4
May, 2026

A News 365Times Venture

4
Monday
May, 2026

A News 365Times Venture

Gold Rate Today: భారీ షాకిస్తున్న బంగారం.. మళ్లీ లక్షకు చేరువలో పసిడి! వెండిపై ఏకంగా 4 వేలు

Date:

కొన్ని రోజుల కిందట లక్ష రూపాయలను టచ్ చేసిన బంగారం ధర.. ఆ తర్వాత ఊరటనిస్తూ దిగొచ్చింది. పసిడి ధర తగ్గుతుందని సంతోషించే లోపే మళ్లీ షాకిస్తోంది. వరుసగా మూడు రోజులు భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. లక్ష రూపాయలకు చేరువైంది. గురు, శుక్రవారాల్లో వరుసగా రూ.200, రూ.550 పెరిగిన పసిడి.. ఈరోజు రూ.650 పెరిగింది. దాంతో బులియన్ మార్కెట్‌లో శనివారం (జులై 12) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,710గా నమోదైంది. మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91,400గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,710గా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 91,400గా కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.91,550గా.. 24 క్యారెట్ల ధర రూ.99,860గా నమోదైంది. ప్రాంతాల వారీగా బంగారం ధరల్లో మార్పులు ఉంటాయన్న విషయం తెలిసిందే.

Also Read: Jasprit Bumrah: నేనేమీ కుర్రాడిని కాదు.. బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు!

మరోవైపు వెండి ధరలు కూడా షాక్ ఇస్తున్నాయి. వరుసగా వారం పాటు స్థిరంగా ఉన్న వెండి.. రెండు రోజులుగా పెరుగుతోంది. నిన్న కిలో వెండిపై రూ.1,000 పెరగగా.. ఈరోజు ఏకంగా రూ.4,000 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి నేడు రూ.1,15,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.1,25,000గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరులో కిలో వెండి రూ.1,15,000గా కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 10 గంటల వరకు గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్లో నమోదైన బంగారం, వెండి ధరలు ఇవి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

2027 അല്ല 2047 ആയാലും സമാജ്‌വാദി പാര്‍ട്ടി അധികാരത്തിലെത്തില്ല; അഖിലേഷിനെതിരെ പരിഹാസവുമായി യു.പി ഉപമുഖ്യമന്ത്രി

ലഖ്നൗ: ഉത്തര്‍പ്രദേശ് രാഷ്ട്രീയത്തില്‍ ഭരണകക്ഷിയായ ബി.ജെ.പിയും സമാജ്‌വാദി പാര്‍ട്ടിയും (എസ്.പി) തമ്മിലുള്ള...

Assembly Elections Results 2026: రిజల్ట్ డే.. తమిళనాడు, బెంగాల్ ఫలితాలపైనే ఉత్కంఠ..

Assembly Elections Results 2026: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి...

ഖലിസ്ഥാനെ തീവ്രവാദികളെ രാജ്യസുരക്ഷാ ഭീഷണിയായി പ്രഖ്യാപിച്ച് കാനഡ

  ഒട്ടാവ: ഖലിസ്ഥാന്‍ തീവ്രവാദികളെ രാജ്യസുരക്ഷാ ഭീഷണിയായി പ്രഖ്യാപിച്ച് കാനഡ. രഹസ്യാന്വേഷണ...