22
September, 2026

A News 365Times Venture

22
Tuesday
September, 2026

A News 365Times Venture

Naveen Patnaik Hospitalized: ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం.. హెల్త్ అప్డేట్ ఏంటంటే..?

Date:

Naveen Patnaik Hospitalized: బిజూ జనతాదళ్ అధినేత, ఒడిశా ప్రతిపక్ష నాయకుడు 78 ఏళ్ల నవీన్ పట్నాయక్ అనారోగ్యంతో బాధపడుతూ భువనేశ్వర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. వయసు రీత్యా వచ్చిన సమస్యలతో ఆయన చికిత్స పొందుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. నవీన్ పట్నాయక్ ఆరోగ్యం గురించి పార్టీ ఎక్స్‌లో ఒక పోస్ట్‌ చేసింది. డీహైడ్రేషన్ కారణంగా ఆయన భువనేశ్వర్‌లోని ఆసుపత్రిలో చేరారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని, జగన్నాథుడి ఆశీస్సులు, ఒడిశా ప్రజల ప్రేమతో ఆయన త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని పోస్ట్‌లో పేర్కొంది.

READ MORE: Kethika Sharma : బాబోయ్.. ఇవేం అందాలు కేతిక

ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని పలు నివేదికలు తెలిపాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి యంత్రాంగం మరికొన్ని గంటల్లో ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. నవీన్ పట్నాయక్ ఆసుపత్రిలో చేరారనే వార్త బయటికి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన మద్దతుదారులు, శ్రేయోభిలాషులను ఆందోళనకు గురయ్యారు. అనేక మంది రాజకీయ నాయకులు, సాధారణ ప్రజలు ఆయన త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు. నవీన్ పట్నాయక్ ఇటీవల ముంబయిలో సర్వికల్ ఆర్థరైటిస్కు శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. అక్కడ ఆయన కొన్ని రోజులు నిపుణుల పర్యవేక్షణలో గడిపారు. ప్రస్తుత ఆయన అనారోగ్యం మరోసారి పార్టీ కార్యకర్తలలో ఆందోళనను రేకెత్తించింది.

READ MORE: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్దిగా సీపీ రాధాకృష్ణన్

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಸಮಸ್ಯೆ ಇಟ್ಟುಕೊಂಡು ರಾಜಕಾರಣ ಮಾಡುವ ಉದ್ದೇಶ ನನಗಿಲ್ಲ: ರೈತರು, ಜನರ ರಕ್ಷಣೆಗೆ ಬದ್ಧ-ಸಿಎಂ ಡಿ ಕೆ ಶಿವಕುಮಾರ್

ಬೆಂಗಳೂರು, ಸೆಪ್ಟಂಬರ್‌,21,2026 (www.justkannada.in): ರಾಜ್ಯದ ರೈತರು, ಜನರ ರಕ್ಷಣೆ ನನಗೆ...

അയോധ്യ രാമക്ഷേത്രക്കൊള്ള: സി.സി.ടി.വിയില്‍ 105 തവണ മോഷണം പതിഞ്ഞു; സുപ്രീം കോടതിയെ അറിയിച്ച് യു.പി സര്‍ക്കാര്‍

ലഖ്‌നൗ: അയോധ്യ രാമക്ഷേത്രത്തിലെ സംഭാവന മോഷണവുമായി ബന്ധപ്പെട്ട് സി.സി.ടി.വിയില്‍ 105 തവണ...

TN 07 CM 2031: சர்ச்சைக்குள்ளான திருமாவளவன் பயணித்த கார் எண்; என்ன சொல்கிறது விசிக?

சென்னை பூவிருந்தவல்லி அருகே உள்ள செம்பரம்பாக்கம் ஈவிபி (EVP) பிலிம் சிட்டியில்,...

Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్‌ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..

Italy: ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సంచలన నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇటలీ...