

ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆగాలని ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రయత్నిస్తున్నారు. సౌదీ అరేబియా వేదికగా చర్చలు కూడా జరిగాయి. కానీ సత్ఫాలితాన్ని ఇవ్వలేదు. దీంతో ట్రంపే స్వయంగా రంగంలోకి దిగి పుతిన్, జెలెన్‌స్కీతో చర్చలు జరిపారు. అయినా కూడా ఫలితాన్ని ఇవ్వలేదు. తాజాగా యథావిధిగా రష్యా దాడులు చేస్తూనే ఉంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

"விஜய்க்குச் சரியான வழிகாட்டுதல் இல்லை" – தாடி பாலாஜி ஓப்பன் டாக்

கலப்பை மக்கள் இயக்க நிறுவனர் பி.டி.செல்வகுமார் ஏற்பாட்டில் நடிகர் தாடி பாலாஜி...

Iran-US Talks: ఇరాన్-అమెరికా తదుపరి చర్చలపై అప్‌డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..!

అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి చర్చలకు మార్గం సుగమం అయినట్లుగా తెలుస్తోంది. గత...

ಬ್ರೇಕಿಂಗ್ ನ್ಯೂಸ್ | UOM ಕುಲಪತಿ ಪ್ರೊ.ಲೋಕನಾಥ್  ವಿರುದ್ಧ FIR ದಾಖಲಿಸಲು ಸೂಚನೆ!

  ಮೈಸೂರು, ಏ.೧೭, ೨೦೨೬ : ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಅನುಸೂಚಿತ ಜಾತಿಗಳು...

വനിതാ സംവരണ ഭേദഗതി ബില്‍ ലോക്സഭയില്‍ പരാജയപ്പെട്ടു; എന്‍.ഡി.എ സര്‍ക്കാരിന് തിരിച്ചടി

ന്യൂദല്‍ഹി: വനിതാ സംവരണ നിയമത്തില്‍ ഭേദഗതി വരുത്തുന്നതിനുള്ള ഭരണഘടനാ ഭേദഗതി ബില്‍...