1
May, 2026

A News 365Times Venture

1
Friday
May, 2026

A News 365Times Venture

Srushti Fertility Case: ‘సృష్టి’ ఫెర్టిలిటీ కేసులో కలకలం.. మరో ఇద్దరి వైద్యుల అరెస్టు!

Date:

Srushti Fertility Case: వైద్య వర్గాల్లో ‘సృష్టి’ ఫెర్టిలిటీ కేసు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు వేగం పెంచింది. తాజాగా ఈ కేసులో విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్‌ (కేజీహెచ్)కు చెందిన ఇద్దరు వైద్యులను గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో మత్తు వైద్య విభాగాధిపతి డాక్టర్ వాసుపల్లి రవి కుమార్, ప్రసూతి విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉషాదేవి ఉన్నారు. ఇక వాసుపల్లి రవి కుమార్ మాజీ ఎమ్మెల్యే తమ్ముడు కావడంతో ఈ కేసులో మరో రాజకీయ కోణాన్ని తీసుక రాబోతుంది.

Infinix GT 30 5G+: షోల్డర్ ట్రిగర్స్ గేమ్ కంట్రోల్స్, 7,79,000+ AnTuTu స్కోర్తో నేడు లాంచ్ కానున్న ఇన్ఫినిక్స్ GT 30 5G+

ఇదివరకు ఇదే కేసులో అరెస్టయి, బెయిల్ పై విడుదలైన డాక్టర్ విద్యుల్లత కూడా కేజీహెచ్ పిల్లల విభాగంలో పనిచేశారు. ఈ వైద్యులు కేజీహెచ్‌లో విధులు నిర్వహిస్తూనే ‘సృష్టి’ ఫెర్టిలిటీ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించేవారని ఆరోపణలు ఉన్నాయి. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి ఈ అరెస్టులపై తనకు వివరాలు తెలియవని తెలిపారు. డాక్టర్ వాసుపల్లి రవి కుమార్ గత మూడు రోజులుగా సెలవులో ఉన్నట్లు సమాచారం.

ఇక మరో వైపు, ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతతో సంబంధాలు కలిగి ఉన్న ఇద్దరు వైద్యులు డాక్టర్ రమ్య, డాక్టర్ రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 28కి చేరింది. దర్యాప్తులో బయటపడ్డ వివరాల ప్రకారం, సరోగసి పేరుతో డాక్టర్ నమ్రత ఇప్పటి వరకు సుమారు 50 మంది బాధితుల వద్ద నుంచి రూ.20 కోట్లకు పైగా వసూలు చేశారు. మరో కీలక నిందితురాలు సంతోషి ఏజెంట్ల ద్వారా 18 మంది శిశువులను సేకరించినట్లు తేలింది.

Boycott G Pay- Phone Pay: ట్రెండింగ్లో “బాయ్‌కాట్ గూగుల్ పే, ఫోన్ పే”.. ఎందుకో తెలుసా..?

ముఖ్యంగా గిరిజన మహిళలను ప్రలోభపెట్టి వారి నుంచి శిశువులను రూ.5 లక్షలకు కొనుగోలు చేసి, తమ క్లయింట్లకు ఒక్కో శిశువును రూ.50 లక్షలకు విక్రయించినట్లు వెల్లడైంది. మొత్తం 80 మంది పిల్లలను అమ్మిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు డాక్టర్ నమ్రత బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. తల్లులను గుర్తించి శిశువులను తిరిగి వారికి అప్పగించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഡൂള്‍ന്യൂസ് അറിയിപ്പ്

ഇന്ന് മെയ് ഒന്ന്, സാര്‍വദേശീയ തൊഴിലാളി ദിനവും ഡൂള്‍ന്യൂസിന്റെ  18ാം വാര്‍ഷികവുമായതിനാല്‍...

ಬೌರಿಂಗ್ ಆಸ್ಪತ್ರೆ ಕಾಂಪೌಂಡ್ ದುರಂತ: ಕಾರ್ಯಪಾಲಕ ಇಂಜಿನಿಯರ್ ಅಮಾನತಿಗೆ ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಸೂಚನೆ

ಬೆಂಗಳೂರು, ಏಪ್ರಿಲ್, 30,2026 (www.justkannada.in):  ಬೌರಿಂಗ್ ಆಸ್ಪತ್ರೆ ಕಾಂಪೌಂಡ್ ಗೋಡೆ...