Best Family Cars: భారతదేశంలో కుటుంబంతో కలిసి ప్రయాణించాలంటే కేవలం మైలేజ్, స్టైల్ చూసి కారు ఎంచుకోవడం సరిపోదు. వీటితోపాటు అధిక ప్రాధాన్యత భద్రతకు ఇవ్వాలి. అందుకే 2025లో గ్లోబల్ NCAP ద్వారా క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సాధించిన టాప్ కార్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇవన్నీ ఎయిర్‌బ్యాగ్స్, ABS, ESP వంటి ఆధునిక భద్రతా ఫీచర్లతో పాటు, బలమైన బాడీ షెల్‌తో కూడా వస్తున్నాయి. మరి ఆ లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దామా..
టాటా పంచ్ (Tata Punch):
టాటా కంపెనీ నుంచి వచ్చిన ఈ కాంపాక్ట్ SUV చిన్న కుటుంబాల కోసం అద్భుతమైన ఎంపిక. టాటా పంచ్ భారత మార్కెట్‌లో ఒక చిన్న SUV అయినప్పటికీ, భారీ భద్రతా ప్రమాణాలతో వచ్చిన కారు. మొదటిసారి విడుదలైనప్పటి నుంచి దీని భద్రత మరియు బిల్డ్ క్వాలిటీపై చాలా పాజిటివ్ స్పందనలే వచ్చాయి. టాటా పంచ్ భద్రతా ఫీచర్ల పరంగా అత్యుత్తమ స్థాయిని అందిస్తోంది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్టులో అడల్ట్ ఆక్యుపెంట్లకు 5 స్టార్ రేటింగ్ పొందిన ఈ కారుకు హై స్ట్రెంగ్త్ స్టీల్‌తో నిర్మితమైన దుర్గమమైన బాడీ షెల్ ఉంటుంది. డ్రైవర్, ప్యాసింజర్ కోసం రెండు ఎయిర్‌బ్యాగ్స్, ABS with EBD వంటి ఫీచర్లు సురక్షిత బ్రేకింగ్‌కు సహాయపడతాయి.
కర్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్ (CSC) వలన వాహనం మలుపుల్లో అదుపులో ఉంటుంది. చిన్న పిల్లల కోసం ISOFIX చైల్డ్ సీటు మౌంట్స్ ఉండటం తల్లిదండ్రులకు నమ్మకాన్ని కలిగిస్తుంది. వెనుక పార్కింగ్ సెన్సార్లు, రియర్ వ్యూ కెమెరా (ఉన్నత వేరియంట్స్‌లో), ఫ్రంట్ ఫాగ్ లాంప్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్ (DRLs) వంటి ఫీచర్లు డ్రైవింగ్‌ను సురక్షితంగా, సౌకర్యవంతంగా చేస్తాయి. అంతేకాదు, వాహన శరీర నిర్మాణంలో క్రాష్ ఎనర్జీ షేర్ డిజైన్ ఉపయోగించడంతో ప్రమాద సమయంలో షాక్ అబ్సార్బ్ అయ్యేలా చేస్తుంది. ఇవన్నీ కలిపి, టాటా పంచ్‌ను దేశంలోనే అత్యంత భద్రత కలిగిన చిన్న SUVగా నిలబెట్టాయి.
Read Also:Motorola Edge 50 Fusion vs Vivo Y39 5G: మిడ్ రేంజ్‌లో బెస్ట్ ఫోన్ ఏది..? ఎందుకు..?
మహీంద్రా XUV 3XO:
పాత XUV300 మాదిరిగానే, కొత్త XUV 3XO కూడా అత్యుత్తమ భద్రతా ప్రమాణాలతో వస్తోంది. ముందున్న XUV300 మాదిరిగానే దీనికీ గ్లోబల్ NCAP టెస్ట్‌లో 5-స్టార్ భద్రతా రేటింగ్ ఉంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ABS with EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం (ESP), హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి కీలక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. వెనుక పార్కింగ్ కెమెరా, 360-డిగ్రీ వ్యూ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లతో డ్రైవింగ్ మరింత సురక్షితంగా ఉంటుంది.
అంతేకాదు, దీనిలో ADAS (Advanced Driver Assistance Systems) ఫీచర్లు కూడా కొన్ని వేరియంట్స్‌లో అందించబడ్డాయి. ఈ SUV బలమైన బిల్డ్ క్వాలిటీ, ప్రీమియం ఫీచర్లు మరియు విశ్వసనీయ భద్రతతో కుటుంబ వినియోగదారులకు ఒక సమర్థవంతమైన ఎంపికగా నిలుస్తోంది.
