26
June, 2026

A News 365Times Venture

26
Friday
June, 2026

A News 365Times Venture

Fake Video on Pension: పెన్షన్‌పై ఫేక్‌ వీడియో.. మాస్‌ పుష్ప అరెస్ట్..

Date:

Fake Video on Pension: సోషల్‌ మీడియాలో వచ్చే వీడియోల్లో ఏది నిజమే తెలియని పరిస్థితి ఏర్పడింది.. కొందరు పనిగట్టుకొని.. నేతలపై, ప్రభుత్వాలపై, పార్టీలపై, వ్యక్తులపై తప్పుడు ప్రచారం నిర్వహించేందుకు వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో వదలడంతో.. విషయం తెలియనివాళ్లు వాటిని వైరల్‌ చేస్తున్నారు.. అయితే, శ్రీ సత్యసాయి జిల్లాలో కూటమి ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేసిన రమేష్ అలియాస్ మాస్‌ పుష్పను అరెస్ట్ చేశారు పోలీసులు.. నా మానసిక స్థితి బాగోలేక అలా చెప్పాను.. మద్యం మత్తులో మాట్లాడాను.. మా అమ్మకి వితంతు పెన్షన్ రాలేదని అలా వీడియో చేస్తే అయినా.. పెన్షన్ వస్తుందని తప్పుడు ప్రచారం చేశాను అంటున్నాడు రమేష్.. అంతే కానీ, నాకు చంద్రబాబు మీద , పవన్ కల్యాణ్‌ పై ఎలాంటి కక్ష లేదంటున్నాడు..

Read Also: Viral Video: ‘నాకు చావడం తప్ప వేరే మార్గం లేదు…’ మాజీ సీఎం మేనల్లుడి వీడియో వైరల్..

బుక్కపట్నం మండలం నార్సింపల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త అయిన పల్లెల రమేష్.. కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు.. పెన్షన్ రద్దు చేశారంటూ కూటమి ప్రభుత్వంపై ఫేక్ వీడియో చేశాడు.. రెండు చేతులు సక్రమంగా ఉన్నప్పటికీ తాను వికలాంగుడిని అంటూ వీడియోలో తప్పుడు ప్రచారం చేశాడు.. చంద్రబాబు నాయుడుకు ఓటు వేసినందుకు పెన్షన్ రద్దు చేశారంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.. అయితే, వీడియో వైరల్ కావడంతో టీడీపీ నేతలు జిల్లా ఎస్పీ రత్నాకు ఫిర్యాదు చేశారు.. ఎస్పీ ఆదేశాల రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు బుక్కపట్నం పోలీసులు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసినందుకు కేసు నమోదు చేశారు.. భవిష్యత్తులో ఫేక్ పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. అయితే, నాకు మానసిక పరిస్థితి బాగోలేదు, మందు తాగి వీడియో చేశా అని మీడియా ముందు ఒప్పుకున్నాడు రమేష్.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

രാമക്ഷേത്ര തട്ടിപ്പ്: ആറ് പേര്‍ കൂടി അറസ്റ്റില്‍; ചമ്പത്ത് റായും അനില്‍ മിശ്രയും രാജിവച്ചു

ലഖ്‌നൗ: അയോധ്യ രാമക്ഷേത്ര സംഭാവന തട്ടിപ്പില്‍ ആരോപണ വിധേയനായ ക്ഷേത്ര ട്രസ്റ്റ്...

ஆதார், பான், பாஸ்போர்ட்டெல்லாம் அல்ல… இவைதான் குடியுரிமைக்கான ஆதாரம்! – மத்திய அரசு சொல்வதென்ன?

'பாஸ்போர்ட் வெறும் போக்குவரத்து ஆவணம் தான்... குடியுரிமைக்கான ஆதாரம் அல்ல' -...

ಬಿಡದಿ ಟೌನ್ ಶಿಪ್ ಬಗ್ಗೆ ವರಿಷ್ಠರು ಪರಿಹಾರ ನೀಡ್ತಾರೆ- ಸಚಿವ ಸತೀಶ್ ಜಾರಕಿಹೊಳಿ

ಬೆಳಗಾವಿ,ಜೂನ್,26,2026 (www.justkannada.in): ಬಿಡದಿ ಟೌನ್ ಶಿಪ್ ಬಗ್ಗೆ ಗೊಂದಲ ಇರುವುದು...