చెప్పేవి శ్రీరంగనీతులు… దూరేవి దొంగ గుడిసెలు అన్నట్టుంది అతగాడి యవ్వారం !! గుడి ఎనకా నా సామీ.. అన్నట్టు దేవుడి చాటున గలీజ్ దందా నడుపుతున్నాడు !! ఇంట్లో పూజలు.. హోమాలు చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చాడు కేటుగాడు. అనుమానంతో ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు షాక్ అయ్యారు. ఇంతకూ అతగాడి ఇంట్లో ఏం దొరికింది..? పూజల చాటున చేస్తున్న కంత్రీ పని ఏంటి..? చూస్తుంటే… ఎవరో ఆధ్యాత్మికవేత్త ఇల్లు ఉన్నట్టుంది అనుకుంటున్నారా..? సకల దేవతామూర్తుల చిత్రపటాలు ఉన్నాయి… పూజలు కూడా బాగా చేశారు అనుకుంటున్నారా..? ఇదిగిదిగో.. ఇప్పుడు చూడండి.. దేవుడి పటాల వెనుక ఉన్న ప్యాకెట్లు బయటపడుతున్నాయి. ఆ ప్యాకెట్లలో ఏముందో తెలుసా..? గంజాయి..
READ MORE: Narayanpet Murder Case: భర్తను చంపి సినిమాటిక్ డ్రామా క్రియేట్ చేసిన భార్య.. చిన్న క్లూతో..
నిజానికి ఈ ఇంట్లో గంజాయి ఉందని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఈ ఇంట్లో సెర్చ్ చేసేందుకు వచ్చారు. ఇల్లంతా కలియ దిరిగారు. కానీ ఎక్కడా గంజాయి ఆనవాళ్లు కనిపించలేదు. పైగా ఇంట్లోని వారంతా ఎలాంటి హైరానా పడకుండా సైలెంట్‌గా కూర్చున్నారు. వారి వాలకం చూసి అప్పటికే పోలీసులు అనుమానించారు. మరోవైపు ఇంటి యజమానిగా ఉన్న వ్యక్తి సైతం గంభీరంగానే ఉన్నాడు. కానీ పోలీసులు పూజ గది వైపు వెళ్లే సరికి అతని ముఖ కవళికల్లో మార్పు వచ్చింది. దీంతో దేవుడి చిత్ర పటాల వెనుక చూడగానే అసలు నిజం బయటపడింది.. ధూల్‌పేట్‌లో రోహన్ సింగ్ చేస్తున్న గంజాయి దందా బయటకు రావడంతో అతన్ని అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి గంజాయి తీసుకు వస్తున్నట్లుగా గుర్తించారు. మొత్తంగా అతని ఇంటి నుంచి 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.. రోహన్ సింగ్, యశ్వంత్ సింగ్ ముఠా ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తీసుకు వస్తోంది. దాన్ని 5, 10, 15, 20 గ్రాముల్లో చిన్న ప్యాకెట్లను తయారు చేసి విక్రయిస్తున్నారు. గచ్చిబౌలి మాదాపూర్‌తోపాటు ఐటి ఏరియాలో ఉన్న తమ ఏజెంట్లకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు..
READ MORE: Viral Video: ట్రెండింగ్‌లో పాకిస్థానీ మహిళ వీడియో.. అందులో ఏముందంటే..?