టాటా నెక్సన్ (Tata Nexon):
ఇండియన్ మార్కెట్‌లో భద్రతకు పెట్టింది పేరు టాటా నెక్సన్. 2025 వెర్షన్‌లో ESP, ట్రాక్షన్ కంట్రోల్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని 5 స్టార్ రేటింగ్ భారతీయ వినియోగదారులకు మరింత నమ్మకాన్ని ఇస్తుంది. బడ్జెట్‌తో మంచి స్పేస్ SUV కావాలంటే ఇది బెస్ట్ చాయిస్. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం (ESP), ABS with EBD, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, రేర్ వ్యూ కెమెరా, ISOFIX చైల్డ్ సీటు మౌంట్స్ వంటి అనేక ఆధునిక భద్రతా సదుపాయాలు ఉన్నాయి. అంతేకాదు, కారు బాడీ నిర్మాణంలో హై స్ట్రెంగ్త్ స్టీల్‌ను ఉపయోగించి, ప్రమాదాల సమయంలో గరిష్ఠ రక్షణ కలిగేలా రూపొందించారు. టాటా నెక్సన్ ధరలు 8 లక్షల నుండి ప్రారంభమవుతాయి (ఎక్స్-షోరూమ్). ఇది తన బలమైన నిర్మాణం, ఆధునిక ఫీచర్లు, అధిక భద్రతతో భారతీయ కుటుంబాల కోసం ఓ నమ్మదగిన ఎంపికగా నిలుస్తుంది.
Read Also:Shubman Gill: శుభ్‌మన్ గిల్ సెంచరీల మోత.. రికార్డులే రికార్డులు!
హ్యుందాయ్ వెర్నా (Hyundai Verna):
సెడాన్ కార్లలో భద్రతకు ప్రధాన ప్రాధాన్యం ఇచ్చే మోడల్ హ్యుందాయ్ వెర్నా. గ్లోబల్ NCAP 5 స్టార్ రేటింగ్ పొందిన వెర్నా, స్టైలిష్ లుక్, ప్రీమియం ఇంటీరియర్, స్పేసియస్ కేబిన్, ఇంకా రైడ్ క్వాలిటీ విషయంలోనూ ఆకట్టుకుంటుంది. సేఫ్టీతో పాటు లగ్జరీ కోరేవారికి ఇది సరైన ఎంపిక. భద్రత పరంగా హ్యుందాయ్ వెర్నా అత్యుత్తమమైన కారుల్లో ఒకటి. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో వెర్నా 5-స్టార్ భద్రతా రేటింగ్ సాధించి, భారతదేశంలో సురక్షితమైన సెడాన్‌లలో ఒకటిగా నిలిచింది.
ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్-స్టార్ట్ అసిస్ట్, అడాప్టివ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి ఆధునిక భద్రతా సదుపాయాలుంటాయి. అలాగే, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), రియర్ వ్యూ కెమెరా, పార్కింగ్ సెన్సార్లు వంటి భద్రతా సహాయక వ్యవస్థలు ఉన్నాయి.
స్కోడా కుషాక్ (Skoda Kushaq):
స్కోడా కుషాక్ ఒక ప్రీమియం కాంపాక్ట్ SUVగా భారత మార్కెట్‌లో మంచి గుర్తింపు పొందింది. స్టైల్, పనితీరు ఇంకా భద్రత పరంగా ఇది చాలా బలమైన కారుట్రాన్స్‌మిషన్ ఎంపికలలో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ (TC), మరియు 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ ఉన్నాయి. ఇందులో 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, వాయిస్ కంట్రోల్, కుషన్ సాఫ్ట్ డాష్‌బోర్డ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటి అధునాతన సదుపాయాలుంటాయి.
ఇక భద్రత విషయంలో స్కోడా కుషాక్ అత్యున్నత ప్రమాణాలు పాటిస్తుంది. ఇది గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ సాధించిన SUV. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ హోల్డ్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ISOFIX చైల్డ్ సీటు మౌంట్స్, రియర్ వ్యూ కెమెరా వంటి కీలక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. స్కోడా వాహనాలకు గుర్తింపు కలిగిన బలమైన బిల్డ్ క్వాలిటీ దీనిలోనూ కనిపిస్తుంది.